నగరిలో టీడీపీ నేతల దౌర్జన్యం | TDP workers to attack on Municipal chairperson, ysrcp counselors at nagari | Sakshi
Sakshi News home page

నగరిలో టీడీపీ నేతల దౌర్జన్యం

Published Sun, Jul 3 2016 3:05 PM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM

నగరిలో టీడీపీ నేతల దౌర్జన్యం - Sakshi

నగరిలో టీడీపీ నేతల దౌర్జన్యం

చిత్తూరు: నగరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సమక్షంలో ఆదివారం ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శాంతకుమారిపై విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. కౌన్సిలర్లతో సంబంధం లేకుండానే రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శాంతకుమారి, కౌన్సిలర్లు వెళ్లారు. పోలీస్‌ స్టేషన్‌లోనే మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛైర్‌పర్సన్‌ శాంతకుమారితో పాటు కౌన్సిలర్లకు గాయాలయ్యాయి. వారిని రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement