ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం
Published Tue, Nov 29 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
హాలియా : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం హాలియాలో జరిగిన సీపీఎం నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో కొంత మేరకే అవినీతి నకిలీ కరెన్సీ తగ్గుతుందని, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో చిల్లర దొరకక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీ వదులుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిం దని దీంతో దేశంలో 75 మంది ప్రాణాలు కో ల్పోయారని అన్నారు. సమావేశంలో జిల్లా కమి టీ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, అవుతా సైదయ్య, మండల కార్యదర్శులు కొండేటి శ్రీను, దైద శ్రీను, దుబ్బ రాంచంద్రయ్య, కత్తి శ్రీనివాసరెడ్డి, కామేశ్వర్, కోమండ్ల గురువయ్య, శంకర్‌నాయక్, వెంకన్న, నరేష్, మల్లయ్య, నాగేందర్, సారమ్మ, చాంద్‌పాష, నామ సత్యనారాయణ, లింగమ్మ, శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement