మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- కలెక్టర్‌లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్త జిల్లాలో పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రారంభం రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టాల్సుంటుందని, మిగతా శాఖలు వాటి అ«ధికారుల నిర్ణయించిన ప్రకారం పనిచేస్తాయని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తెలిపారు. జిల్లా పునర్విభజపై జిల్లా అధికారులతో ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను సంబందిత శాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది సర్వీస్, సీనియారిటీ, ఐడీ నెంబర్, ఆధార్ కార్డు నంబర్ సహా అప్‌లోడ్ చేయాలన్నారు. కరెంట్ ఫైల్, డిస్పోజల్ ఫైల్, మూవబుల్ అసెట్స్, వాహనాలు, కొత్త పోస్టుల ఏర్పాటు, మంజూరు పోస్టుల వివరాలను ఆయా రాష్ట్ర శాఖ అధికారులు చూసుకుంటారని వివరించారు. కొన్ని శాఖలు విలీనమవుతున్నందున ఆయా శాఖల అధికారులతోపాటు ఆ శాఖ మొత్తానికి ఒక జిల్లా బాధ్యుడు ఉంటారని చెప్పారు. కొత్త జిల్లాలో ఆయా శాఖల ట్రస్ట్ ఏరియానుబట్టి పోస్టులు ఉండే అవకాశముందన్నారు. పాత, కొత్త జిల్లాలకు సంబందించి శాఖాపరంగా ఒక పేజీకి మించకుండా నివేదికను శుక్రవారం సాయంత్రానికి సీపీఓకు ఇవ్వాలన్నారు. కామన్ ఫైల్స్ స్కానింగ్ చేసి సంబంధిత జిల్లాకు పంపాలని, ఇతర జిల్లాలకు వెళ్ళిన మండలాల వివరాలను కూడా పొందుపర్చాలని చెప్పారు. ఒకొక్క శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించేందుకు సంబందిత శాఖ రాష్ట్ర బాద్యులతో మాట్లాడతానన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.దివ్య, ఏఎస్పీ సాయికృష్ణ, డీఆర్వో శ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.