పోలీస్‌ జులుం నశించాలంటూ వీఆర్‌ఏల నిరసన | Village revenue assistants Protest | Sakshi
Sakshi News home page

పోలీస్‌ జులుం నశించాలంటూ వీఆర్‌ఏల నిరసన

Published Tue, Dec 13 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

పోలీస్‌ జులుం నశించాలంటూ వీఆర్‌ఏల నిరసన

పోలీస్‌ జులుం నశించాలంటూ వీఆర్‌ఏల నిరసన

రాయచోటి : పోలీస్‌ జులుం నశించాలంటూ మంగళవారం రాయచోటి మండలంలోని వీఆర్‌ఏలు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి తగాదా విషయంలో అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకొని, తమపై దాడి చేస్తున్నారంటూ వాపోయారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి దూషిస్తున్నారని, దీన్ని వ్యతిరేకించి వాస్తవాలు మాట్లాడుతుంటే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరసింహులు డిమాండ్‌ చేశారు. నిరసనలో వీఆర్‌ఏలు రామమోహన్, శ్రీనివాసులు, వెంకటేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement