జర్నలిస్టుల జట్టు విజయకేతనం | journalist team won | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల జట్టు విజయకేతనం

Published Sun, Mar 19 2017 10:11 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

journalist team won

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జర్నలిస్టుల జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో రిలయన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, జర్నలిస్టుల జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి రిలయన్స్‌ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో జర్నలిస్టుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. జట్టులో యుగంధర్‌రెడ్డి 58, గోపాల్‌ 20 పరుగులు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో దిగిన రిలయన్స్‌ జట్టు మొదట తన దూకుడును ప్రదర్శించింది. 15 ఓవర్లలో 150 పరుగులు చేసి, కేవలం 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయింది.

అనంతరం తేజప్రసాద్‌ బౌలింగ్‌ వేసి, ఒకే ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి రిలయన్స్‌ జట్టును కష్టాల్లోకి పడేశారు. దీంతో రిలయన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 165 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో జర్నలిస్టుల జట్టు విజయకేతనాన్ని ఎగరేసింది.రిలయన్స్‌ జట్టులో సుధాకర్‌ 89 పరుగులు సాధించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సుధాకర్‌కు ట్రోఫీని అందించారు. గెలుపొందిన జట్టుకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ట్రోఫీని అందించారు. దీంతో 4 టోర్నీల సీరిస్‌లో జర్నలిస్టుల జట్టు 2–1తో ముందంజలో నిలిచింది. గత ఆదివారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లోనూ జర్నలిస్టుల జట్టు విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement