‘నిబద్ధత గల నాయకుడు దోసారావు’ | ysrcp leader dosarao dead | Sakshi
Sakshi News home page

‘నిబద్ధత గల నాయకుడు దోసారావు’

Published Mon, Aug 29 2016 10:32 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

‘నిబద్ధత గల నాయకుడు దోసారావు’ - Sakshi

‘నిబద్ధత గల నాయకుడు దోసారావు’

  • అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
  • సోమేశ్వరం (రాయవరం) :
    పార్టీపట్ల విధేయత, నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధత గల నాయకుడు దోసారావు అని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కొనియాడారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మండల సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు నిమ్మకాయల దోసారావు ఆదివారం కన్నుమూసిన విషయం విదితమే. అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు సోమవారం సోమేశ్వరంలో నిర్వహించారు.   సోమేశ్వరాలయం ఎదురుగా ఉన్న రుద్రభూమిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మేనల్లుడు పులుం వెంకటకృష్ణ దోసారావు చితికి నిప్పంటించారు.  పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ దోసారావు సుశిక్షితుడైన సైనికుడిగా పార్టీ కోసం కష్టించి పనిచేశారన్నారు. జెడ్పీటీసీ చిన్నం అపర్ణాపుల్లేష్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నేత దూలం వెంకన్నబాబు, పార్టీ జిల్లా ప్రచార కమిటీ కో ఆర్డినేటర్‌ సిరిపురపు శ్రీనివాసరావు, నీటి సంఘాల రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, సోమేశ్వరం సొసైటీ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు పేకేటి ఈశ్వరరావు, మేడపాటి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సత్తి సత్యవతి రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ సత్తి సూర్యబ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి వెంకటరెడ్డి(కృష్ణ),  మాజీ ఎంపీపీ కోట బాబూరావు, కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి తదితరులు దోసారావును సేవలను గుర్తు చేసుకున్నారు.  వైఎస్సార్‌ సీపీ నేతలు మేడపాటి బసివిరెడ్డి, పడాల సతీష్, తుపాకుల ప్రసన్నకుమార్, గిరజాల వెంకటేశ్వరరావు, గరగ కామరాజు, బైరిశెట్టి సత్యనారాయణ, గరగ బాలయోగి, పడాల మురళీరెడ్డి, నున్న వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
    జగ్గిరెడ్డి పరామర్శ..
    కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దోసారావు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోసారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఎం.సురేష్‌రెడ్డి(బుజ్జి) తదితరులు ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement