ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమజంట ఆత్మహత్య
Published Sat, Nov 19 2016 11:08 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
డోన్ టౌన్ : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట శనివారం ఆత్మహత్యచే సుకుంది. దీంతో ఆ కుటంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెల్దుర్తి మండలం బోగోలు గ్రామానికి చెందిన బోయ మల్లిఖార్జున, రాజేశ్వరి దంపతుల కుమారుడు హనుమంతు (20) అదే గ్రామానికి చెందిన నాగన్న, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె రాజేశ్వరి (19) చాలకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ బోయ కులానికి చెందిన వారైనప్పటికీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీనికి తోడు రాజేశ్వరికి ఆమె బంధువుతో వివాహం నిశ్చయించడంతో మనస్తాపం చెంది శుక్రవారం బోగోలులోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొంది. విషయం తెలిసిన ప్రియుడు హనుమంతు వేదన భరించలేక తన అవ్వగారి ఊరైన డోన్ మండలం సీసంగుంతల గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకొన్నాడు. బయటికి వెళ్లివస్తానని అవ్వతో చెప్పి శుక్రవారం రాత్రి ఊరిబయట చెట్టుకు త్రాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఇది గమనించిన గ్రామస్తులు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇష్టంలేని పెళ్లి నిర్ణయించినందుకు రాజేశ్వరి, అప్పుల బాధ భరించలేక హనుమంతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వారి బంధువులు వెల్దుర్తి, డోన్ పోలీస్ స్టేషన్లనో శనివారం ఫిర్యాదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు డోన్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు.
Advertisement
Advertisement