District
-
కరుణించు... వర్షం కురిపించు! మలగంగమ్మకు ప్రత్యేక పూజలు
పెనుమూరు, న్యూస్‌లైన్: ఆ మూడు గ్రామాల ప్రజలు ప్రతి ఏటా వర్షం కోసం ఓ రోజు అడవికి వెళ్తారు. అడవిలో కొండపై కొలువుదీరిన మలగంగమ్మకు పొంగళ్లుపెట్టి వర్షం కురిపించాలని పూజలు చేస్తారు. అనంతరం సామూహికంగా భోజనం చేసి వారి గ్రామాలకు తిరిగి వెళతారు. పెనుమూరు మం డలంలోని చిప్పారపల్లె, సుంచువాండ్లవూరు, సంగీత గోపన్నగారిపల్లెల్లో వర్షాలు కురిస్తే తప్ప పంటలు సాగు చేసేందుకు నీరుండదు. వర్షం కోసం ఈ గ్రామస్తులు మలగంగమ్మకు పూజలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈనేపథ్యంలో మంగళవారం మలగంగమ్మకు పూజలు చేసేం దుకు ప్రతి ఇంటికీ వెళ్లి పొంగళ్లు పెట్టడానికి ఉయోగించే బిkadయ్యం, బెల్లం సేకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు చిప్పారపల్లె నుంచి గ్రామస్తులు మేళతాళాల మధ్య మలగంగమ్మకు పొంగళ్లు, మట్టి కడవల్లో నీటిని తీసుకొని ఊరేగింపుగా అడవికి వెళ్లారు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన మహిళలు ఊరు పొలిమేర దాటగానే తిరిగి వెళ్లిపోయారు. పురుషులు మాత్రమే మలగంగమ్మ ఆలయం వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించారు. జంతుబలి ఇచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం సామూహిక భోజ నాలు చేశారు. గ్రామం నుంచి మట్టి కడవల్లో తీసుకు వచ్చిన నీటితో అమ్మవారిని అభిషేకించి వర్షం కురిపిం చాలని మొక్కుకున్నారు. చివరగా అర్ధనగ్నంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. -
నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
నాగార్జున సాగర్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్‌గేట్లను బుధవారం ఎత్తి దిగువకు నీటి విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 583 అడుగులకు చేరిందని చెప్పారు. బుధవారం ఉదయం వరకు నీటి మట్టం 585 నుంచి 590 అడుగుల మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. కాగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 2,36,901 క్యూసెక్కులు నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందన్నారు. సాగర్‌లో 588 అడుగుల నీటిమట్టాన్ని మొయింటెనెన్స్ చేస్తూ శ్రీశైలం నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా నీటిని దిగువకు వదలనున్నట్లు వివరించారు. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నందునా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి కోరారు. మూడు జోన్లకు నీటి విడుదల నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండినందునా ప్రాజెక్టు పరిధిలోని మూడు జోన్లకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదనీటిని బట్టి మొదట కుడి, ఎడమ కాల్వల పరిధిలోని మొదటి జోన్లకే నీటి విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ పోంగిపోర్లడంతో పాటు సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వస్తుందన్నారు. జలాశయంలో నీటి లభ్యతను బట్టి ప్రాజెక్టు పరిధిలోని 21.5 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీటివిడుదల చేసేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ఆయకట్టు రైతులంతా ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈ హృదయరంజన్, డీఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరదల సమయంలో జాడలేని వైద్యులు..
కూనవరం, న్యూస్‌లైన్: అతిసార వ్యాధికి గురై మండలంలోని టేకులబోరుకు చెందిన ఎడ్ల వేదవతి(40) మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వేదవతిని తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చుట్టూ వరద నీరు ఉన్నప్పటికీ నాటు పడవ ద్వారా సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ చికిత్స చేసినప్పటికీ అతిసార అదుపులోకి రాలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. వరదల సమయంలో తప్పని సరిగా ఉండాల్సిన వైద్యులు విధుల్లో లేకపోవడం వల్లే మెరుగైన చికిత్స అందలేదని, ఈ కార ణంగానే వేదవతి మృతి చెందిందని ఆమె బంధువులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రతి అధికారి స్థానికంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మండలంలో ఇది మూడవ కేసు కావడంతో వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హెచ్ఎండీఏ.. ఏమవుతుందో?
భువనగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న వార్తల నేపధ్యంలో జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో జీవించాలన్న తమ ఆశయం నెరవేరబోతున్న సమయంలో కేంద్రం హెచ్ఎండీఏ పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీల సమాచారాన్ని కోరి నట్లు ప్రకటనలు రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో అలజడి మొదలైంది. తాము హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామే తప్పా కేంద్ర పాలిత ప్రాంతం కాదని ప్రజలు అంటున్నారు. ఎప్పటినుంచో తమ జీవితాల్లో భాగమైన హైదరాబాద్‌ను పరాయి పరం చేయవద్దని కోరుతున్నారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలన్నీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండగా, మునుగోడు అసెంబ్లీ పరిధిలోకి చౌటుప్పల్‌లో 25, ఆలేరు పరిధిలోని బొమ్మలరామారంలో 25, భువనగిరి పరిధిలోకి పోచంపల్లిలో 21, బీబీనగర్‌లో 27, భువనగిరిలో 35 గ్రామాలు కలిపి మొత్తం 133 గ్రామాలు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపధ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న సీమాంధ్ర నాయకుల డిమాండ్ల నేపధ్యంలో కేంద్రం హెచ్ఎం డీఏ పరిధిపై సమగ్ర రాజకీయ సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే మండలాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువెళతారేమోనని ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటే స్వయం పాలన కోల్పోయి, విధాన నిర్ణయాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తాయి. దీంతో తమను తాము పరిపాలించుకోకుండా పరాయి పాలనలో ఉన్నామన్న భావన వస్తుందని మేధావులు అంటున్నారు. ఇక్కడి ప్రజలు చెల్లించే పన్నులు రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి వెళ్తాయని, తద్వారా అభివృద్ధిలో సమతుల్యత దెబ్బతింటుందన్న అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. హెచ్ఎండీఏ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు వీరే.. భువనగిరి లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, భువనగిరి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన బూడిద భిక్షమయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన ఉజ్జిని యాదగిరిరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఉద్యమానికి బాసట
సాక్షి, తిరుపతి: జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. జిల్లాలో వారం రోజులుగా విద్యావ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యమబాట పట్టారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, పలమనేరు, నగరి వంటి పట్టణాలే కాకుండా మండల కేం ద్రాలు, మారుమూల గ్రామాల్లోని అన్ని రకాల పాఠశాలలు మూతపడ్డాయి. ఆగస్టు 11వ తేదీ వరకు నిరవధికంగాఉద్యమానికి బాసట ప్రైవేటు పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. 12వ తేదీ నుంచి ఏపీఎన్జీవోలు సమ్మెకు పిలుపునివ్వటంతో అందులో భాగంగా ఉపాధ్యాయుల విధుల బహిష్కరణ కొనసాగనుంది. జిల్లాలో ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఐదు లక్షల మందికి పైగా విద్యార్థుల చదువులకు బ్రేక్ పడింది. యూనివర్సిటీల్లో అధ్యాపక జేఏసీలు రంగంలోకి దిగి దీర్ఘకాలంగా ఉద్యమం కొనసాగించే విధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసి, వారి వెన్నంటి ఉద్యమం నడిపిస్తున్నారు. నెల రోజులుగా పాఠశాలల్లో ఒక్కొక్క సబ్జెక్టులో రెండు నుంచి మూడు చాప్టర్లు మాత్రమే పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. వర్సిటీల్లో తరగతులు ప్రారంభమై వార మే అయింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఉద్యమాల్లో పాల్గొనమని పంపిస్తుండటం గమనార్హం. పాఠశాలలు సంపూర్ణ బంద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉద్యమ పర్యవేక్షణ ఉపాధ్యాయ సంఘాలు పర్యవేక్షిస్తుండగా రాయలసీమ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. చాలాచోట్ల ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం, రోడ్లపై వంటా వార్పు, కబడ్డీ ఆడటం వంటివి చేస్తున్నారు. గ్రామ స్థాయికి ఉద్యమాన్ని విస్తరింపజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కావటంతో ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు ఉంటే రోడ్డుపైన, లేదంటే గ్రౌండ్లో అన్నట్లుగా పరిస్థితి మారింది. స్తంభించిన ఏడు యూనివర్సిటీలు తిరుపతిలోని ఆరు యూనివర్సిటీలతోపాటు, కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలోనూ పూర్తిగా విద్యాబోధన, పరిపాలన బంద్ అయింది. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ కేంద్రంగా వారం రోజులుగా ఆమరణ దీక్షలతో సాగగా, మంగ ళవారం నుంచి రిలేదీక్షలు, సోనియా, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను ఉరితీశారు. ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీల విద్యార్థులు బంద్‌లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. యూనివర్సిటీ గోల్డెన్‌జూబ్లీ గేటు వద్ద టెంట్ వేసి అక్కడ నుంచే రోజుకొక వినూత్న కార్యక్రమంతో ఉద్యమం కొనసాగించేందుకు నిర్ణయిం చారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. జిల్లా విద్యాసంస్థల సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు - 3,953 ప్రాథమికోన్నత పాఠశాలలు - 541 ఉన్నత పాఠశాలలు - 601 ప్రైవేట్ పాఠశాలలు - 1075 ----------------------------- ప్రభుత్వ ఉపాధ్యాయులు - 16,398 ప్రైవేట్ ఉపాధ్యాయులు - పదివేల మందికి పైగానే యూనివర్సిటీ అధ్యాపకులు - 3 వేల మంది యూనివర్సిటీ విద్యార్థులు - 25 వేల మంది ----------------------------- యూనివర్సిటీలు - 07 డిగ్రీ కాలేజీలు - 50 జూనియర్ కాలేజీలు -150 -
ఉత్సవ విగ్రహాలు
సాక్షిప్రతినిధి, న ల్లగొండ: సర్పంచ్‌లు ఉసూరుమంటున్నారు. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వేడి పుట్టించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఈ నెల 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో సర్పం చ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ గ్రామ కార్యదర్శులు, స్పెషల్ అధికారుల ఇష్టారాజ్యంతో సమస్యల్లో కునారిల్లిన పంచాయతీలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత సహజంగానే కొత్త సర్పంచ్‌లపై పడింది. అయితే, బాధ్యతలు చేపట్టిన రోజునే వీరి చేతికి అందాల్సిన పంచాయతీల రికార్డులు ఇంతవరకూ వారికి అప్పజెప్పలేదు. అసలు పంచాయతీ జనరల్ ఫండ్‌లో నిధులు ఎన్ని ఉన్నాయి..? ప్రభుత్వం నుంచి అందిన నిధులెన్ని..? ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తం ఎంత..? ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు పెట్టారు..? ఎవరెవరికి ఎంతెంత చెల్లించాల్సి ఉంది..? మిగులుబాటా.. లేక తగులుబాటా..?వంటి ప్రశ్నలకు కొత్త సర్పంచ్‌లకు సమాధానం దొరకడం లేదు. ఇక, ఆయా పంచాయతీల్లో తక్షణం చేపట్టాల్సిన పనులకు నిధుల ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి అన్న అంశంలో స్పష్టత లేదు. ఇన్నాళ్లూ తిమ్మిని బమ్మిని చేసిన వారు లెక్కలు బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందలేదన్న కారణం చూపుతూ రికార్డులు కొత్త సర్పంచులకు ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో కొందరు మాజీ సర్పంచ్లకూ పాత్ర ఉందని చెబుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దకోవడానికి రికార్డులు తమ వద్దే ఉంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌బుక్, ఎంబీ రికార్డులు అప్పగించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రమాణస్వీకారం రోజున అన్ని కొత్త రికార్డులు రాయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే కార్యదర్శులు పంచాయతీ పాలనను ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నందున రికార్డులన్నీ వారివద్దే ఉంచుకున్నారు. సర్పంచులతో కూడిన జాయింట్ చెక్‌పవర్ కార్యదర్శులకు ఉంటుందా లేదా అన్నదానిపై ఆదేశాలు రకపోవడంతో కార్యదర్శులు చెక్‌బుక్‌లను వారివద్దే ఉంచున్నారు. దీంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. 2011లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు రికార్డులు ఉంటే క్యాష్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఉంటే రశీదు బుక్కులు లేకుండా పోయాయి. అంతేకాకుండా కార్యదర్శులు బదీలీపై వెళ్లిన పంచాయతీల్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అన్ని రికార్డులు అప్పగించకుండా, బ్యాంక్ పాస్‌బుక్, రశీదు పుస్తకాలు అప్పగించి క్యాష్ బుక్కులు అప్పగించని ఉదంతాలూ ఉన్నాయి. కొందరు కార్యదర్శులు, 2011లో దిగిపోయే ముందు సర్పంచులే ఈ రికార్డులు అప్పజెప్పలేదని కూడా బుకాయిస్తున్నారు. ఇక, ఆయా మండలాల్లో రెండు రోజుల్లో వీరికి శిక్షణ కార్యక్రమం నిర్వహించి రికార్డులను అప్పగిస్తామని ఎంపీడీఓలు చెబుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో కొంత నయం సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, సూర్యాపేట రూరల్ మండలాల్లో సర్పంచ్‌లకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అధికారులు రికార్డులు అప్పగించారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రిలో మాత్రమే రికార్డులు అందజేయలేదు. ఉత్తర్వులు అందని కారణంగానే రికార్డులివ్వలేదని మెజారిటీ అధికారులు చెబుతుండగా, సూర్యాపేట నియోజకవర్గంలో ఎలా వీలయ్యిందన్న ప్రశ్నకు ఉన్నతాధికారులే సమధానం చెప్పాలి. దీనితో సర్పం చ్‌లు ఆయా గ్రామా కార్యదర్శులను రికార్డులు చెక్‌బుక్‌ల విషయమై అడుగగా రేపు.. ఎల్లుండి అని సమాధానం చెబుతున్నారని నూతన సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పంచాయితీలల్లో ఇంతకుముందున్న సర్పంచ్‌లు సర్పంచ్‌గా పోటీపడి ఓడిపోయిన వారు కావాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు రికార్డులను అదించడం లేదని పలువురు కారదర్శులు ఆరోపిస్తున్నారు. -
రూ. 8 కోట్లతో బస్టాండ్ల అభివృద్ధి
మార్కాపురం, న్యూస్‌లైన్: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 32 ఆర్టీసీ బస్టాండ్లలో జూలై 2వ తేదీ నుంచి ప్రతి టికెట్‌పై ప్రయాణికుల నుంచి ఒక రూపాయి వసూలు చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ విధంగా వసూలయ్యే రూ. 8 కోట్ల నిధులతో బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తామని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్లపై అదనపు వసూలు ద్వారా నెలకు దాదాపు రూ. 80 లక్షలకుపైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, ప్రయాణికులు కూర్చొనేందుకు బెంచీల ఏర్పాటు, బస్టాండ్ల మరమ్మతులు చేపడతామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడాదికి రూ. 2 కోట్లకు మించి ఇవ్వడం లేదని, దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామన్నారు. మూడు జిల్లాల్లోని మూడు రీజియన్లలో మూడేసి బస్టాండ్ల చొప్పున మొత్తం 9 బస్టాండ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి నిధులిస్తే ఆర్టీసీ మరికొంత కలిపి సంబంధిత బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. జోన్ పరిధిలో మార్చి నెలాఖరు నాటికి 210 బస్సులు రావాల్సి ఉండగా, ఇప్పటికే 60 బస్సులు వచ్చినట్లు చెప్పారు. అవి పాత బస్సుల స్థానంలో వచ్చాయన్నారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం కింద నెల్లూరు రీజియన్‌కు వంద బస్సులు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇవి వస్తే నెల్లూరుకు 50, తిరుపతికి 50 బస్సులు కేటాయిస్తామన్నారు. చిత్తూరు, ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిపారు. తిరుమల, తిరుపతి, అలిపిరి, నెల్లూరు- 2 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి డిపో లాభాల బాటలో ఉండగా, అద్దంకి డిపో నష్టాల్లో ఉందన్నారు. జిల్లాలోని మిగిలిన 7 డిపోలు నష్టాలను అధిగమించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 7 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవడం లేదని చెప్పారు. ఒంగోలులో మూడు రోజులు బస్సులు తిరగలేదన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమపై భారం పడుతోందని, నష్టాలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకోవడంతో పాటు ఇంధన పొదుపు పాటిస్తున్నామని తెలిపారు. కిలోమీటరుకు తమకు రూ. 27 ఖర్చవుతుండగా, రూ. 20 ఆదాయం వచ్చినా బస్సులు తిప్పుతామని చెప్పారు. మార్కాపురం డిపోకు నూతనంగా ఆరు బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కంభం, దోర్నాల పట్టణాల్లో బస్టాండ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, సురేశ్‌లు నిధులు కేటాయించారన్నారు. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు. బస్టాండ్‌లో పర్యటన: ఈడీ సూర్యచంద్రరావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పర్యటించారు. డిపోలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ డిపోల కండక్టర్లతో మాట్లాడి ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. ప్రయాణికులను గౌరవిస్తూ సంస్థ గౌరవాన్ని నిలబెట్టి నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డిపో మేనేజర్ సునీల్ జోసఫ్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చిన్నయసూరి తదితరులు ఉన్నారు. -
పురుగుమందులూ భారమే..
మార్కాపురం, న్యూస్‌లైన్: విత్తు విత్తింది మొదలు..మొక్క పెరిగి దిగుబడి చేతికొచ్చే వరకు పంటను పసిపాపలా కాపాడుకుంటూ వస్తాడు రైతు. ఈ మధ్య కాలంలో తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు రైతు గుండెపై గుదిబండగా మారుతున్నాయి. మూడేళ్లుగా వ్యవసాయానికి ప్రభుత్వ సాయం కరువవడంతో కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు దింపుడు కళ్లెం ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడుల భారం రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎరువులతో పాటు పురుగు మందుల ధరలు కూడా పెరగడంతో ఒక్క మార్కాపురం వ్యవసాయ డివిజన్లోని రైతులపైనే ఏడాదికి రూ. 22.56 కోట్ల అదనపు భారం పడుతోంది. మార్కాపురం వ్యవసాయ డివిజన్లో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. డివిజన్ పరిధిలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుండగా, కంది తగ్గనుంది. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, అర్ధవీడు మండలాల్లో 30 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మిర్చి సాగు కానుంది. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దదోర్నాల మండలాల్లో 20 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో మిర్చి సాగుకు సన్నద్ధమవుతున్నారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో 37 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మిర్చి సాగు కానుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి, మిర్చి పైర్లపై శనగపచ్చ పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, సన్నపురుగు, పేను బంక తెగుళ్లు ఆశిస్తున్నాయి. వీటి నివారణ కోసం రైతులు ఎసిఫేట్, ఫ్రైడ్, ఇమిడా క్లోఫిడ్, మోనోక్రోటోఫాస్, ప్రిఫాన్లిస్ మందులను వాడుతుంటారు. మిర్చి పండించే ప్రతి రైతు ఎకరాకు దాదాపు 12 లీటర్ల ఇమిడా క్లోఫిడ్ పురుగుమందును ఉపయోగిస్తాడు. గత ఏడాది లీటర్ రూ. 850 ఉన్న ఇమిడా క్లోఫిడ్ ఇప్పుడు రూ. 1050 నుంచి రూ. 1100 వరకు కంపెనీలను బట్టి ధర పలుకుతోంది. లీటర్‌పై కనీసం రూ. 200 అదనపు భారం పడుతోంది. డివిజన్ మొత్తం మీద 65 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతుంది. ఎకరాకు 12 లీటర్ల చొప్పున 7.80 లక్షల లీటర్ల మందును ఉపయోగిస్తే..రైతులపై లీటర్‌కు రూ. 15.60 కోట్ల భారం పడనుంది. అలాగే డివిజన్లో పత్తి 87 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు 4 లీటర్ల చొప్పున 3.48 లక్షల లీటర్ల ఇమిడా క్లోఫిడ్ పురుగుమందును ఉపయోగిస్తారు. లీటర్‌పై రూ. 200 అదనపు భారంతో మొత్తం రూ. 6.96 కోట్ల అదనపు భారం పడుతుంది. గతేడాది ఎసిఫేట్ కిలో రూ. 420 ఉండగా ఈ ఏడాది రూ. 450 విక్రయిస్తున్నారు. మోనోక్రోటోఫాస్ లీటర్ ధర గతేడాది రూ. 325 ఉండగా, ఈ ఏడాది రూ. 350 అయింది. ఎసిఫేట్ మందును పత్తి, మిర్చి పంటల్లో శనగపచ్చ పురుగు, పచ్చదోమ నివారణకు, ఇమిడా క్లోఫిడ్ మందును తెల్లదోమ, పచ్చదోమ నివారణకు, మోనోక్రోటోఫాస్‌ను సన్న, పచ్చపురుగు నివారణకు రైతులు ఉపయోగిస్తుంటారు. పురుగు మందులు వాడకపోతే దిగుబడులు తగ్గిపోతాయి. దీంతో వాటి వాడకం తప్పనిసరి. డాలర్ విలువ పెరిగే కొద్దీ పురుగు మందుల కంపెనీల యజమానులు ధరలను పెంచుతున్నారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కంపెనీ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది. ఎక్కువగా హైదరాబాదు, బాంబే, పూణె ప్రాంతాల నుంచిపురుగు మందులు దిగుమతి అవుతుంటాయి. ఓ వైపు పెరిగిన ఎరువుల ధరలు, మరో వైపు పురుగు మందుల భారంతో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. ప్రభుత్వం పెరిగిన ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లాని సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు. పార్టీ గుర్తు లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ నాయకులు కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులకు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లాని సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు. పార్టీ గుర్తు లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
గోదారి శాంతించినా.. వీడని కష్టాలు
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7గంటలకు 45.5 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతోంది. 62 అడుగుల నీటిమట్టంతో ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తిన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. వరద ఉధృతి తగ్గటంతో ముంపు నుంచి గ్రామాలు బయట పడ్డాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకూ.., అదే విధంగా చింతూరుకు రాకపోకలు సాగాయి. ఆర్టీసీ బస్సులను కూడా ఈ రహదారుల్లో నడిపారు. నాలుగు రోజులుగా నిలిపి వేసిన విద్యుత్ సరఫరాను ఆ శాఖాధికారులు ఒక్కో ఫీడర్లో పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేక మూగపోయిన సెల్ఫోన్లు మంగళవారం సాయంత్రం నుంచి పనిచేయటంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. వరద తగ్గినప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నందున భద్రాచలం డివిజన్లో 59 పునరావాస కేంద్రాలను కొనసాగిస్తూ 3,109 కుటుంబాలకు చెందిన 11,483 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఇంకా జల దిగ్బంధమే... వరద తగ్గుముఖం పట్టినప్పటికీ భద్రాచలం డివిజన్లోని చాలా గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వాజేడు మండలంలో దూలాపురం, ఏడ్చర్లపల్లి, నాగారం వద్ద రోడ్లపై నీరు తగ్గలేదు. దీంతో చీకుపల్లికి అవతల ఉన్న 32 గ్రామాలకు రాకపోకలు లేవు. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు పడవల ద్వారానే ప్రయాణం సాగించారు. భద్రాచలం నుంచి కూనవరం రహ దారిలో మురుమూరు, పోచారం వంటి చోట్ల రహదారులపై నుంచి వరద నీరు విడవ లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం వీధులు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విస్తా కాంప్లెక్స్‌ను వరద నీరు విడవలేదు. అదే విధంగా రామాలయం పడమర మెట్లకు ఎదురుగా ఉన్న ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. అన్నదానం సత్రం కూడా వరద నీటిలోనే మునిగి ఉంది. రామాలయం నుంచి పంచాయతీ కార్యాలయానికి వచ్చే రహదారిపై నీరు తగ్గినప్పటికీ ఒండ్రు మట్టి చేరటంతో బురదమయంగా తయారైంది. ముంపు తగ్గక పోవటంతో చప్టా దిగువకు చెందిన ఇళ్ల వారు తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఉన్నారు. సుభాష్ నగర్లో నీరు తగ్గినప్పటికీ బురదగా ఉండటంతో సాయంత్రం తరువాత పునరావాస శిబిరాలను నుంచి ఇళ్లకు పయనమయ్యారు. విజృంభిస్తున్న వ్యాధులు వరద ఉధృతి తగ్గినప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. నాలుగు రోజుల పాటు వరద నీరు నిల్వ ఉండటంతో చెత్త, పంటలు ఇతర వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి దుర్గంధం వ స్తోంది. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లకపోవటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లు పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలు లేక వరదబాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల, తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వెలుతురు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పట్టణంలో ఉన్న పునరావాస శిబిరాల్లో స్వచ్ఛంద సంస్థల వారు అందిస్తున్న భోజనం తప్ప ప్రభుత్వపరంగా తగిన సహాయం అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. దీంతో భోజనాల కోసం బాధితులు గిన్నెలు పట్టుకొని నెట్టుకుంటున్నారు. తానీషా కల్యాణ మండ పంలో అయితే గర్భిణులు, ముసలి వాళ్లు భోజనం కోసం లైన్లలో నిలబడ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వరద బాధితులు గోడును పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. -
మున్సిపోల్స్‌కు బ్రేక్?
కనిగిరి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన శాఖ ఉద్యోగులు విధులకు దూరం కానుండటంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయి. దీంతో ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకొంటుండగా..ఆశావహుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈనెల 12 నుంచి జేఏసీ ఉద్యోగ సంఘాలు పూర్తిస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన తరుణంలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా రూపకల్పన కూడా జరగలేదని సమాచారం. కనిగిరి నగర పంచాయతీలో ఈ కార్యక్రమం పూర్తయినప్పటికీ తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల పోలింగ్ కేంద్రాల నిబంధనలపై మున్సిపల్ కమిషనర్లకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. కానీ అది ఈనెల 12 తర్వాతకు వాయిదా పడింది. అంతేకాక చైర్మన్ అభ్యర్థుల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన ఈనెల మొదటి వారంలో విడుదల కావాల్సి ఉన్నా.. నేటికీ రాలేదు. ప్రణాళిక ప్రకారం బుధవారం జరగాల్సిన రాజకీయ పార్టీల సమావేశం కూడా జరిగే అవకాశం లేదు. ఇన్ని అవాంతరాల నడుమ ఈనెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అనుమానమే. సెప్టెంబర్ 2 లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలనే కోర్టు ఆదేశాలు అమలయ్యేట్లు కనిపించడంలేదు. ముఖ్య నేతల్లో ఉపశమనం మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తుండటంతో ఆయా పార్టీల ముఖ్యనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నికలు తాత్కాలికంగా ఆగితే బావుండు అనే యోచనలో ఉన్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు కావడంతో ఎన్నికల నగదు, మద్యం సర్దలేక ఇక్కట్లు పడిన నేతలకు మున్సిపల్ ఎన్నికల ఖర్చు మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు కోట్ల రూపాయలు పెట్టి మళ్లీ సాధారణ ఎన్నికల్లో తామేం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆశావహుల్లో నిరుత్సాహం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ప్రకటనతో అన్ని పార్టీల్లోని ఆశావహులు పోటీల తీరుపై నిన్నటి వరకు లెక్కల్లో మునిగి తేలారు. చైర్మన్ అభ్యర్థులుగా ఉండాలనుకునే వారైతే ముఖ్య నేతలలో సంబంధం లేకుండా ఓసీ అయితే ఒక గ్రూపు ప్యానల్, ఓసీ మహిళ అయితే మరో గ్రూపు ప్యానల్, బీసీ, బీసీ మహిళయితే ఇంకొక ప్యానల్‌గా గ్రూపులు చేసుకున్నారు. వార్డుల్లో కులాల వారీగా గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నులయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. ఆర్జేడీ ఏమంటున్నారంటే.. మున్సిపల్ శాఖ ఆర్జేడీ (గుంటూరు) శ్రీనివాస్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ అడగ్గా ఓటర్ల పోలింగ్ కేంద్రాలపై మంగళవారం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడిందన్నారు. ఎన్నికల విషయాలకు సంబంధించి కచ్చితంగా తానేమీ చెప్పలేనన్నారు. కాగా దీనిపై కనిగిరి కమిషనర్ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం బుధవారం రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తామన్నారు. -
గిరిజనుల ఇళ్లు కూల్చివేత
ఆలుబాక (వెంకటాపురం), న్యూస్‌లైన్: ఆలుబాక పంచాయతీలోని బొదాపురం రిజర్వ్ ఫారెస్టులో కొండాపురం, బొదాపురం గిరిజనులు ఏడాది కిందట పోడు నరికి వేసుకు న్న 15 ఇళ్లను అటవీ అధికారులు మంగళవా రం పోలీసు బందోబస్తుతో కూల్చివేశారు. అధికారులను అడ్డుకునేందుకు గిరిజనులు తీవ్రంగా ప్రయత్నించారు. గిరిజనులకు, అధికారులకు మధ్య నాలుగు గంటలపాటు వాగ్వాదం జరిగింది. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ గిరిజనులు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో, వాజేడు మం డల పర్యటనకు వెళుతున్న భద్రాచలం సబ్ కలెక్టర్ వాహనాన్ని ఆ గిరిజనులు అడ్దగించి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘రిజర్వు ఫారెస్టులో మీరు ఇల్లు కట్టుకున్నారు. ఈ విషయంలో నేనేమీ చేయలేను. అటవీ అధికారులు వారి డ్యూటీ చేశారు’ అని చెప్పి వెళ్లిపోయారు. కనికరించలేదు.. ‘వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్నాం. బాలింతలు, గర్భవతులను తీసుకుని వర్షంలో ఎక్కడికీ వెళ్లలేము. ఒక్క ఇల్లయినా ఉంచాలని వేడుకున్నా అధికారులు కనికరించలేదు’ అని, బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏడాది కిందట పోడు నరికి ఇళ్లు కట్టుకున్నామని వారు చెప్పారు. తమపై అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టారని, జైలు శిక్ష కూడా అనుభవించామని చెప్పారు. ఇంతకాలంపాటు ఇటువైపు కూడా రాని అధికారులు.. వర్షాలు, వరదలతో సతమతమవుతున్న తరుణంలో.. మందీమార్చలంతో ఒక్కసారిగా వచ్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
ఉగ్రరూపం దాల్చిన సమైక్యాంధ్ర
సాక్షి, ఒంగోలు : సమైక్యాంధ్ర ఉద్యమ నాదం జిల్లాలో మార్మోగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులతో పాటు మంగళవారం ఉద్యమ పథంలో కార్మికులు కదం తొక్కారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లాను హోరెత్తిస్తున్నారు. ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చురుకైన పాత్ర పోషిస్తూ ముందు వరుసలో నిలిచి దిశా నిర్దేశం చే స్తోంది. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో రెండో రోజు మంగళవారం ఒంగోలు నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగర కమిటీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒంగోలులో వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ విజయకుమార్ సమావేశాన్ని బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపారు. వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం. వెంకయ్య నేతృత్వంలో డాక్టర్లు పద్మావతి, వేణుగోపాలరెడ్డి, తదితరులు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ సంఘాలు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ బయట ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ నేతృత్వంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. వుడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగమ్మ కాలేజీ జంక్షన్లో రాస్తారోకో, మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట కమిటీని మంగళవారం ప్రకటించింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకున్నారు. చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు పట్టణమంతా ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్లో ధర్నా చేశారు. పర్చూరులో బార్ అసోసియేషన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. న్యాయవాదులు చాగంటి సుబ్బారావు, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, కె. శ్రీనాథ్‌లు దీక్షలో పాల్గొన్నారు. దర్శిలో న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించారు. బసిరెడ్డిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంతనూతలపాడులో జేఏసీ ఆధ్వర్యంలో మద్దిపాడు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కందుకూరులో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు. సీఎస్ పురం మండలంలో విద్యార్థులు నిరసన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొనగా, న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అద్దంకిలో కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్, నాయీ బ్రాహ్మణ సంఘం, బార్ అసోసియేషన్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు ర్యాలీ నిర్వహించి పలు చోట్ల రాస్తారోకోలు చేశాయి. బల్లికురవ మండలంలోని కొప్పెరపాడులో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఉగ్రరూపం దాల్చిన సమైక్యాంధ్ర
సాక్షి, ఒంగోలు : సమైక్యాంధ్ర ఉద్యమ నాదం జిల్లాలో మార్మోగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులతో పాటు మంగళవారం ఉద్యమ పథంలో కార్మికులు కదం తొక్కారు. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లాను హోరెత్తిస్తున్నారు. ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చురుకైన పాత్ర పోషిస్తూ ముందు వరుసలో నిలిచి దిశా నిర్దేశం చే స్తోంది. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో రెండో రోజు మంగళవారం ఒంగోలు నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగర కమిటీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒంగోలులో వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ విజయకుమార్ సమావేశాన్ని బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపారు. వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం. వెంకయ్య నేతృత్వంలో డాక్టర్లు పద్మావతి, వేణుగోపాలరెడ్డి, తదితరులు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఎన్జీఓ సంఘాలు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ బయట ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ నేతృత్వంలో నగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. వుడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగమ్మ కాలేజీ జంక్షన్లో రాస్తారోకో, మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట కమిటీని మంగళవారం ప్రకటించింది. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకున్నారు. చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు పట్టణమంతా ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్లో ధర్నా చేశారు. పర్చూరులో బార్ అసోసియేషన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. న్యాయవాదులు చాగంటి సుబ్బారావు, యార్లగడ్డ వెంకటేశ్వర్లు, కె. శ్రీనాథ్‌లు దీక్షలో పాల్గొన్నారు. దర్శిలో న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించి సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించారు. బసిరెడ్డిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతృత్వంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంతనూతలపాడులో జేఏసీ ఆధ్వర్యంలో మద్దిపాడు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కందుకూరులో మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాస్తారోకో చేశారు. సీఎస్ పురం మండలంలో విద్యార్థులు నిరసన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొనగా, న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అద్దంకిలో కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్, నాయీ బ్రాహ్మణ సంఘం, బార్ అసోసియేషన్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర సంఘాలు ర్యాలీ నిర్వహించి పలు చోట్ల రాస్తారోకోలు చేశాయి. బల్లికురవ మండలంలోని కొప్పెరపాడులో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ కుమ్మక్కు కుట్రలు
కందుకూరు, న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికల్లో మొదటి నుంచి వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చాయి. చివరకు ఆ బంధం ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ కొనసాగింది. గత నెల 27న పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా అప్పట్లో నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు కూడా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో పాటు ఉప సర్పంచ్ పదవులు వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల పరంకాకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి. అప్పట్లో వాయిదా పడిన పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు మంగళవారం రిటర్నింగ్ అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో దాదాపు 30కి పైగా పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. వాటిల్లో పదికి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను ఉప సర్పంచ్‌లుగా కాకుండా అడ్డుకునే యత్నం చేశాయి. అయితే ఆ రెండు పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని రెండు మేజర్ పంచాయతీల్లో ఒకటైన కరేడు పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి పోలుబోయి భాస్కర్ ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. కరేడు పంచాయతీలో ఎనిమిది వార్డులను వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ టీడీపీ ఆరు, కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే వార్డు సభ్యులున్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కవ్వాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కానీ ఉలవపాడులో మాత్రం ఆ రెండు పార్టీలు ఏకమై వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఉప సర్పంచ్ కాకుండా అడ్డుకున్నాయి. ఇక్కడ టీడీపీకి ఆరు, కాంగ్రెస్‌కు మూడు వార్డు సభ్యుల బలం ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థి దగ్గుమాటి మాల్యాద్రికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఉప సర్పంచ్‌లు కానివ్వకుండా చూడాలని, అవసరమైతే టీడీపీతో జతకట్టయినా అడ్డుకోవాలని సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఉలవపాడు మండలంలో టీడీపీ నేతల రాజీనామా... టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేష్టలకు నిరసనగా మండలంలో పలువురు టీడీపీ నాయకులు మంగళవారం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. కరేడు టీడీపీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఒకటో వార్డు మెంబర్ పోలుబోయిన శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా పంచాయతీ ఐదో వార్డు సభ్యురాలు పోలుబోయిన కళ్యాణి కూడా టీడీపీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు సింగిల్ విండో డెరైక్టర్ రేగలగడ్డ బ్రహ్మయ్య తన పదవితో పాటు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు ఉలవపాడు, కరేడు పంచాయతీల్లోని దాదాపు వంద మందికి పైగా రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వివక్షపూరిత చర్యలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో అగ్రకుల అహంకారం పెచ్చుమీరిపోయిందని రాజీనామా లేఖలో ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బీసీలపై పార్టీలో వివక్షత పెరిగిందని, మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గాన్ని అణచివేసే ధోరణితో శివరాం ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామం లోనూ బీసీలపై వివక్షత చూపుతున్నారని భవిష్యత్‌లో అనేక మంది నాయకులు పార్టీని వీడి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: ప్రేమించానని, పెళ్లాడతానని ఓ యువతిని నమ్మించి మోసగించిన వైరాకు చెందిన యువ న్యాయవాదికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కాశీవిశ్వేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం... వైరా మండలం కెజి సిరిపురం గ్రామస్తురాలైన యువతితో అదే గ్రామానికి చెందిన న్యాయవాది నారపోగు రాంబాబు(27)కు ఏడేళ్ల కిందట పరిచయమేర్పడింది. ఖమ్మం టూ టౌన్ పరిధిలోని ప్రయివేటు వైద్యశాలలో పనిచేస్తున్న ఆమెను ప్రేమిస్తున్నానంటూ అతడు కొంతకాలం వెంటబడ్డాడు. ఆ తరువాత, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా లైంగిక సంబంధం సాగించాడు. దీనిని మొదట ఆమె వ్యతిరేకించింది. పెళ్లాడతానని అతను పూర్తిగా నమ్మించడంతో ఆమె మిన్నకుంది. ఈ క్రమంలో, ఆమెకు అతడు మూడుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. జీవితంలో స్థిరపడిన తరువాత చేసుకుంటానని చెప్పేవాడు. కొంతకాలం తరువాత ఆమె గట్టిగా నిలేయడంతో.. ‘నీ దిక్కున్న చోట చెప్పుకో. నేను న్యాయవాదిని. చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు’ అని బెదిరించాడు. దీంతో, ఆమె పెద్ద మనుషులను ఆశ్రయించింది. 2012 జూలై 23న ఇరుపక్షాల పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో కూడా, ఆమెతో పెళ్ళికి అతడు నిరాకరించి, దుర్భాషలాడాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆమెను దుర్భాషలాడారు. ఆ యువతి అదే రోజున వైరా పోలీస్ స్టేషన్లో నారపోగు రాంబాబుపై, అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ అధికార పరిధి దృష్ట్యా కేసును ఖమ్మం రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఖమ్మం టూ టౌన్ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 13మంది సాక్షులను ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కాశీవిశ్వేశ్వరరావు.. నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, నారపోగు రాంబాబుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. బాధితురాలిని మోసగించినందుకుగాను మరో ఏడాది జైలు శిక్ష, 500 రూపాయల జరిమాన, దుర్భాషలాడినందుకు మరో నెల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలుజరగాలని తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలిని దుర్భాషలాడినందుకుగాను రాంబాబు తల్లితండ్రులైన నారపోగు వీరమ్మ, నారపోగు క్రిష్ణయ్యకు వెయ్యి రూపాయల జరిమాన విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.అంజయ్య వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మెహన్రావు, కోర్టు కానిస్టేబుల్ లక్ష్మణ్, హోంగార్డులు సీతయ్య, చిట్టిబాబు సహకరించారు. -
‘స్వాతంత్య్ర’ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీనివాస్ శ్రీ నరేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించాలని డీఈఓను ఆదేశించారు. ఐటీడీఏ, డీఆర్డీఏ, పరిశ్రమల శాఖ, ఉద్యానవన, ఎస్సీ, బీసీ, సెట్‌కం, వికలాంగులశాఖ, వ్యవసాయ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని విద్యుత్, సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానం, పతాకావిష్కరణ ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. శాఖల పనితీరుకు అద్దం పట్టేలా శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విశిష్ట సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ఇచ్చేందుకు ప్రతి కార్యాలయం నుంచి నాలుగో తరగతి సిబ్బందితో సహా ముగ్గురికి మించకుండా ఆగస్టు 12లోగా కలెక్టరేట్‌కు పేర్లు పంపించాలని అన్నారు. పోలీస్ పరేడ్ మైదానం వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అర్బన్ తహశీల్దార్‌కు సూచించారు. ఈ వేడుకలకు స్వాతంత్య్ర సమరయోధులను ఆహ్వానించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ తప్సీర్ ఇక్బాల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఎస్పీ బాలకిషన్‌రావు, సీపీఓ రత్నబాబు, జిల్లా పంచాయతీ అధికారి పటోళ్ళ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ, డీఆర్డీఏ పీడీ పద్మాజారాణి, డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ భానుప్రకాష్, ఆర్డీవో సంజీవరెడ్డి, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఉద్యానవనశాఖ ఏడీ సుబ్బారాయుడు, మెప్మా పీడీ వేణుమనోహర్, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటనర్సయ్య పాల్గొన్నారు. -
శ్రమ దోపిడీ?
దుబ్బ, న్యూస్‌లైన్ : బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వెతలు తప్పడం లేదు. కొన్ని బీడీ కంపెనీల్లో నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు ముబారక్‌నగర్, బాడ్సి, ధర్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఐదువేల మంది కార్మికులు పనిచేసే ఓ కంపెనీలో జీతాలు ఇవ్వడం లేదు. వీరికి నెలలో 10 రోజులు మా త్రమే పని కల్పిస్తున్నారు. దీంతో కార్మికులు మిగిలిన రోజుల్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యాజమాన్యం కార్మికుల అవసరాన్ని ఆసరాగా చేసుకోని మిగిలిన 15 రోజులకు నాన్ పీఎఫ్ కింద పనిచేయిస్తున్నారు. 10 రోజుల పనికి రూ115 చెల్లిస్తుండగా, మిగి లిన 15 రోజులకు రూ90 చెల్లిస్తున్నారు. దీంతో కార్మికులు సగటున ప్రతిరోజు రూ20 వరకు నష్టపోతున్నారు. దీంతో రోజుకు యాజమాన్యానికి రూ12 లక్షల వరకు మిగులుతుంది. వాస్తవానికి కార్మికులకు చెందాల్సిన రూ12 లక్షలను యాజమాన్యం కార్మికులకు చెల్లించడం లేదు. 15 రోజులకు గాను సుమరు రూ2 కోట్ల వరకు కార్మికులకు చెల్లించాల్సినమొత్తాన్ని యాజమాన్యం దోపిడీకి పాల్పడుతుంది. వాస్తవానికి నెలకు 26 రోజుల పనికల్పించి జీవోనం 41 ప్రకారం వేతనాలు చెల్లించాలి. చట్టాలకు విరుద్ధంగా.. కంపెనీ కార్మిక చట్టాలను పూర్తిగా విస్మరించింది. వీటికి తోడు యాజమాన్యాలు ఇచ్చే తూనికాకు తంబాకు కూడా సరిపోవడం లేదు. బయట కోనుగోళ్లు చేయాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారు లు కూడా చూసిచూడనట్లు వ్యవహరిం చడం ఫలితంగా బీడీ కంపెనీ యాజ మన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుం డాపోయింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. వేతనాలు చెల్లించాలి... నాలుగునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నాం. సమయాని కి వేతనాలు రాకపోవడంతో అప్పులు చే యాల్సి వస్తుంది. ధరలు పెరుగుతున్నా యి. కాని మాకు రావాల్సిన వేతనాలు అందడం లేదు. -భాగ్యలక్ష్మి, బీడీ కార్మికురాలు పదిరోజులే పని కల్పిస్తున్నారు... నెలకు పది రోజు ల పని మాత్రమే కల్పిస్తున్నారు. మి గిలిన రోజుల్లో పీ ఎఫ్ లేకుండా ప ని ఇస్తున్నారు. సేటును అడిగితే ఇది కూడా కావాలంటే చేసుకో, లేకపోతే పో అని అంటున్నారు. సమయానికి పైసలు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చే తూనికా కు, తంబాకు కూడా సరిపోవడం లేదు. -లక్ష్మి, బీడీకార్మికురాలు -
పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామీణ ప్రాంత జనాభాకు అనుగుణంగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గతం లో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పెరిగిన వాటితో మొత్తం స్థానాల సం ఖ్య 583కు చేరింది. జనాభా ప్రాతిపదికన నిర్వహించిన ఎంపీటీసీ స్థానా ల పునర్విభజనపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం ఎంపీడీఓలకు సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలు పునర్విభజన చేసినట్లు ఆయన తెలి పారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణుల సంఖ్య 18 లక్షలు ఉండగా, జిల్లాలో 528 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2011 లెక్కల ప్రకారం 20 లక్షల 38 వేల 392 మందికి జనాభా చేరుకోగా అదనంగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయని సీఈఓ చెప్పారు. 3,500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించామన్నారు. ప్రతి మండలంలో ఒకటి నుం చి ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలు పెరిగాయన్నా రు. నిజామాబాద్ రూరల్, బాన్సువాడ మండలాల్లో గరిష్టంగా ఐదు మండలాల చొప్పున పెరిగాయి. పెరి గిన వాటితో ప్రస్తుతం నిజామాబాద్ రూరల్‌లో అత్యధికంగా మొత్తం 29 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే జిల్లాలోని నందిపేట్, వేల్పూర్, సదాశివనగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు పెరగలేదు. మండలాల వారీగా పెరిగిన ఎంపీటీసీ స్థానాల తో ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకున్న అధికారులు ఈ నెల 14న మండల కార్యాలయాల్లో ప్రద ర్శించాలని సీఈఓ సూచించారు. ఈ ముసాయిదాపై ఈ నెల 21 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని, పరిశీలన అనంతరం తుది జాబితాను తయారు చేసి తమకు పంపాలన్నారు. తుది జాబి తాను ఈ నెల 26 లేదా 27న మళ్లీ మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని పేర్కొన్నారు. పెరిగిన స్థానాలు ఆర్మూర్ 2 బాల్కొండ 1 ధర్పల్లి 1 భీమ్‌గల్ 2 డిచ్పల్లి 2 జక్రాన్‌పల్లి 1 కమ్మర్పల్లి 1 మాక్లూర్ 1 మోర్తాడ్ 1 నవీపేట్ 1 నిజామాబాద్ రూరల్ 5 సిరికొండ 2 బాన్సువాడ 5 బిచ్కుంద 2 బీర్కూర్ 1 బోధన్ 2 జుక్కల్ 2 కోటగిరి 1 మద్నూర్ 3 నిజాంసాగర్ 1 పిట్లం 3 రెంజల్ 1 వర్ని 2 ఎడపల్లి 1 భిక్కనూరు 1 దోమకొండ 1 గాంధారి 4 కామారెడ్డి 1 లింగంపేట్ 1 మాచారెడ్డి 1 నాగిరెడ్డిపేట్ 1 తాడ్వాయి 1 -
అంతర్మథనం
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీన అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీలోని పలువురు జిల్లా నేతలలో అంతర్మథ నం మొదలైంది. విలీనమైనా, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా, తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టిక్కెట్టు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వంటి నేత లు అటు అధిష్టానం వద్ద, ఇటు రాష్ట్ర రాజకీయాలలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు. విలీనం జరిగినా.. కలిసి పోటీ చేసినా వీరిని కాదని తమకు టిక్కెట్లు దక్కుతాయో లేదోనని పలువురు గులాబీ నేతలకు సందేహం పట్టి పీడిస్తోంది. వ్రతం చెడినా.. ఫలం దక్కేనా డీఎస్ ప్రధాన అనుచరులలో ఒకరైన బస్వ లక్ష్మీనర్సయ్య నిజామాబాద్ అర్బన్ టిక్కెట్టును ఆశించి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి డీఎస్‌ను కాదని తనకు టిక్కె ట్టు దక్కుతుందా? అని బస్వ సంశయం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనుచరులు చర్చించుకుం టున్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ తొలి అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరును అధికారికంగానే ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణపై యూపీఏ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఈయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా హాజరై తన గళాన్ని విని పించారు. ఇక్కడ సురేశ్‌రెడ్డిని కాదని.. టీఆర్ఎస్ ప్రకటించినట్లు జీవన్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి స్థానం నుంచి ఇరు పార్టీల నుంచి అగ్రనేతలే ఉన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్అలీలలో ఎవరో ఒకరే పోటీకి దిగాల్సి వస్తుంది. దీంతో ఎవరు ప్రత్యామ్నాయ స్థానానికి వెళతారో తెలియదు. జిల్లాలో మరి కొన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడలా... ఇప్పుడు? తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఇన్నాళ్లు నాన్చు డు ధోరణిని అవలంభించడంతో టీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరిగాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరేం దుకు మొగ్గు చూపారు. అధికార పార్టీ నుంచి కూడా పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా రు.కొందరు నేతలు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇప్పుడు యూపీఏ సర్కారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, ఆ దిశగా వేగంగా పావులు కదుపుతుండటంతో రాష్ట్రంతో పాటు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతోంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాతే విలీన అంశంపై స్పందిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో విలీనం లేనట్లేనని నిర్ధారణ జరగకపోవడంతో ఈ చర్చంతా సాగుతోంది. -
మారకపోతే...మార్చేస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పదవ తరగతి పరీక్షల్లో పది జిల్లా పరిషత్ పాఠశాలల్లో, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ‘డి’ గ్రేడ్ ఫలితాలు రావటం బాధగా ఉంది. పేరెం ట్స్,స్టూడెంట్స్ నుంచి బాగా ఒత్తిడి ఉంది.. టీచర్లపై, హెచ్‌ఎంలపై చర్య లు తీసుకోండి. డిప్యూటీ ఈఓలు 15 రోజులకు ఒకసారి స్కూళ్లను విజి ట్ చేయాలి. అంతా బీఈడీ చేసిన వారినే పెట్టుకున్నాం. మన నిర్లక్ష్యంతో నే వేలాది మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు.’ అంటూ భారీ నీటిపారుదల మంత్రి పి సుదర్శన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొత్తగా నిర్మించిన పాఠశాలల్లో రూఫ్ ఇప్పుడే పాడైతే ఎలా? లీకేజీలున్నాయి. భవనాలు సరిగ్గా లేవు. ఎంక్వై రీ చేయించి చర్యలు తీసుకోండి. ఇది విద్యాశాఖ పరిస్థితి కాగా... విద్యుత్తూ అంతే ఉంది. ట్రాన్స్ ఫార్మర్ ఫీజ్‌లు పోతే పెట్టటం లేదు. అవి చెడిపోయినా అంతే! రైతుల గతి ఏమి కావాలి ? మున్సిపాలిటీలు, ఇరిగేషన్లో ఇదే పరిస్థితి ఉంది’. అని ఆవేదన వ్యక్తం చేసిన మం త్రి వచ్చే సమావేశం నాటికి పరిస్థితులు మారనట్లయితే. అధికారులనే మార్చివేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఐదు శా ఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో మం త్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో గరం గరం చర్చతో అధికారులకు వణుకు పుట్టించారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేసి, విద్యార్థులకు మంచి బోధన అందించే విధంగా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రత్యేక తరగతుల ను నిర్వహించి ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటుపడాల న్నారు. ‘డి’ గ్రేడ్ సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణ విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కొన్ని చోట్ల గదులలో వర్షపునీరుతో పాటు పగుళ్లు ఏర్పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిం చే కాంట్రాక్టర్లను మార్చివేసి కొత్త వారికి పను లు అప్పగించాలన్నారు.పనులు పక్కాగా జరిగే విధంగా చూడాలన్నారు. విద్యుత్ అంతే... గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే అధికారులు వెంటనే మరమ్మతులు చేయించాలని మంత్రి సూచించారు. బోధన్ మండలం ఎరాజ్పల్లిలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటలసాగుకు విద్యుత్‌ను ఏడు గంటలు నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు. నగరంలో వరద ఏల? నిజామాబాద్ నగర ప్రజలు వరదతాకిడికి గురయ్యారంటే ఆశ్చర్యంగా అనిపించిందని మంత్రి అన్నారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని వెంటనే తొలగించకపోవడం వల్ల కొన్ని కాలనీలు జలమయంగా మారాయన్నారు. ఈ విషయాన్ని సీఎం కూడా అడిగారని తెలిపారు. నగర పాలక సంస్థ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోతే వారిని మార్చవల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సంయుక్త విచారణ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ పాఠశాల భవనాల కప్పుల లీకేజీలు,నాణ్యతపై ఆర్అండ్బీ, నీటిపారుదలశాఖ అధికారులతో సంయుక్తంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో పంచాయతీ ఎన్నికల సందర్భంగా సిబ్బంది ఇబ్బంది పడా ల్సి వచ్చిందన్నారు.విద్యుత్ అధికారుల కోసం సంబంధిత ఎన్నికల సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.దీంతో విధుల పట్ల ఆశ్రద్ధ వహించిన జుక్కల్ ఏఈని సస్పెండ్ చేసినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ నగేష్ తెలిపారు. ఖరీఫ్ సాగు పెంచాలి.. వర్షాలు సమృద్ధిగా కురిసినందున ఖరీఫ్ సాగు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాలకు 4.400 హెక్టార్లలో పంట దెబ్బతిందని, రైతులు శనగ పంట వేసుకునేలా అధికారులు సూచించాలన్నారు. రైతుల కోరిక మేరకు తిరిగి ఎరువులను, విత్తనాలను సరాఫరా చేయాలన్నారు. కౌలస్నాల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలన్నారు. జిల్లాకు మంజూరైన గోదాములు సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు నిండినందున వాటి నుంచి నీటిని చెరువులకు మళ్లించాలన్నారు. శ్రీరాం సాగర్ నీటిని గోదావరిలోకి వృథాగా పోనివ్వకుండా జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు మళ్లించి, 22టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసినట్లు వివరించారు. అలాగే వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను మరమ్మతులు చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, అదనపు జేసీ శేషాద్రి, జేడీఏ నరసింహ, ఇరిగేషన్ ఎస్ఈ భగవంత్‌రావు, ఆర్అండ్బీ ఎస్ఈ మాధవీసుకన్య, డీసీఓ శ్రీహరి, ట్రాన్స్‌కో ఎస్ఈ నగేష్, డీఈఓ శ్రీనివాసచారి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, జిల్లా అధికారులు పాల్గొన్నా రు. అధికారుల్లో నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎస్సెస్సీలో ప్ర భుత్వ పాఠశాలల్లో ‘డి’ గ్రేడ్ ఫలితాలు వచ్చాయి. తరగతి గదులూ లీకేజీ అవుతున్నాయి.విద్యుత్ అధికారులు కనీ సం ట్రాన్స్ఫార్మర్లను రిపేరు చేయడం లేదు. జిల్లా కేంద్రంలో కాలనీలు జలమయం కావడానికి డ్రైనేజీల్లో చెత్త తీయకపోవడమే కారణం! అధికారులు మారక పోతే వారినే మార్చేస్తాం. - భారీ నీటిపారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి -
ఖరీఫ్ కష్టమే..
డిచ్పల్లి, న్యూస్‌లైన్: వరుణుడు కరుణించినా ఖరీఫ్ సాగంటేనే రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోవంతో సాగుకోసం పెట్టుబడులను భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయన్న ఆనందం రైతుల్లో లేకుండా పోయింది. పెరిగిన రేట్లతో పెట్టుబడులు ఈసారి 20 శాతం వరకు రైతులపై అదనపు భారం కానున్నాయని వ్యవసాయాధికారులే పేర్కొంటున్నా రు. రెండేళ్లలో సుమారు 14 సార్లు ఎరువుల ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూక్ష్మ పోషక విధానం(ఎన్బీఎస్) కారణమని అధికారులు అంటున్నారు. ఎరువుల ధరలు పెంచే అధికారం కం పెనీలకు ఇవ్వడంతో అవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్న నడ్డి విరుస్తున్నాయి. సకాలంలో ఎరువు లు, విత్తనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటిం చినా ఆచరణలోకి రావడం లేదు. దీంతో విత్తనాల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి భారీ వర్షాలతో చెరువులు,కుంటలు జలకళను సంతరించుకున్నా యి. భూగర్భజలాలు సైతం పెరిగాయి. జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 4 లక్షల 70వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో లక్షా 20వేల హెక్టార్లలో వరి, 60వేల హెక్టార్లలో మొక్కజొన్న, లక్షా 90 వేల హెక్టార్లలో సోయా, లక్ష హెక్టార్లలో ఇతర పంటలు సాగు కానుండగా, ఇందుకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు 1లక్షా 20వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 62వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు ప్రాం తాల్లో రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఆందోళనలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సోయా విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. గతేడాది ఖరీఫ్ సీజన్లో డీఏపీ బస్తా ధర రూ. 985 ఉండగా ప్రస్తుతం రూ. 1107కు చేరుకుంది. పొటాష్ బస్తా ధర రూ. 410 ఉండగా ప్రస్తుతం రూ. 810కి పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా బస్తాకు రూ. 150 నుంచి రూ. 200 వరకు పెరిగాయి. సబ్సిడీపై ప్రభుత్వం అందజేసే సోయాబీన్ విత్తన ధరలు సైతం బాగా పెరిగాయి. సోయా విత్తన సబ్సిడీని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఇంతవరకు జమచేయలేకపోయింది. పెరిగిన కూలి రేట్లు.. గత ఖరీఫ్‌తో పోల్చుకుంటే ఈ యేడాది కూలి రేట్లు బాగా పెరిగాయి. గతేడాది ఒక్కో మహిళా కూలీకి రోజుకు రూ.200 చెల్లించగా, ప్రస్తుతం రూ. 320 చెల్లించాల్సి వస్తోంది. అలాగే ట్రాక్టర్‌తో దున్నడానికి గతేడాది ఎకరానికి రూ. 500 ఉం డ గా, ఈ యేడు రూ. 600 కు పెరిగింది. నాట్లు వేసే ముందు కేజ్‌వీల్ ట్రాక్టర్‌తో దమ్ము చేసేందుకు గతేడాది రూ. 800 చెల్లించగా, ఈ యేడు రూ. 950 చెల్లించాల్సి వస్తుంది. -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
ముదినేపల్లి : మండలంలోని బొమ్మినంపాడు పాత దళితవాడలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ కన్వీనర్ దాసి రంగారావుపై మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవగా, ప్రాణాపాయ స్థితిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 31న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నేతల రూపకు రంగారావు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో రూప గెలుపొందారు. ప్రత్యర్థి వర్గం నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక రంగారావుపై కక్ష పెంచుకున్నారు. తమ అభ్యర్థి ఓటమికి ఆయనే ప్రధాన కారకుడిగా భావించారు. ఈ నేపథ్యంలో రంగారావు మంగళవారం పొలంలో పురుగుల మందు చల్లి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రత్యర్థి వర్గానికి చెందిన పంతగాని సతీష్‌బాబు గడ్డపలుగుతో దాడి చేశాడు. ఈ ఘటనలో రంగారావు తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగారావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె.ఈశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ సతీష్ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. దాడి హేయం... రంగారావుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తదూలం నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు తీవ్రంగా ఖండించారు. ముదినేపల్లిలో వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన హేయమైనదిగా అభివర్ణించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కక్షలు పెంచుకుని దాడులు చేయడం తగదని హితవు పలికారు. రంగారావుపై హత్యాయత్నాన్ని పార్టీకి చెందిన వివిధ విభాగాల కన్వీనర్లు తీవ్రంగా ఖండించారు. -
ఇడుపులపాయ కిటకిట
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : సుధీర్ఘంగా సాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన వేళ.. మహానేత వైఎస్ తనయ షర్మిల ఇడుపులపాయకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. మరోవైపు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించడంతో.. సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడి కి తర లివచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పులివెందుల నియోజకవర్గంలోని వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, కడప డీసీసీబీ బ్యాంకు చెర్మైన్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర మహిళా నేత వాసిరెడ్డి పద్మ, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి, అల్లె ప్రభావతి, వైఎస్ఆర్ సీపీ కడప పట్టణ మైనార్టీ విభాగపు కన్వీనర్ షఫీ, చక్రాయపేట, వేం పల్లె మండల కన్వీనర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తరలివచ్చిన వారిలో ఉన్నారు. వైఎస్ఆర్ ఘాట్ జై జగన్.. జై జై జగన్.. వైఎస్ఆర్ అమర్ రహే వంటి నినాదాలతో మార్మోగింది. సర్పంచులను పరిచయం చేసుకున్న వైఎస్ విజయమ్మ ఇటీవల ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరిచయం చేసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్‌హౌస్‌లో దాదాపు 2 గంటల పాటు ఒక్కో గ్రామం వారీగా సర్పంచ్ వివరాలను తెలుసుకుంటూ.. వారి గ్రామాల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.