అంత్యక్రియలకు వెళుతూ..
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన పదర రాము(30), అతని భార్య రేణుక(24) కొడుకు వెంకట్(3) మృతి చెందారు. రేణుక అక్కడికక్కడే మృతిచెందగా రాము, వెంకట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. రాము పెద్ద కొడుకు చరణ్‌తేజ్ తలకు గాయమై ప్రాణాలతో బయటపడగా వదిన పుష్పకు తీవ్రగాయాలయ్యాయి. అదే మండలం బొగ్గులదొనకు చెందిన రాము అత్త ముప్పళ్ల చంద్రకళ, ముప్పళ్ల విజయతోపాటు వారి పిల్లలు హరిప్రసాద్, హారికలకు తీవ్రగాయాలయ్యాయి. రాము తన కుటుంబంతో గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ సొంత ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంతో ఆటో నుజ్జు నుజ్జు కావడంతోపాటు కారు ముందు భాగం దెబ్బతింది. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ సుధాకర్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.