అమరుల స్ఫూర్తితో ఉద్యమించండి | Tribute the baseerbag Activists | Sakshi
Sakshi News home page

అమరుల స్ఫూర్తితో ఉద్యమించండి

Published Sun, Aug 28 2016 9:55 PM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

అమరుల స్ఫూర్తితో ఉద్యమించండి - Sakshi

అమరుల స్ఫూర్తితో ఉద్యమించండి

  • వామపక్ష నాయకులు
  • బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరులకు నివాళి 
  • కరీంనగర్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన పోరాటాన్ని తలదన్నేలా మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఆదివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గరంలోని తెలంగాణచౌక్‌లో  విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, రామకృష్ణ స్మరణ కోసం తాత్కాలిక స్తూపాలు ఏర్పాటు చేశారు. వారికి ఘన నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ నాటి సీఎం చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంక్‌ ఏజెంట్‌గా మారి విద్యుత్‌ చార్జీలు పెంచారని, ఆ పెనుభారం  తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపున్చామన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీపై పోలీసులు విచక్షణా రహితంగా  కాల్పులు జరిపి ముగ్గురిని కాల్చిచంపారని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు గుడికందుల సత్యం, పైడిపల్లిరాజు, సీపీఐ(ఎంఎల్‌) కార్యదర్శి కోలిపాక కిషన్, ఎడ్ల రమేశ్, సురేష్, కేదారి, మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
     
    న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో....
    సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో విద్యుత్‌ పోరాటంలో ఆమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు. డివిజన్‌ కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు సంపన్న వర్గాలకు డిగం చేస్తూ ప్రజా సమస్యలు విస్మరిస్తున్నాయన్నారు. ఐఎఫ్‌టీయూ, పీడీఎస్‌యూ, పీవైఎల్‌ నాయకులు జిందం ప్రసాద్, పాముల కిషన్, రత్నం రమేశ్, రామయ్య, తోకల మహేశ్, బాలురాజు, వినోద్, మధు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి కోలిపాక కిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన మరో సమావేశంలో ఆనంద్, కిషన్, లింగమూర్తి, నాగరాజు, రమేశ్, వెంకటేశ్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
    గోదావరిఖని : ప్రజాగ్రహానికి గురయ్యే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి అన్నారు. స్థానిక శ్రామికభవన్‌ వద్ద 2000లో బషీర్‌బాగ్‌ కాల్పుల్లో మరణించిన రామకష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌కు నివాళులర్పించి మాట్లాడారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపారన్నారు. దీనిని నిరసిస్తూ బషీర్‌బాగ్‌ వద్ద ఆందోళన చేపట్టిన ఉద్యమకారులపై కాల్పులు జరిపించి ముగ్గురిని బలితీసుకున్నారని అన్నారు. దీని పర్యవసానంతోనే చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 2న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు వై.యాకయ్య, మెండె శ్రీనివాస్, నరహరిరావు, రామాచారి, ఎ.మహేశ్వరి, లావణ్య, పారిజాత, నాగమణి, సీహెచ్‌ ఓదెలు, సంజీవ్, దస్తగిరి, చంద్రయ్య, రాము, సంతోష్, సమ్మక్క, రమ, రవిగౌడ్, ఎన్‌.నర్సయ్య, లలిత, సీహెచ్‌ ఉపేందర్, లక్ష్మి, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement