మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్, పక్కన జేసీ దివ్య
- కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్:
వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ద్వారా నియామకాలు నిర్వహించుకునే బాధ్యత శాఖాధిపతులదేనని, ఏజెన్సీల సెక్యూరిటీ బాండు పరిశీలించాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్యతో కలిసి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..అక్టోబర్ నుంచి ఔట్ సోర్సింగ్ వారిని నియమించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీలను ఎంపిక చేసుకోవాలని, సిబ్బందికి మూడు నెలల పాటు చెల్లించే ఈపీఎఫ్, సర్వీసు ట్యాక్స్, లేబర్ లైసెన్స్ ఫీజులు చెల్లించని పక్షంలో సంబంధిత శాఖలకే జారీమానా విధించే అవకాశం ఉందని సూచించారు. ఏజెన్సీలను జాయింట్ కలెక్టర్ గుర్తిస్తారని, సెక్యూరిటీ బాండు మూడు నెలలకు సరిపడా మొత్తంగా ఉండాలని ఆదేశించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు రోస్టర్ పరిశీలనను మంగళవారం ఖమ్మం టీటీడీసీలో నోడల్ అధికారులు నిర్వహిస్తారని, శాఖాధిపతులు సెక్షన్ అధికారిని పంపించాలని సూచించ్నారు.