- ప్రభుత్వ భవనం ధ్వంసం
- విచారణ చేపట్టిన అధికారులు
సర్పంచి భర్త నిర్వాకం
Published Thu, Feb 2 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
సీతానగరం :
ప్రభుత్వ భవనాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేసిన వైనం మండలంలోని సింగవరం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల వద్ద మధ్యాహ్న భోజనం పథకం వంటషెడ్డును సర్వశిక్షాభియా¯ŒS నిధులు రూ.75 వేలతో గతంలో నిర్మించారు. దీనిని 2015 జూ¯ŒSలో సర్పంచ్ ప్రారంభించారు. అక్కడ నీటి సదుపాయం లేకపోవడంతో వంటలు వేరే ప్రాంతంలో చేస్తున్నారని పేర్కొంటూ, ఆ స్థలం ఏఎ¯ŒSఎం సబ్ సెంటర్ భవనానికి కావాలంటూ.. సర్పంచ్ ముత్యం పార్వతి భర్త వెంకటేశ్వరావు గురువారం ఉదయం పొక్లెయి¯ŒSతో ఆ షెడ్డును కూల్చేశారు. ఇటుకలు, భవనం రద్దును ట్రాక్టర్‌పై గోదావరి ఏటిగట్టు వైపు గోతుల్లోకి తరలించారు. అక్కడ వంటషెడ్డు ఉందనే ఆనవాలు కూడా లేకుండా చేశారు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్న హెచ్‌ఎం సాయిమాధురి వంటషెడ్డు లేకపోవడంతో ఆరా తీశారు. అనంతరం స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మ¯ŒS తమ్మిశెట్టి ప్రసన్నకుమార్‌తో కలిసి సీతానగరం ఎంఆర్‌సీకి తరలివచ్చి, ఎంఈవో టి.ముత్యాలుకు విషయం చెప్పారు. ఎంపీఈవో దబ్బాడ శ్రీనివాస్ వద్దకు వెళ్లి జరిగిన జరిగిన విషయాన్ని ఏకరువు పెట్టారు.
తప్పు చేశాను.. మీ ఇష్టం
వంటషెడ్డు తీస్తున్న విషయం అధికారుల దృష్టిలో ఉంచలేదని, తాను తప్పు చేశానని, ఇక మీ ఇష్టమని సర్పంచ్ భర్త వెంకటేశ్వరావు ఎంపీడీవో శ్రీనివాస్‌కు చెప్పారు. పీహెచ్‌సీ సబ్ సెంటర్ భవనానికి స్థలం లేనందున వంటషెడ్డును తొలగించానని ఒప్పుకున్నారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం
వంటషెడ్డును కూల్చిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. సింగవరం ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఎంఈవోను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఈ ఘటనలో సర్పంచ్ భర్త తప్పుగా వ్యవహరించారని, ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement