రోడ్డు పనులను అడ్డుకోవడానికి మావోల వ్యూహం? | maoist stratagy for roads constructions | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులను అడ్డుకోవడానికి మావోల వ్యూహం?

Published Sat, Aug 6 2016 11:30 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

ఆర్‌ కొత్తగూడెంలో మావోయిస్టులు వేసిన వాల్‌పోస్టర్లు - Sakshi

ఆర్‌ కొత్తగూడెంలో మావోయిస్టులు వేసిన వాల్‌పోస్టర్లు

దుమ్ముగూడెం : తెలంగాణ సరిహద్దు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కుటం బ్లాక్‌ పరిధిలోని మారాయిగూడెం నుంచి గొల్లపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను  అడ్డు కోవడానికి మావోయిస్టులు వ్యూహం పన్నినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని పనులు ముందుకు సాగేలా చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి..సీజీ మారాయిగూడెం నుంచి గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆ ప్రభుత్వం డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మావోలు ఆరు లారీలు , నాలుగు జేసీబీలు, ట్రాక్టర్లను దహనం చేశారు. అప్పటి నుంచి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ పనులు నిలిపి వేశాడు. అనంతరం ఏడాదిన్నర నుంచి  తిరిగి నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి నుంచి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను, కోయకమాండోలు రాత్రింబవళ్లు వాహనాలకు పహార కాస్తూ పనులు సాగించారు. అయినప్పటికీ మావోయిస్టులు ఆప్రాంతంలో ప్రెషర్‌ బాంబ్‌లను అమర్చారు. దీంతో నాలుగు నెలల క్రితం కూంబింగ్‌ నిర్వహిస్తుడడంతో  ప్రెషర్‌ బాంబ్‌ పేలడంతో జవాన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పనులు కొద్ది రోజులు నిలిపి వేసి మళ్లీ పది రోజుల క్రితం నుంచి  పనులు మొదలు పెట్టారు. దీంతో ఈ పనులు అడ్డుకుని వాహనాలు ధ్వంసం చేయడానికి మావోలు రెండు మూడు సార్లు మిలీషియా, ఆ ప్రాంత గిరిజనులను సిద్ధం చేసినట్లు పోలీస్‌ నిఘా వర్గాలు పసిగట్టినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోల చర్యలు అడ్డుకోవడానికి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి కూడా మావోలు రోడ్డు నిర్మాణ ప్రదేశానికి వచ్చి వెల్లినట్లు సమాచారం. దీంతో మావోలు ఏ నిమిషాన ఏ ఘాతుకానికి పాల్పడతారోనని పోలీసులు కంటికి కునుకు లేకుండా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.  కాగా మావోలు మాత్రం రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రత్యేక బలగాలను వెనుకకు తీసుకోవాలి
పోస్టర్ల ద్వారా కోరిన సీపీఐ  మావోయిస్టు పార్టీ
ఆర్‌ కొత్తగూడెం (చర్ల): దండకారణ్యంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ల కోసం ఉపయోగిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలను వెంటనే వెనుకకు తీసుకోవాలని, మావోయిస్టుల అణచివేత పేరిట సరిహద్దులో అమాయక ఆదివాసీలు, మహిళలపై సాగిస్తున్న అత్యాచారాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ  మండలంలోని ఆర్‌ కొత్తగూడెం, ఉంజుపల్లి ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ , పామేడు ఏరియా కమిటీ పేరిట వాల్‌పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో బూటకపు ఎన్‌కౌంటర్లను రెండు కమిటీలు తీవ్రంగా ఖండించాలని కమిటీ డిమాండ్‌ చేసింది.  మడకం ఇడిమె, పాండులను బూటకపు ఎన్‌కౌంటర్లలో హతమార్చారని ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బస్తర్‌ ఐజీ ఎస్‌ఆర్‌పీ కల్లూరిని విధుల్లో నుంచి తప్పించాలని, జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీలను తక్షణమే విడుదల చేయాలని మావోయిస్టులు ఈ పోస్టర్లలో కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement