వొడాఫోన్ వండర్ ఫుల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ 4జీ వినియోగదారుల కోసం ఉచిత డేటా ఆఫర్ ప్రకటించింది. 1 జీబీ డేటా ధరకే 10 జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ మూడు నెలల పాటు ఉంటుందని తెలిపింది. ‘వొడాఫోన్ సూపర్ నెట్ వినియోగదారులు 1 జీబీ డేటాకు బిల్లు కడితే అదనంగా 9 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. కొత్త 4జీ హ్యాండ్ సెట్లతో ఇప్పుడు ఒక జీబీ ధరతో మూడు నెలల పాటు 10 జీబీ డేటా పొందవచ్చ’ని వోడాఫోన్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
వొడాఫోన్ సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్ ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు ఫ్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ ప్రకటించినట్టు వొడాఫోన్ తెలిపింది. తమ వినియోగదారులు 4జీ హ్యాండ్ సెట్లకు అప్ గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ను తెచ్చినట్టు వెల్లడించింది. వోడాఫోన్ సూపర్ నెట్ వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్నెట్ ను వినియోగించుకోవాలన్న ఆకాంక్షతో ఈ ఆఫర్ ప్రవేశపెట్టామని వొడాఫోన్ ఇండియా డైరెక్టర్(కమర్షియల్) సందీప్ కటారియా తెలిపారు.