సాధారణ స్థితికి కొత్త నోట్ల సరఫరా! | Remonetisation nearly complete, says Shaktikanta Das | Sakshi
Sakshi News home page

సాధారణ స్థితికి కొత్త నోట్ల సరఫరా!

Published Sat, Feb 4 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

సాధారణ స్థితికి కొత్త నోట్ల సరఫరా!

సాధారణ స్థితికి కొత్త నోట్ల సరఫరా!

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం... ప్రస్తుతం వ్యవస్థలో సాధారణ ద్రవ్య పరిస్థితులు దాదాపు నెలకొన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ముందు పరిస్థితి త్వరలో నెలకొనబోతోందనీ భరోసా ఇచ్చారు. ‘‘సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి వారానికి రూ.24,000 విత్‌డ్రాయెల్‌ పరిమితి మినహా, దాదాపు అన్ని ఆంక్షలూ తొలగిపోయాయి. ఈ పరిమితిని కూడా కాలక్రమంలో తొలగించడం జరుగుతుంది’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు.

ఇంకా ఇక్కడ ఆయన ఏమన్నారంటే...
నవంబర్‌ 8 డీమోనిటైజేషన్‌ తరువాత  90 రోజుల లోపే పరిస్థితిని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం జరిగింది.
కరెన్సీ సరఫరా, నిర్వహణ ఆర్‌బీఐ బాధ్యత. సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి వారానికి రూ.24,000 విత్‌డ్రాయెల్‌ పరిమితిని త్వరలో ఆర్‌బీఐ తొలగిస్తుంది.  
చిన్న స్థాయి విలువ నోట్ల పంపిణీని విస్తృతం చేయడానికి చర్యలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement