మాట్లాడుతున్న ఈటల రాజేందర్
- జీవోలను పక్కనపెట్టి సాగునీరిచ్చాం
- అందరి సహకారంతో ఏఎంసీల అభివృద్ధి
- ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
కమాన్‌పూర్ : రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రాన్ని సాధించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలకేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీట్ల మంజుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియామకం కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిందని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కోక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను పక్కన పెట్టి పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించామని, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, కమల, జెడ్పీటీసీ మేకల సంపత్, ఏపీఏసీఎస్ చైర్మన్‌లు మాల్క రామస్వామి, గుజ్జుల రాజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ పుల్లెల కిరణ్, వైస్‌ఎంపీపీ కొట్టె భూమయ్య, పీట్ల గోపాల్, సర్పంచ్ కొంతం సత్యనారాయణ, నాయకులు ఇనగంటి రామరావు, ఏడీఎం ప్రకాష్‌రాజ్, కార్యదర్శి ఈర్ల సురేందర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.