చైనాలో ఐసీఐసీఐ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణ
షాంఘై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ చైనాలో కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఆర్థిక కేంద్రం షాంఘైలో శాఖను ప్రారంభించనుంది. మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని శనివారం ప్రారంభిస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం గల ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుతం 17 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.