అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌కు ఆయన గత చరిత్ర చూసి భయపడి శ్వశక్తీకరణ్ పురస్కారానికి ఎంపిక చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి రమణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ఈ అవార్డు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రజలు ఎన్నుకున్న గ్రామ పంచాయతీలను, మండల పరిషత్‌లను డమ్మీలు చేసి జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయని మండిపడ్డారు.
జిల్లాలో అన్ని రంగాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉపాధి పనులు చేసిన వారికి కూలి కూడా ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొని ఉంటే బాగా అభివృద్ధి చేస్తున్నారని అవార్డులకు ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవార్డు అందుకునేవారైనా పునరాలోచించాలని సూచించారు.ల
‘ఏం చేశారని జెడ్పీ చైర్మన్‌కు అవార్డు’
Published Sat, Apr 8 2017 11:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement