ఆకట్టుకునేలా..!
ఖమ్మం కమాన్‌బజార్: స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో కొనసాగుతున్న హస్తకళా ప్రదర్శన మహిళలకు సంబంధించిన చీరలు, యువతుల డ్రెస్ మెటీరియల్స్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల కళాకారులు రూపిందించిన కలంకారి, మంగళగిరి, చీరాల, పోచంపల్లి, ధర్మవరం, చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతులకు నచ్చేలా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన టస్సర్ సిల్క్ చీరలు, హైదరాబాద్ బ్లాక్ ప్రింటింగ్ శారీస్, గుజరాత్ , హర్యానా, జైపూర్ ఖాధీ మెటీరియల్స్‌ను విక్రయిస్తున్నారు. దిద్దులు, వన్‌గ్రామ్ గోల్డ్ చైన్లు, ఆభరణాలు, మహిళా అలంకరణ సామగ్రి ఉన్నాయి. వీటితో పాటు కొండపల్లి, ఏటికొప్పాక చెక్క బొమ్మలు, ఆయుర్వేదిక్ స్టాళ్లను ఉంచారు. ప్రదర్శన 30వ తేదీ వరకు కొనసాగుతుందని హస్తకళ ప్రదర్శన మేనేజర్ వెంకయ్య తెలిపారు.