లావేరు: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో నకిలీ కరెన్సీ నోట్లతో వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం... కోల్కతాలోని ఓ ఏజెంట్ నుంచి విశాఖపట్నానికి చెందిన వ్యక్తి నకిలీ నోట్లను తీసుకురాగా... శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లింగాలవలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వాటిని తీసుకుని స్వగ్రామానికి తీసుకు వెళుతున్నారు.
ఈ సమాచారం అందుకున్న లావేరు పోలీసులు సుభద్రాపురం జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం సనపతి రమణ, సనపతి సత్యంను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.5లక్షల విలువ చేసే రూ.వెయ్యి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సనపతి రమణ ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైనట్టు సమాచారం.