అనంతపురం సప్తగిరి సర్కిల్ : ధర్మవరానికి చెందిన చౌడేశ్వరి చేనేత సంఘం గ్రూపు సభ్యులకు రుణమాఫీ కాకపోవడంతో వారికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో గ్రూపు సభ్యులు బుధవారం స్థానిక చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు శ్రీనివాసులు, రంగస్వామి మాట్లాడుతూ తమ గ్రూపు నుంచి రూ.1.50 లక్షల రుణాన్ని తీసుకున్నామన్నారు. 2014 వరకు తీసుకున్న రుణంలో సగం రుణాన్ని చెల్లించామన్నారు.
దీంతో రుణమాఫీ అయ్యిందని నాటి నుంచి డబ్బు కట్టలేదన్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం తమకు నోటీసులు అందజేశారని వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించేందుకు వచ్చామన్నారు. ఉన్నతాధికారులు లేకపోవడంతో వారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. చేనేతలను రుణమాఫీ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో రామకృష్ణ, ఓబులేసు, రంగనాయకులు, రత్నాకర్, లావణ్య, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
చేనేతల ఆందోళన
Published Wed, May 31 2017 11:12 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement