తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభత్వం అ«ధికారికంగా నిర్వహించాలి
కోదాడఅర్బన్: నిజాం పరిపాలన నుంచి∙తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచనలు కోరారు. ఈ మేరకు గురువారం కోదాడ తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి పలువురు బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం పరిపాలన నుంచి∙తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు విముక్తి పొందాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో నిర్వహించకపోవడం విచారకరమన్నారు. విమోచన దినోత్సవాలు తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వీటిని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగవీటి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కనగాల నారాయణ, యరగాని రాధాకృష్ణ, చిలుకూరి శ్రీనివాస్, పోలా సురేష్, తూములూరి సత్యనారాయణ, చిన్నా, కిలారు Ðð ంకటేశ్వర్లు, రాజాలు తదితరులు పాల్గొన్నారు.