
ఇంటర్ విద్య.. మిథ్య!
ఇది బొమ్మనహాల్ మండల కేంద్రంలోని ఫెర్రర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు నిర్వహిస్తుండగా.. 235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 12 మంది అధ్యాపకులు అవసరం కాగా.. ఒక రెగ్యులర్, ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే పని అందుబాటులో ఉన్నారు. ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇంగ్లిష్ అధ్యాపకునికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అధ్యాపకుల కొరత కారణంగా ఎంపీసీ గ్రూపులో ఈ విద్యా సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి. బోధన కుంటు పడటంతో పది మంది విద్యార్థులు ఇటీవల టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది.
- అనంతపురం(ఎడ్యుకేషన్):