‘ఎర్రబుగ్గ’లకు స్వస్తి
⇒ జేసీ, బోధన్ సబ్ కలెక్టర్ వాహనాల ఎర్రబుగ్గల తొలగింపు
⇒ అత్యవసర వాహనాలకు మినహాయింపు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) :
వీవీఐపీ సంస్కృతిని పక్కన పెడుతూ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇ తరుల వాహనాలపై ఎర్రబుగ్గల ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రిందట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే మే 1వ తేదీ ఈ నిర్ణయాన్ని అమల్లోకి రానుండ గా, జిల్లాలో జేసీ రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాహనాలకు ఉన్న ఎర్రబుగ్గలను ముందే తొలగింపజేశారు. నిబంధనలు అమలు కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ తమ వాహనాలపై ఎర్రబుగ్గను తొలగిం చుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే1వ తేదీ నుంచి జిల్లాలో అత్యవసర వాహనాలకు నీలిరంగు బుగ్గ తప్ప ఇతర ఏ ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారుల వాహనాలపై ఎరుపు, నీలిరం గు సైరన్ బుగ్గలు ఉండవు.