ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ క్యూ2లో రూ.4,151 కోట్ల నికర లాభం ఆర్జించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.3,544 కోట్లతో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేశ్ సుక్తాంకర్ చెప్పారు. ఆదాయం పెరగడం, వ్యయాలు తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వివరించారు.
నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతం: రుణాలు 22% వృద్ధి చెందాయని సుక్తాంకర్ తెలిపారు. ఫలితంగా గత క్యూ2లో రూ.7,994 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ2లో 22% వృద్ధితో రూ.9,752 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర (ఇతర) ఆదాయం 24% వృద్ధితో రూ.3,605 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. వడ్డీరేట్లను తగ్గించామని, ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ 0.10 శాతం తగ్గి 4.3 శాతానికి చేరిందని వివరించారు.
రెట్టింపైన కేటాయింపులు: గత క్యూ2లో 1.02%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.26%కి ఎగిశాయని సుక్తాంకర్ వివరించారు. 40 మొండి బకాయిల జాబితాలో తమ బ్యాంక్‌కు చెందిన ఖాతాలు రెండు ఉన్నాయని, వీటికి రూ.200 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. గత క్యూ2లో రూ.749 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో దాదాపు రెట్టింపై రూ.1,476 కోట్లకు పెరిగాయని తెలిపారు.
మంగళవారం ఇంట్రాడేలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,879ను తాకింది. అయితే ఫలితాలు వెల్లడయ్యాక రుణ నాణ్యతపై ఆందోళనతో 0.2% లాభంతో రూ.1,867 వద్ద ముగిసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.4,151 కోట్లు
Published Wed, Oct 25 2017 12:27 AM | Last Updated on Wed, Oct 25 2017 3:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment