సత్తెనపల్లి : బాలికపై ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కొత్త సుగాలీకాలనీలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కొత్త సుగాలీ కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటుండగా పాతసుగాలీ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ కేసబోయిన యలమంద అక్కడికి వచ్చాడు. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి మాయమాటలతో కాలనీలోని పాఠశాల పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసుస్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ ఎస్.సాంబశివరావు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్
Published Sun, Oct 16 2016 7:28 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement