ఆ గ్యాస్.. ఓఎన్‌జీసీదే
రిలయన్స్ విక్రయించిన గ్యాస్ వివాదంపై డీఅండ్‌ఎం తుది నివేదిక
న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంపై అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ డీఅండ్‌ఎం తుది నివేదికను రూపొందించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకు సంబంధించిన కృష్ణా గోదావరి బేసిన్ బ్లాకుల నుంచి దాదాపు రూ.11,000 కోట్ల విలువైన సహజ వాయువు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చె ందిన కేజీ-డీ6 బ్లాక్‌లోకి తరలివెళ్లిందనే వివాదంపై డీఅండ్‌ఎం తన తుది నివేదికను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)కు అందించిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి, ఓఎన్‌జీసీ కోల్పోయిన గ్యాస్‌కు నష్టపరిహారాన్ని ఎలా సమకూర్చాలనే అంశంపై ఒక నిర్ణయానికి రానుందని పేర్కొన్నారు. ఓఎన్‌జీసీ బ్లాకుల నుంచి రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్‌లోకి దాదాపు 11.122 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) గ్యాస్ తరలివెళ్లిందని డీఅండ్‌ఎం తెలిపింది.