స్థిరాస్తి అమ్మితే పన్ను తగ్గుతోంది!! | Union Budget 2017: Ten proposals that are likely to influence real estate | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి అమ్మితే పన్ను తగ్గుతోంది!!

Published Mon, Feb 20 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

స్థిరాస్తి అమ్మితే పన్ను తగ్గుతోంది!!

స్థిరాస్తి అమ్మితే పన్ను తగ్గుతోంది!!

హోల్డింగ్‌ పీరియడ్‌ను రెండేళ్లకు తగ్గించిన ఫలితం
బేస్‌ ఇయర్‌ను మార్చటం వల్ల కూడా లాభమే


కేంద్రం తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం స్థిరాస్తి విక్రయాల సందర్భంలో పన్ను భారం తగ్గబోతోంది. అది ఎలానో చూద్దాం..

దీర్ఘకాలిక వ్యవధి తగ్గింపు
స్థిరాస్తి అమ్మే విషయంలో ప్రస్తుతం హోల్డింగ్‌ వ్యవధి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వ్యవధి రెండేళ్లకు తగ్గించారు. దీని వలన కలిగే ఊరట ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగస్తులు బదీలీల వలన ఊరు మారవలసి వస్తుంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు అవసరాన్ని బట్టి వలసపోతుంటారు. ఊరు మారకపోయినా ప్రతి కుటుంబంలో వాళ్ల వాళ్ల ప్రాధాన్యతలుంటాయి. పిల్లల పెళ్లి, చదువులు, అప్పలబారి నుంచి బయటపడటం ఇలా... ఇప్పుడు వ్యవధి తగ్గించడం వలన కొన్న తేదీ  నుంచి రెండేళ్లు దాటితే విక్రయించి 30 శాతం బదులుగా 20 శాతం పన్ను భారంతో బయటపడొచ్చు. లేదా ప్లానింగ్‌ ద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు.

బేస్‌ సంవత్సరం మారింది...
ప్రస్తుతం 1981వ సంవత్సరం ఆదిగా లేదా బేస్‌గా తీసుకొని క్యాపిటల్‌ గెయిన్స్‌ లెక్కించేవారు. 1981కి ముందు ఏర్పడ్డ స్థిరాస్తుల వాల్యుయేషన్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన కాగితాలు, రుజువులు లేక వాల్యుయేషన్‌ తక్కువకి సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని 2001గా మార్చారు. దీని వలన పన్ను భారం తగ్గటమే కాకుండా కాగితాలు తదితర రుజువులు పొందొచ్చు. దీంతో అసెస్‌మెంట్లు సజావుగా జరుగుతాయి. ఈ కింది ఉదాహరణ చూడండి..

1991లో కొన్న ధర రూ.10,00,000..... అప్పటి ద్రవ్యోల్బణ ఇండెక్స్‌ రేటు 199.
2017–18లో అమ్మకం ధర రూ.80,00,000.... 2017–18 ద్రవ్యోల్బణ ఇండెక్స్‌ రేటు 1,200
ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకున్నాక స్థిరాస్థి కొనుగోలు వ్యయం....

కొన్న ధర ్ఠ అమ్మిన ఏడాది ఇండెక్స్‌ / కొన్న ఏడాది ఇండెక్స్‌
10,00,000 ్ఠ 1,200 / 199  = 60,30,150; లాభం=రూ.19,69,850
ఈ లాభంపై మీ ఆదాయపు పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు గనక ఆ భూమిని అభివృద్ధి చేయటానికేవైనా ఖర్చులు పెట్టినట్లయితే వాటినీ మొత్తం వ్యయంలో చూపించొచ్చు.

బేస్‌ సంవత్సరాన్ని 2001గా మారిస్తే కలిగే లాభమిదీ...
1991లో కొన్న ధర 2001లో రూ.30,00,000 అనుకోండి... 2001–02లో ద్రవ్యోల్బణ ఇండెక్స్‌ రేటు 426
2017–18లో అమ్మకం ధర రూ.80,00,000... 2017–18లో ఇండెక్స్‌ రేటు 1,200

రూ.30,00,000  1,200/426 = రూ.84,50,704 అవుతుంది.
అమ్మిన ధర కన్నా కొన్న ధర ఎక్కువగా ఉంది కాబట్టి పన్ను భారం లేదు. ఇలా లబ్ధి పొందొచ్చు.

జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌
ఇన్నాళ్లూ జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ సంతకం అయిన రోజునే భూమి యజమాని మీద క్యాపిటల్‌ గెయిన్స్‌ విధించేవారు. ఎన్నో సందర్భాల్లో ప్రాజెక్టు పూర్తి కాకపోవటం, డెవలపర్‌ పారిపోవడం, కనిపించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇల్లు చేతికి రాకముందే పన్ను భారం పడేది. ఇక నుంచి ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత మాత్రమే పన్ను భారం విధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement