ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌సిటీ | participate in smart city | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌సిటీ

Published Fri, Sep 9 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌సిటీ

ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌సిటీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : కరీంనగర్‌ నగరపాలకసంస్థ దేశంలోని 100 స్మార్ట్‌ నగరాల్లో చోటు దక్కించుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మేయర్‌ రవీందర్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం వైశ్యభవన్‌లో టైలరింగ్‌ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్‌సిటీ అవగాహన సదస్సులో మాట్లాడారు. స్మార్ట్‌ సిటీ హోదా దక్కించుకునేందుకు నగరవాసులు సహకరించాలని కోరారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరముందన్నారు. డెప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌ మాట్లాడుతూ ప్రజలంతా రాజకీయాలకతీతంగా మన నగరాన్ని స్మార్ట్‌గా చూడాలనే ఆకాంక్షతో పూర్తి సహకారం అందించాలన్నారు. అనంతరం మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కమిషనర్‌ కృష్ణభాస్కర్, కార్పొరేటర్లు పిట్టల శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, జౌళిశాఖ ఏడీ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్‌ డీఈ శంకర్, ఐసీఆర్‌ఏ సంస్థ బాధ్యులు శ్వేత, మీన తదితరులు పాల్గొన్నారు. 
మున్సిపల్‌ కాంట్రాక్టర్లతో
నగరపాలకసంస్థ రిజిష్టర్డ్‌ కాంట్రాక్టర్లతో కార్పొరేషన్‌ సమావేశమందిరంలో స్మార్ట్‌సిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలు వివరించారు. కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ బాధ్యులు చల్ల హరిశంకర్, కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement