తొలినెలలో రూ.68.75 లక్షల వసూలు | first month rs.98.75 lakhs collect | Sakshi
Sakshi News home page

తొలినెలలో రూ.68.75 లక్షల వసూలు

Published Sun, May 7 2017 10:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

first month rs.98.75 lakhs collect

అనంతపురం అగ్రికల్చర్‌ :  ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరం తొలినెల (ఏప్రిల్‌)లో జిల్లాలో ఉన్న 13 వ్యవసాయ మార్కెట్‌యార్డులు, 26 చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్‌ ఫీజు రూపంలో రూ.1.21 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.68.75 లక్షలు వసూలైనట్లు మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.హిమశైల తెలిపారు. గతేడాది మొదటి నెలలో రూ.98.48 లక్షలు వసూలైందని గుర్తు చేశారు. గతేడాదితో పోల్చితే రూ.30 లక్షలు తగ్గిందన్నారు. కరువు పరిస్థితులు నెలకొనడంతో అన్ని రకాల వ్యాపార లావాదేవీలు, వ్యవసాయోత్పత్తుల రవాణా బాగా తగ్గిపోవడంతో వసూళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషించారు. గతేడాది రూ.17.11 కోట్లకు గానూ 60 శాతంతో రూ.10.68 కోట్లు సాధించామన్నారు.

దీంతో ఈ సంవత్సరం లక్ష్యాలు కుదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రూ.14 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదటి నెలలో అనంతపురం రూ.15.42 లక్షలు, హిందూపురం రూ.11 లక్షలు, తాడిపత్రి రూ.9.58 లక్షలు, కదిరి రూ.4.20 లక్షలు, ధర్మవరం రూ.2.43 లక్షలు, గుత్తి రూ.2.63 లక్షలు, గుంతకల్లు రూ.3.79 లక్షలు, కళ్యాణదుర్గం రూ.4.62 లక్షలు, మడకశిర రూ.1.89 లక్షలు, పెనుకొండ రూ.1.03 లక్షలు, రాయదుర్గం రూ.5.01 లక్షలు, తనకల్లు రూ.1.30 లక్షలు, ఉరవకొండ కమిటీలో రూ.5.85 లక్షలు మేర వసూళ్లు జరిగాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement