- ముగిసిన వీరభద్రుని నక్షత్ర దీక్షలు
జై వీరభద్ర.....జై జై వీరభద్ర
Published Thu, Sep 1 2016 10:29 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
భీమదేవరపల్లి: జై వీరభద్ర.. జైజై వీరభద్ర అంటూ భక్తుల నామస్మరణతో మండలంలోని కొత్తకొండ వీరభద్రుని ఆలయం మార్మోగింది. యేటా శ్రావణ మాసంలో ఆలయంలో ఈ దీక్షలు ప్రారంభమవుతాయి. గత నెల 5న ప్రారంభమైన దీక్షలు 27 రోజుల పాటు కొనసాగి గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు ఇరుముడితో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి సమీపంలోని గుట్టపైకి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం దీక్షలు విరమించారు. కార్యక్రమంలో ఈవో రామల సునీత, సర్పంచ్ సిద్దమల్ల రమేశ్, ఎంపీటీసీ కంకల సమ్మయ్య, ఉప సర్పంచ్ ఉప్పుల కుమారస్వామి, మాజీ చైర్మన్‌లు మాడిశెట్టి కుమారస్వామి, పిడిశెట్టి కనకయ్య అర్చకులు వీరభద్రయ్య, రాజన్న, సదానందం, రాంబాబు, వినయ్‌శర్మ, రమేష్, శ్రీకాంత్ ఉన్నారు.
Advertisement
Advertisement