ప్రకాశం ,బోగనంపాడు (పొన్నలూరు): మండలంలోని బోగనంపాడులో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూచింది. పోలీసుల కథనం ప్రకారం.. బోగనంపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక తన అన్నతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పక్క గ్రామం కె.అగ్రహారంలో విందుకు హాజరై సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి బాలిక నిరసంగా ఉండటంతో పాటు సాయంత్రానికి జర్వం వచ్చింది. బుధవారం ఉదయం కడుపులో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది.
బాలిక కుడి చెవి వద్ద గాయమై ఉండటంతో తల్లి ఏమైందని గట్టిగా ప్రశ్నించింది. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లితో చెప్పింది. కె. అగ్రహారంలో విందుకు హాజరై ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన కె.మహేంద్ర మార్గమధ్యంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కొట్టి నోరుమూసి లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని మహేంద్ర హెచ్చరించాడని రోదించింది. ఈ సంఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం బాధితురాలిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment