అన్ని శాఖలకు భవనాలు కేటాయిస్తాం
-
ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ
భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో అన్ని శా ఖలకు తాత్కాలిక భవనాలు కేటాయిస్తామని, కార్యాలయాల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందు లు రానివ్వబోమని ములుగు ఆర్డీవో మహేందర్‌జీ అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్, ఎస్‌బీఐ వెనుకనున్న ప్రైవేటు భవనాన్ని సోమవారం ఆయన పరిశీ లించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఇం దూ అతిథిగృహం, ఎంవీటీసీ కార్యాలయం, ప్ర భుత్వ ఐటీఐ, సింగరేణి కమ్యూనిటీ హాల్, దేవాదుల డేటాబేస్ సెంటర్‌లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ మరో 8 శాఖలకు భవనాలు కావాల్సి ఉందన్నారు. ఇం దుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరి శీలించామని చెప్పారు. ప్రైవేటు భవనాలకు అద్దె సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కార్యాలయాల ఏర్పాటుకు ఎస్టీ కళాశాల హాస్టల్ అనుకూలంగా ఉందని తెలిపారు. హాస్టల్ వి ద్యార్థులను పక్కనున్న ఎస్టీ వసతిగృహంలోకి పంపించి భవనాన్ని వినియోగించుకుంటామన్నారు. ఆయనతో తహసీల్దార్ సత్యనారాయ ణ, ఆర్‌ఐ సయ్యద్ రెహమాన్, వీఆర్‌వో క్రిష్ణమూర్తి ఉన్నారు.
ఆరు శాఖలకు భవనం కేటాయింపు
పట్టణంలోని ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్ భవనాన్ని ఆరు శాఖలకు కేటాయించనున్నట్లు ఆర్డీవో మహేందర్‌జీ వెల్లడించారు. ఎంప్లాయిమెంట్, పరిశ్రమలు, కార్మిక, మహిళా, శిశు సం క్షేమ, స్పోర్ట్స్ అథారిటీ, హార్టికల్చర్ శాఖలకు హాస్టల్ భవనాన్ని కేటాయించినట్లు చెప్పారు. భవనంలో 12 గదులు ఉండగా ఒక్కో శాఖకు రెండు గదులను కేటాయిస్తామన్నారు.