సాక్షి, ముంబై: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ, మిడ్ సెషన్ తరువాత మరింత డీలాపడ్డాయి. 169 పాయంట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 12,048 వద్ద స్థిరపడింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆటో కంపెనీలు నష్టపోగా, ప్రముఖ టెలికం సంస్థలు కాల్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు చేసిన ప్రకటన కారణంగా ఆయా కంపెనీల షేర్లు మాత్రం పరుగులు పెట్టాయి.
భారతి ఎయిర్‌టెల్ అత్యధిక లాభాలను ఆర్జించింది. ఇంకా రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాటెల్, ఓఎన్‌జీసీ, మారుతి సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయల 9 పైసలు ఎగిసి 71.65 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment