ఆరేళ్ల బాలికపై అత్యాచారం
Published Mon, Jan 9 2017 10:05 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM
దుగ్గిరాల : బాలికపై అత్యాచారం చేసిన ఘటనపై దుగ్గిరాల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. చెన్నకేశవనగర్‌కు చెందిన తుపాకుల వెంకటరమణ అదేకాలనీకి చెందిన 6 ఏళ్ల బాలికకు పండ్లు ఇస్తానంటూ ప్రలోభాలకు గురిచేసి ఇంట్లోకి పిలిచి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. పనులకెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రుకలు బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెప్పింది. అనమానం వచ్చిన తల్లి బాలికను ఏమి జరిగిందని ప్రశ్నించగా జరిగిన ఘటనపై తల్లికి వివరించింది. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మన్నెం మురళీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితురాలిని వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement