District
-
భంగపాటు తప్పదా !
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఒక్కసారైనా భద్రాచలం పీఠాన్ని దక్కించుకోవాలనే టీడీపీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలితో కేడర్‌లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మండల స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. గ్రామాల్లో అయితే పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలే కరువయ్యారు. ఆ పార్టీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ డివిజన్ స్థాయిలో ఆధిపత్యం కోసం పార్టీ నాయకులు తరచూ కుమ్ములాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో భద్రాచలంలో నడిరోడ్డుపైనే నాయకులు ముష్టి యుద్ధాలకు దిగారు. పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న తమలాంటి వారిని యశోద రాంబాబు చిన్నచూపు చూస్తున్నారంటూ ఇటీవల అర్ధరాత్రి వేళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే అతని అనుచరులు హల్చల్ చేశారు. వారం క్రితం భద్రాచలం మండలంలోని పలు గ్రామాల ముఖ్య కేడర్ అంతా యశోద రాంబాబు వ్యవహారశైలిపై పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో మాట ఇచ్చిన తప్పిన ఆయన గ్రామాల్లోకి వస్తే ఓట్లు వేసేది లేద ంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం ముందు హల్చల్ చేసిన నాయకులు ఏకంగా కార్యాలయానికి తాళాలు కూడా వేశారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో పూర్తిగా నిస్తేజం ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, సీపీఎం తర్వాత మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ప్రస్తుతం గ్రామాల్లో పూర్తిగా పట్టు తగ్గింది. వెంకటాపురం, చర్ల, భద్రాచలం, కూనవరం మండలాల్లో వర్గపోరు ఉంది. వ్యతిరేక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు వేరే పార్టీకైనా ఓట్లు వేయించేందుకు సిద్ధమేనని అక్కడి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ ప్రచారంలో మిగతా పార్టీల కన్నా పూర్తిగా వెనుకబడిపోయింది. ఫణీశ్వరమ్మకు టికెట్టుపై తమ్ముళ్ల ఆగ్రహం : భద్రాచలం నియోజకవ ర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేని ఫణీశ్వరమ్మకు అధిష్టానం టికెట్టు కట్టబెట్టడంపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఎంతో కాలంగా పార్టీ అభివృద్ధి కోసమని పనిచేస్తున్న వాజేడుకు చెందిన బోదెబోయిన బుచ్చ య్య, చర్లకు చెందిన ఇర్పా శాంత, కూనవరానికి చెందిన సీనియర్ నాయకుడు సోడే రామయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరంతా ఆయా మండలాల్లో మంచి పట్టుఉన్న నాయకులే. అయితే మూడు సార్లు ఎంపీగా గెలిచి, ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సోడె రామయ్యను ప్రచారం లో విస్మరించారు. హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చే సుకున్న ఫణీశ్వమ్మ బరిలో నిలవటంతో ఆశావాహులంతా నిరుత్సాహంలో పడిపోయారు. బోదెబోయిన బుచ్చయ్య వంటి నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, చివరకు మొత్తబడి విరమించుకున్నారు. అయితే ఫణీశ్వరమ్మకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం మాట చెవికెక్కేనా : భద్రాద్రి తమ్ముళ్ల కుమ్ములాట తారాస్థాయికి చేరటంతో తెలంగాణ జిల్లాల పరిశీలకులు మండవ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిన ఇక్కడి నాయకత్వంపై తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి దిద్దుబాటు చేస్తున్న సమయంలోనే ఇరువురు నాయకులు వాదులాటకు దిగారు. ఇది చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో తేరుకున్న జిల్లా నాయకత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు తోటకూర రవిశంకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా యశోద రాంబాబుకు కూడా దీనిలో భాగస్వామ్యులను చేశారు. అయితే అధిష్టానం మాట భద్రాద్రి టీడీపీ తమ్ముళ్లు చెవికెక్కించుకుంటారా..?అనేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి,15మందికి గాయాలు
హైదరాబాద్ : రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. డీసీఎం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం పిత్తవార్లపల్లిలో ఆటో బోల్తాపడిన సంఘటనలో తొమ్మిదిమంది గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
పలాసలో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు
శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రను కోరుతూ పలాసలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు వెటర్నరీ, వ్యవసాయ, విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా సీమాంధ్ర జిల్లాల్లో విభజన సెగలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పత్తిపాడు మండలం వానపల్లిలో సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కాగా విభజనను నిరసిస్తూ కోరుకొండ మండలం నర్సాపురంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంద్రకు మద్దతుగా ఎర్రగుంట్లలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే నెల్లూరుజిల్లా కావలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు కదలటం లేదు. -
సిరిసిల్లలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
కరీంనగర్ : ఆర్థిక ఇబ్బందులు మరో నేతన్న ఉసురు తీశాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవటంతో కుటుంబ పోషణ భారమై సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌కు చెందిన చక్రధర్ ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. -
మంత్రుల వైఖరి స్పష్టం చేయాలి
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల తీరు ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని.. ఇప్పటికైనా వారు తమ వైఖరి స్పష్టం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని చెరుకు ఫ్యాక్టరీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి కోట్ల, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు తలో వాదం వినిపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడినని చెప్పుకుంటున్న టీజీ కొద్దిసేపు గ్రేటర్ రాయలసీమ, ఆ తర్వాత రాయల తెలంగాణ, మరోసారి మహబూబ్‌నగర్‌తో కూడిన రాయలసీమ అంటూ విభిన్న ప్రతిపాదనలతో సమైక్యవాదుల మనోభావాలను దెబ్బతియడం తగదన్నారు. కోట్ల విషయానికొస్తే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సోనియా ఇంటి ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే బదులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారన్నారు. అంతేతప్ప నీచ రాజకీయాలకు పాల్పడితే ఎన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజనకు సానుకూలంగా స్పందించి సీమాంధ్ర ప్రజల మనోభావాలపై దెబ్బ కొట్టాడన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో సీల్డ్‌కవర్ పదవులు పొందేకన్నా.. ప్రజాభిమానంతో ఏ చిన్న పదవిలో కొనసాగినా గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మౌనంగా ఉండటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిలా తయారు కాక తప్పదన్నారు. సీమాంధ్రలో చాలా మంది ఎమ్మెల్యేలకు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్లో పంపాలని తెలియకపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులంతా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాలు చేసి ప్రజల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతున్న విషయాన్ని గమనించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులకు సూచించారు. జేఏసీ నేతలు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయని నాయకుల మెడలు వంచాలని భూమా కోరారు. -
‘ఆధిపత్య’ ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యవాద పోరులో జిల్లా కాంగ్రెస్ నేతలు సొంత ఎజెండాతో చేస్తున్న రాజకీయం చర్చనీయాంశమవుతోంది. ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ధి పొందే దిశగా జిల్లాలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ ప్రకటన వస్తే తొలి రాజీనామా తనదేనని చెప్పిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించినప్పటికీ... తర్వాత పరిణామాల్లో ఆయన కర్నూలు వైపు కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి జిల్లా కేంద్రానికి వచ్చి ర్యాలీ నిర్వహించారు. మరో అడుగు ముందుకేసిన టీజీ ఒకరోజు నిరాహారదీక్ష జరిపి రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే మకాం వేసిన కోట్ల మాత్రం.. సమైక్యాంధ్ర, లేదంటే మూడు రాష్ట్రాలు చేయాలని... అదీ కాదంటే కర్నూలును తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో లాబీయింగ్ ప్రారంభించారు. దీంతో మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాంరెడ్డి, మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబులతో కలిసి కోట్ల.. సోనియాగాంధీని కలవడం జిల్లా కాంగ్రెస్‌లోని విభేదాలను బయటపెట్టింది. సోనియాగాంధీ అపాయింట్మెంట్ తీసుకున్న కోట్ల.. టీజీ వెంకటేశ్‌తో పాటు ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డిని తీసుకెళ్లకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. టీజీని ఒంటరిని చేయడంలో భాగమేనా?: తెలంగాణ ప్రకటన వెలువడక ముందు వరకు రాయల తెలంగాణ నినాదమే కోట్ల వర్గీయులది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు ముఖ్యంగా కర్నూలుకు జరిగే అన్యాయంపై నివేదికలు తెప్పించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ సమైక్యాంధ్రప్రదేశ్‌గా కొనసాగించని పక్షంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కూడా డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తాను సమైక్య నినాదానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే లోపాయికారిగా కేంద్ర మంత్రి హోదాలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగానే మంగళవారం సోనియాగాంధీని, కేంద్ర మంత్రులను కలిశారు. అదే సమయంలో కర్నూలులో ఉన్న టీజీ వెంకటేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘రాష్ట్రాన్ని విభజిస్తే చరిత్ర సోనియాగాంధీని క్షమించదు. రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా ఉంది’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియాను కలిసినప్పుడు కోట్ల, ఆయన వర్గీయులు టీజీ వ్యవహారశైలిపై ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. కర్నూలులో సమైక్యవాదులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, చివరికి పార్టీ నేతలను కూడా తప్పుపడుతూ తన రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారని సోనియాకు వివరించారు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యమంలో కలిసి రావడం లేదని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆమెకు ఫిర్యాదు చేశారని ఓ నేత తెలిపారు. టీజీపై చర్యలకు కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. పార్టీలో టీజీకి సహాయ నిరాకరణ జిల్లాలో గత కొంత కాలంగా కోట్ల, టీజీ వర్గాల మధ్య విభేదాలున్నా... డీసీసీ నేతలు, మరికొందరు నాయకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులిద్దరితో సంబంధాలు కొనసాగించేవారు. డీసీసీ అధ్యక్షుడు రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఈ కేటగిరీలో ఉండేవారు. కాగా ఇటీవలి కాలంలో కోట్ల వీరిద్దరికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో టీజీకి సహాయ నిరాకరణ చేస్తూ, పూర్తిగా కోట్ల వర్గీయులుగా మారినట్లు డీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రెంటికీ చెడిన రేవడిగా టీజీని మార్చే వ్యూహంలో భాగంగానే కోట్ల వర్గీయులు ‘సమైక్య రాజకీయం’ సాగిస్తున్నట్లు గత కొద్దిరోజుల పరిణామాలను బట్టి తెలుస్తోంది. -
సమైక్యం
సంప్రదాయ వేషధారణలు.. వినూత్న వాయిద్యాలు.. ప్రదర్శనలు.. శవయాత్రలు.. వ్యంగ్య ఫ్లెక్సీలు.. దిష్టిబొమ్మల దహనాలు.. జిల్లాలో ఎటుచూసినా సమైక్య నిరసనలే. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారులు మేము సైతం అంటూ పోరుబాటలో కలిసి నడుస్తున్నారు. రేపోమాపో రాలిపోయే వృద్ధులు సైతం ఒంటిపై సమైక్యాంధ్ర చిత్రాలతో భాగస్వాములవుతున్నారు. ఎటొచ్చి కొందరు నాయకులే అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. సాక్షి, కర్నూలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరసనలు హోరెత్తుతున్నాయి. బుధవారం ఎనిమిదో రోజు కూడా ఆందోళనలు మిన్నంటాయి. కుల, కార్మిక, కర్షక సంఘాలతో పాటు ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. న్యాయవాదులు.. విద్యార్థులు తమదైన శైలిలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడగా.. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించారు. కర్నూలుకు చెందిన పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది సభ్యులు జాతీయ రహదారిపై యోగాసనాలను ప్రదర్శించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అనంతరం రోడ్డుపైనే అల్పాహారం స్వీకరించారు. విద్యాశాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని రూపొందించి ప్రదర్శించడం ప్రజలను ఆకట్టుకుంది. ఆత్మకూరులో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో దాదాపు 1000 మంది ముస్లింలు తహశీల్దార్ కార్యాలయం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుని రాకపోకలను స్తంభింపజేశారు. సోనియా మనసు మారాలని కోరుతూ నడి రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. చాగలమర్రిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి జాతీయ ర హదారిని దిగ్బంధించారు. కొత్తపల్లిలో వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనాథరెడ్డితో పాటు జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు రాస్తారోకో, ధర్నాలు నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెలుగోడు పట్టణంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు, వ్యాపారులు పట్టణంలోని ఆర్అర్బీ అతిథిగృహం నుంచి ప్రదర్శనగా నాలుగు స్తంభాల మంటపం వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తుగ్గలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిహారదీక్షలు చేపట్టారు. తెర్నేకల్లులో హైస్కూల్ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల కేంద్రమైన దేవనకొండలో ఏపీ ట్రాన్స్‌కో అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో బంద్ చేయించారు. కరివేములలో గ్రామస్తులు వంటావార్పు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ వద్ద రిలేనిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఏపీ ఎన్జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. 72 గంటల సమ్మెలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు మూడో రోజు పెన్‌డౌన్ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డోన్ పట్టణంలోనూ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదోనిలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఏకపక్ష నిర్ణయంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డులో 400 మంది సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇక మిల్టన్ విద్యా సంస్థల అధినేత సగరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్లను ఊడ్చి వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ నినదించారు. -
రెండు గ్రామాల్లో నేడే ఎన్నికలు
ఇందూరు,న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికలు రద్దయిన గ్రామాల్లో గురువారం జరుగనున్నాయి. వేలం పాటలు నిర్వహించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ నిజామాబాద్ డివిజన్ వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి వీటికి ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ,తిరస్కరణలు పూర్తయ్యా యి. కోమన్‌పల్లిలో సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు గాను ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా మూడింటికి ఎన్నికలు నిర్వహిం చనున్నారు. అలాగే వెంకటాపూర్‌లో సర్పం చ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ పంచాయతీలోనూ ఎనిమిది వార్డు స్థానాలకు ఐదు ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఉదయం7 గంటలకు ప్రాంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల లోగా ఫలి తాలు వెలువడుతాయి. -
‘ఎంఈఓ’ కోసం పైరవీలు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడం తో ఎంఈఓ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అనేక మండలాల్లో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇద్దరు, ముగ్గురు ఉండటంతో ఎంఈఓ బాధ్యతల నిర్వహణకు వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రధానోపాధ్యాయులు రాజకీయ నాయకులను ఆశ్రయించగా, మరి కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆశ్రయిస్తున్నారు. ముడుపులు ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పదవీ విరమణలతో ఖాళీ అయిన మోర్తాడ్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, మండలాల ఎంఈఓ పోస్టులతో పాటు జిల్లాలో మరో పది మండలాలకు పొరుగు మండలాల ఎంఈవోలు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే సీనియర్లకు ఎంఈఓ లుగా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేవారు. అయితే చాలా మంది ఎంఈవోలు పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. ఏ మండలంలో ఎంఈఓ పోస్టు ఖాళీ అయితే ఆ మండలానికి చెందిన సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంకు ఎంఈఓగా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో గాంధారి మినహా అన్ని మండలాలకు ఇన్చార్జి ఎంఈఓ లే కొనసాగారు. అనేక మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు పదవీ విరమణ చేయడంతో వారు అదనంగా నిర్వహించిన ఎంఈఓ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. ఈ పోస్టులను గతంలో మాదిరిగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయా లా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలా అనే విషయంపై విద్యాశాఖలో చర్చ జరిగింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఖాళీ అయిన పోస్టుల అదనపు బాధ్యతలను మండలానికి చెందిన సీని యర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లకు కాకుండా పొరుగు మండలాల్లో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి అప్పగించారు. దీంతో ఒక వ్యక్తికి తన సొంత పోస్టింగ్‌తో పాటు రెండు అదనపు బాధ్యతలను మోపడం వల్ల ఏ పని సక్రమంగా నిర్వహించే అవకాశం లేక పోయింది. దీంతో బాధ్యతలు నిర్వహించే అధికారికి తలకు మించిన భారం ఏర్పడటమే కాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులకు అవసరమైన పనులు సకాలంలో పూర్తి కాలేదు. అంతేకాక పాఠశాలలపై అజామాయిషి కరువైంది. ఫలితంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. చివరకు ఎంఈఓలుగా సీనియర్ హెచ్ఎంలా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌లా అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి ఎంఈఓ పోస్టులు అత్యంత కీలకం అని భావించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు వారి మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టు అదనపు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయిం చారు. ఎన్నికలకు ముందుగానే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో అదనపు బాధ్యతల అప్పగింతకు బ్రేక్ పడింది. ఎంపిక పారదర్శకంగా సాగాలి ఎంఈఓ అదనపు బాధ్యతల అప్పగింత పారదర్శకంగా సాగాలి. ఎంఈఓలు లేక ఇప్పటికే విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యింది. సరైన వారిని ఎంఈఓలుగా నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఎలాంటి ఆరోపణలు లేని సీనియర్ హెచ్‌ఎంలకే ఎంఈఓగా బాధ్యతలను అప్పగించాలి. - సత్యానంద్, జిల్లా అధ్యక్షుడు, బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ -
పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి
ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : భారత సైనికులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దొంగచాటుగా దాడులు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా వారికి వత్తాసు పలకడం దేశ ద్రోహం అవుతుందని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. వెంటనే పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ దుశ్చర్యను నిరసిస్తూ బుధవారం బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ‘యెండల’ మాట్లాడుతూ.. ఎలాంటి యుద్ధ వాతావరణం లేని సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ భారత్‌పై దాడులకు ఉసిగొల్పడం పిరికిపంద చర్య అన్నారు. ఐదుగురు భారత సైనికులను ప్రాణాలను బలిగొంటే, దేశం కోసం ప్రతి భారతీయుడు తలుచుకుంటే పాకిస్థాన్‌లో ఒక్క ఉగ్రవాది కూడా మిగలడని హెచ్చరించారు. దేశంలో భద్రత కరువైందన్నారు. జవాన్లు మరణిస్తే సంబరాలా..! పాక్ దాడిలో భారత జవాన్లు మరణిస్తే, తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సంబరాలు, సన్మానాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరవీరులపట్ల స్పందించని కాంగ్రెస్ నాయకులు, నేడు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఆందోళనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్,బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనిల్ రెడ్డి,ఉద్యమ కమిటీ నాయకులు కుల్దీప్సహానీ తదితరులు పాల్గొన్నారు. -
శీనన్న మాటంటే మాటే
పలువురు జాతీయ నాయకుల వద్ద తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని రెండు గంటల పాటు వివరిస్తే... ఓపిగ్గా విన్న వారు ఇంత అన్యాయాన్ని ఎలా భరిస్తున్నారని అడిగారని తెలిపారు. ఉద్యోగులు,విద్యార్థులు,ప్రజా సంఘాలు,రాజకీయ జేఏసీ, కార్మికులు, మహిళలు, ప్రజల పోరాటలతో పాటు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదయోగ్యం అయ్యేంత వరకు మనమంతా ఓర్పుతో ఉండాలని డీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో నిజామాబాద్‌లోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలోని మైనింగ్,మినరల్,సింగరేణి వంటి గనులు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా నీటి వనరులను పెంచుకుని బీడు భూములను సాగులోకి తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారస్వామి పాత్రను పోషిస్తే, తాను వినాయకుడిగా జీవించానని.. కథను డీఎస్ సభికులకు వినిపించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వైద్యకళాశాలకు తెలంగాణ పేరు పెట్టేవిధంగా ప్రతిపాదనలు చేసినట్లు డీఎస్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీని సమష్టి కృషితో సాధించుకున్నామన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఆయన సభలో జోహార్లు అర్పించారు. సభికులతో ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయించారు. డీఎస్‌ను రాజకీయ, ఉద్యోగ, కుల సంఘాలు, విద్యార్థి, కార్మిక, న్యాయవాద, డాక్టరు జేఏసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సభకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షత వహించగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్, పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సతీష్‌పవార్, అరుణతార, మాజీ మేయర్ సంజయ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, సురేందర్, రత్నకర్, రాజేంద్రప్రసాద్‌లు పాల్గ్గొన్నారు. మంత్రి, విప్ గైర్హాజరు.... తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరువాత మొదటి సారిగా నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభకు మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి,ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిలు దూరంగా ఉన్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరవర్గంలోని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ మినహా మిగితా అందరూ గైర్హాజరయ్యారు. మూడు రోజుల కిందట మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అనుచరవర్గాలు కూడా దూరంగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఫ్లెక్సీల ఏర్పాటులోనూ ఈ వ్యత్యాసం కనిపించింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాటగా కొనసాగుతోంది. మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీఎస్ అనుచరులు రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పంచుకుంటుండగా, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, విప్ అనిల్ మూడవ వర్గంగా వ్యవహరిస్తున్నారు. సమయం, సందర్భాలను బట్టి మూడవ వర్గంగా వ్యవహరిస్తున్న నాయకులు, వారి అనుచరులు అటు డీఎస్తోనూ, ఇటూ పీఎస్తోనూ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న విభేదాలు కార్యకర్తలను తీవ్ర ైనైరాశ్యానికి గురిచేస్తున్నాయి. -
జిల్లాలో ఓ మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 114.0 మి.మీ.కాగా, ఇప్పటివరకు 23.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కడపలో 25.4. మిల్లీమీటర్లు, వల్లూరులో 24.4, చెన్నూరులో 18.8, ఖాజీపేటలో 38, కమలాపురంలో 30.2, ఎర్రగుంట్లలో 14.8, బద్వేలులో 14.2, గోపవరంలో 18, బి.మఠంలో 17.8, సిద్దవటంలో 12.5, అట్లూరులో 20.6, ఒంటిమిట్టలో 11.2, జమ్మలమడుగులో 10.6, ప్రొద్దుటూరులో 1.4, చాపాడులో 40.0, దువ్వూరులో 16.8, మైదుకూరులో 39.2, రాజుపాలెంలో 12.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మూయిస్తున్నారు. జిల్లాలోని 8 ఆర్టీసీ డిపోల్లో 840 బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 70 లక్షల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తోంది. 8రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఆర్టీసీకి 5.60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలో రోజుకు 10 కోట్ల రూపాయల మేర బంగారు వ్యాపారం జరిగేది. ఉద్యమం కారణంగా 80 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే ఆయిల్ మిల్లులు, ధాన్యంతో పాటు అన్ని రకాల మిల్లుల ద్వారా రోజుకు 15 కోట్ల వ్యాపారం సాగేది. ఇవన్నీ నిలిచిపోవడంతో 120 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార సముదాయాల దాకా రోజుకు 18 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. ఇవి కూడా పూర్తిగా బంద్ కావడంతో 144 కోట్ల నష్టం సంభవించింది. అలాగే రోజుకు లక్షలీటర్ల పెట్రోలు, రెండు లక్షల లీటర్ల డీజిల్ వినియోగమయ్యేది. ఎనిమిదిరోజుల బంద్‌లో నాలుగురోజులు పెట్రోలు బంక్‌లు మూసేశారు. తద్వారా 5.96 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంకుల్లో నిలిచిపోయిన రూ. 640 కోట్ల లావాదేవీలు: జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో రోజుకు 80 కోట్ల లావాదేవీలు సాగేవి. ఉద్యమం కారణంగా 8 రోజులుగా బ్యాంకులు మూతపడటంతో 640 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. వీటితో పాటు ఏటీఎంలు కూడా అధిక సంఖ్యలో మూతపడ్డాయి. 31వ తేదీ నుంచి ఉద్యమం నడుస్తుండటం, నెలలో మొదటివారం కావడంతో జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెతో పాటు ఇతర ఖర్చులకు ఇక్కట్లు తప్పడం లేదు. శుక్రవారం రంజూన్ పండుగ ఉండటంతో ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో బుధ, గురు వారాల్లో సాయంత్రం వేళల్లో వ్యాపార దుకాణాలు తెరిచేందుకు జేఏసీ నేతలు అనుమతిచ్చారు. -
ఇప్పుడీ ఉప ఎన్నికలు అవసరమా?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రస్తుత లోక్‌సభ గడువు మరో తొమ్మిది నెలల్లో ముగియనున్న తరుణంలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అవసరమా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి అధికార దాహం వల్లే ఈ స్వల్ప కాలానికి ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చిందని విమర్శించారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో నగర శివార్లలోని గొట్టిగెరె వద్ద నైస్ రోడ్డు పక్కన బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుటుంబ రాజకీయాలంటే దేవెగౌడకు ఎక్కడలేని కోపం వస్తుందని ఎద్దేవా చేస్తూ.. ఆయన చేసేవంతా కుల రాజకీయాలేనని ధ్వజమెత్తారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకున్న జేడీఎస్ ఇకమీదట సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జేడీఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఏకమయ్యాయని ఆరోపించారు. ఆయన కుటుంబం తప్ప ఇంకెవరైనా పచ్చగా ఉంటే దేవెగౌడ సహించరని విమర్శించారు. వారికి అండగా నిలిచిన వారినే రాజకీయంగా అంతమొందిస్తారని ఆరోపించారు. ‘వాళ్లింట్లో ఎప్పుడూ పండుగ భోజనాలుండవు, చావు భోజనాలే’ అని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ఏనాడూ లోక్‌సభకు హాజరైన పాపాన పోలేదని, ఇప్పుడు ఆయన సతీమణి అనితను గెలిపిస్తే లోక్‌సభ సమావేశాలకు హాజరవుతారా అని ప్రశ్నించారు. కనుక ఆమెతో పాటు మండ్యలో జేడీఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జేడీఎస్‌తో అంతర్గత ఒప్పందం ద్వారా రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలపనందుకు ఆయన బీజేపీని తూర్పారబట్టారు. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో రెండున్నర లక్షల ఓట్లను పొందిన ఆ పార్టీ, ఇప్పుడు తమ అభ్యర్థిని పోటీ చేయించడం లేదంటూ ‘బీజేపీ వారికి సిగ్గు లేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రసంగించిన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర బీజేపీ మద్దతు తీసుకుంటున్న దేవెగౌడ, రేపు లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతిస్తారా అని నిలదీశారు. తమ పార్టీ అభ్యర్థిగా బెంగళూరు గ్రామీణ స్థానంలో పోటీ చేస్తున్న డీకే. సురేశ్, 2014 ఎన్నికల్లో కూడా బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ప్రసంగించారు. -
నమోదు చేసుకున్నా అందని ‘ఆధార్’ కార్డులు
కలెక్టరేట్,న్యుస్లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆధార్’ నమోదు నిజామాబాద్ నగరంలో అభాసు పాలవుతోంది. ప్రజల నుంచి స్పందన భాగానే ఉన్నా... కార్డులు జారీ కాకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఆధార్ నమోదు గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైంది. నగరం లో సుమారు 3.83 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 3,57,373 మంది ఆధార్ కోసం నమోదు చేసుకున్నారు.సెప్టెంబర్ చివరికల్లా ఆధార్ నమోదు 100 శాతం పూర్తిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. అయితే కథంతా ఇక్కడే మొదలైంది.. ఆధార్ నమోదు తప్ప కార్డుల సంగతి ఇటు అధికారులు, అటు ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కేవలం నమోదుపైనే దృష్టి పెట్టడంతో కార్డుల పంపిణీ వెనుకబడిపోయింది. నగరంలో సుమారు లక్ష మంది వరకు ఆధార్‌ను నమోదు చేసుకుని కా ర్డుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోం ది. వీరు తిరిగి ఆధార్ కార్డు కోసం ‘మీ సేవ’లేదా ఇంటర్ నెట్ల చుట్టూ పరుగులు పెటా ్టల్సి వస్తోంది. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు అవసరమవుతున్నందున నెట్ నిర్వాహకులు ఇదే అవకాశంగా అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కో కార్డుకు రూ. 50 నుంచి రూ.70 వసూలు చేస్తున్నారు. ఆధార్ నమోదు చేసుకున్న నెలన్నరకు కార్డు అందాల్సి ఉంది. అయి తే నమోదు సమయంలో దొర్లుతున్న పొరపాట్లతో కార్డు తిరస్కరణకు గురవుతున్న ట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నిర్వాహకులు కూడా ఏదో నమోదు చేశామా... అన్న చందంగా ప్రక్రియను సాగించడం వలన నగరంలో కార్డులు జారీ కాలేకపోతున్నాయని విమర్శలు వస్తున్నా యి. ఒక్కో ఆధార్ నమోదుకు ఏజెన్సీకి రూ.12 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. నమోదు నుంచి కార్డు జారీ చేసేవరకు ఏజెన్సీదే బాధ్యత.అయితే ఇది అమలుకు నోచుకోవడం లేదు. కార్డుల జారీలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. పోస్టాఫీసుల్లో కార్డులు ఆగిపోతున్నాయని కూడా అంటున్నారు. నగరంలో ఆధార్‌నమోదు ఎన్‌రోల్‌మెంట్‌ను శ్రీవేణి ఇన్ఫో కం పెనీ లిమిటెడ్ చేపట్టింది. ప్రస్తుతం ఏడు కేం ద్రాల ద్వారా ఆధార్ నమోదు జరుగుతోంది. ప్రతి రోజు ఒక్కో కేం ద్రంలో 50 మంది వరకు ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకుంటున్నారు. ఏడాది అయ్యింది ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకొని ఏడాది అయింది. ఇప్పటికీ రాలేదు. ప్రతి రోజు ఇంటికి వెళ్లగానే అమ్మను కార్డు కోసం అడుగుతున్నా... పోస్టుమన్‌ను ఆరా తీస్తున్నా.. అతను వస్తే ఇస్తాంగా అంటున్నాడు. నెట్లో తీసుకొందామనుకుంటే *50 అడుగుతున్నారు. -వెంకటి.నాందేవ్‌వాడ చిరునామాలతో సమస్య ఆధార్ నమోదు జిల్లాలో వేగవంతం అయినా కార్డు జారీలో ఆలస్యమైన మాట నిజమే. అయితే నమోదు జరిగిన అధార్ కార్డులు బెంగళూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావాల్సి ఉంటుంది. కార్డులు జారీ అవుతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. మరికొందరి చిరునామాలు తప్పుగా ఉంటున్నాయి. - ఉద య్‌కుమార్,ఏఎస్ఓ -
ఎస్సీ, ఎస్టీ వాడల్లో...ఉచిత ‘వెలుగులు’
సాక్షి, కడప: దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేదలకు స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళిత, గిరిజనుల ఇళ్లకు ఉచితంగా విద్యుత్‌ను అందించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. బిల్లుల చెల్లింపునకు సంబంధించి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ ఈనెల 2న జీవో 58 జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 93, 159 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలు 23,176 ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 20,260 కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు జూలై నెల నుంచి విద్యుత్ బిల్లులన్నింటినీ చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ జిల్లా సాంఘిక సంక్షేమశాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనువుగా జిల్లాలోని లబ్ధిదారులు, వారికున్న బకాయిల వివరాలను పంపించాల్సిందిగా విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. వారిందించే వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా మొదటివారంలోనే వాటిని చెల్లించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి రెగ్యులర్ బిల్లులు చెల్లిస్తారు. బకాయిలను మాత్రం రెండు విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్టీలకు ఎప్పుడో..!: ఎస్సీల విద్యుత్తు బిల్లుల చెల్లింపుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం ఎస్టీల విషయంలో నిర్లిప్తత వహించింది. గిరిజన తాండాల్లో నివసించే ఎస్టీల బిల్లులు చెల్లించేందుకు ఇంకా ఉత్తర్వులు వెలువరించలేదు. దీంతో జూలైకు సంబంధించిన ఎస్సీల బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తే, ఎస్టీలు మాత్రం వారి బిల్లులు వారే చెల్లించుకోవాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 15, 178 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కొన్ని తాండాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. తాండాల్లో నివసించేవారిలో 60 శాతం మంది 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారి పరిస్థితేంటి..!: దళిత, గిరిజన వాడల్లోని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాలనే నిర్ణయం మంచిదైన్పటికీ అద్దె ఇళ్లలో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసించే వారిలో 50 యూనిట్ల విద్యుత్‌ను వాడే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పేదవర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలందరికీ మేలు చేసేలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కేవలం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపజేస్తామనే విధానం సరైంది కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో నివసించేవారిలో మెజార్టీ శాతం కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు. తమను పట్టించుకోకుండా కేవలం దళితవాడలకు ఇస్తామనడంలో తమకు అన్యాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తాం: పీఎస్ఏ ప్రసాద్, జేడీ జూలై నెల నుంచి ఎస్సీల విద్యుత్తు బిల్లులను చెల్లిస్తాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా 50 యూనిట్లలోపు ఎంతమంది విద్యుత్తును వినియోగిస్తున్నారో ఆ వివరాలను ఎస్పీడీసీఎల్ అధికారులు పంపిస్తే బిల్లులను మేమే చెల్లిస్తాం. పాత బకాయిలను రెండు విడత లుగా చెల్లిస్తాం. -
వరద మిగిల్చిన మరో విషాదం
కూనవరం, న్యూస్‌లైన్: వరద కష్టాలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన కుంజా రాజులు (35) జ్వరంతో బాధపడుతూ సమయానికి వైద్యం అందక బుధవారం మృతి చెందాడు. మృతుడి తల్లి కుంజా లాలమ్మ కథనం ప్రకారం... పది రోజుల క్రితమే రాజుకు జ్వరం వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల క్రితం పరిస్థితి మరింత విషమించింది. చుట్టూ వరద నీరు చేరుకోవడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి కూడా తల్లి తీసుకెళ్లలేకపోయింది. తాను ఒంటరిగా ఉండ డం వల్లే కొడుకును తరలించలేకపోయాయనని, వైద్యం అందక అతడు మృత్యువాత పడ్డాడని లాలమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఒక్కగానొక్క కుమారుడు తనవుచాలించడంతో దిక్కులేని దానినయ్యాయని బోరున విలపిస్తోంది. నాలుగురోజుల్లో నలుగురు... వరద నీరు చుట్టుముట్టడంతో మండలంలో నాలుగురోజుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కూనవరంలో షేక్ మీరా ఉద్దీన్ మృతిచెందిన మర్నాడు నుంచి టేకులబోరులో వరసగా సూరం కమల, ఏడ్ల వేదవతి, కుంజా రాజులు మృత్యువాత పడ్డారు. ఇలా వరుస మరణాలతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికార్లు తక్షణం స్పందించి విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో విలీనం చేయాలి
భద్రాచలం , న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని భద్రాచలం పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకున్న భద్రాచలం పరిరక్షణ కమిటీ బుధవారం పట్టణంలోని రాజుల సత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆ కమిటీ కన్వీనర్ పివిఎస్ విజయ్‌వర్మ మాట్లాడుతూ....1956 సంవత్సరానికి ముందు నుంచి భద్రాచలం డివిజన్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, పరిపాలనా సౌలభ్యం కోసం నాడు ఖమ్మం జిల్లాలో కలిపారని అన్నారు. నేడు అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా వెళ్తున్న భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించటం ద్వారా స్థానిక గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాకాకుండా తెలంగాణలో భద్రాచలాన్ని కల్పితే భద్రాచల ప్రాంతం పూర్తిగా తమ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మొదట 1956కు ముందు ఉన్న తెలంగాణ కావాలని పోరాటాలు చేసి నేడు తెలంగాణ పై మాట మార్చటం దారుణమని, ఇది ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని అన్నారు. చిల్లర వాదనలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తే ఇక్కడి ప్రజానీకం తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. భద్రాచలానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విద్యా, ఉద్యోగ, నీటి, రవాణా, ఆరోగ్య రంగాలలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఇక్కడ నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రాలో భద్రాచలం ప్రకటన వచ్చే వరకు సంతకాల సేకరణ, ధర్నాలు వంటి కార్యక్రమాలు అన్ని సంఘాలు, పార్టీల వారు చేయటానికి నిశ్చయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. వాస్తవ కోణంలో ఆలోచించి స్థానిక ఎమ్యేల్యే, ఎంపీలు వ్యవహరించాలని లేకుంటే ఇక్కడ ప్రజానీకం దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏవిఎస్పి నాయకులు సున్నం వెంకటరమణ, సి వెంకన్నరాజు, మన్నెసీమ అధ్యక్షులు చిచ్చడి శ్రీరామమూర్తి, గిరిజన నాయకులు కారం సత్తిబాబు, సున్నం లక్ష్మయ్య, మర్మం నర్సింహారావు, గొంది బాలయ్య, నాగయ్య, అపక శ్రీను, తుడుందెబ్బ వీరస్వామి, ఉబ్బ వేణు, సయ్యద్ మున్నాకర్, కల్లూరి ఆదినారాయణ, కృష్ణంరాజు, కొరస రాజు తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రిని తాకిన విభజన సెగ
భద్రాచలం, న్యూస్‌లైన్ : తెలంగాణ విభజన సెగ భద్రాచలాన్ని తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన నాటి నుంచి హైదరాబాద్ తరువాత భద్రాచలంపైనే చర్చ సాగుతోంది. బుధవారం భద్రాచలంలో చోటుచేసుకున్న ఘటన ఈ ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో కలపాలనే దానిపై మరింత చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలానికి చెందిన కొన్ని ఆదివాసీ సంఘాల వారు బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఆంధ్ర ప్రాంతంలోనే కలపాలని కోరారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సున్నం వెంకటరమణ, మన్యసీమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చిచ్చడి శ్రీరామ్మూర్తి, గిరిజన ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ గొంది వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘాల నాయకుడు కారం సత్తిబాబు, భద్రాచలం పరిరక్షణ కమిటీ కన్వీనర్ పీవీఎస్ విజయవర్మతోపాటు పలువురు నాయకులు ఆదివాసీల తరఫున తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన పలువురు నాయకులు విలేకరుల సమావేశం జరుగుతున్న రాజుల సత్రంలోకి ప్రవేశించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని నినాదాలు చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆదివాసీ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ఏర్పాటుతో ఆదివాసీలకు తలెత్తే సమస్యలపై చర్చించుకుంటున్న తరుణంలో ఇలా సమావేశాన్ని అడ్డగించటం సరికాదని ఆదివాసీ విద్యార్థిసంఘం నాయకుడు కారం సత్తిబాబు తీవ్రంగా స్పందించారు. ఇరువర్గాల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఇరువ ర్గాల వారిని శాంతింపజేశారు. భవనం బయటకు వచ్చిన తరువాత మళ్లీ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతం మునిగిపోనుందని అందుకనే దాన్ని అడ్డుకుంటున్న త రుణంలో ఇలా ఆంధ్రలో కలుస్తామని చెప్పటం సరైంది కాదని బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు ఆదివాసీ నాయకులతో వాదనకు దిగారు. దీనిపై సున్నం వెంకటరమణ, గొందివెంకటేశ్వర్లు, చిచ్చడి శ్రీరామ్మూర్తి సమావేశం జరుపుకోవడానికి గల కారణాలను వివరించారు. ఇరువర్గాల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు వారితో చర్చించారు. రాష్ట్రాల విభజనపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో సున్నితమైన అంశాలపై అనుమతి లేనిదే సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు. ఇరు వర్గాల వారికి తగు హెచ్చరికలు చేసి పంపించారు. అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛను అడ్డుకుంటే ఎలా : భద్రాచలం ప్రాంతంలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర విభజన జరిగే సమయంలో తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ వాదులు అడ్డుకోవటం ఎంతవరకూ సమంజసమని ఆదివాసీ సంఘాల నాయకులు సున్నం వెంకటరమణ, గొందివెంకటేశ్వర్లు, చిచ్చడి శ్రీరామ్మూర్తి అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో ఉద్యోగాలు, చివరకు పదవులు కూడా ఆదివాసీలకు దక్కకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే లంబాడాలు భద్రాచలం ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారని, అదే జరిగితే ఇక్కడ ఆదివాసీలు కనుమరుగై పోయే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ జాతి పరిరక్షణ కోసం ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నుంచి దశల వారీ ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు. భద్రాచలం తెలంగాణాలో అంతర్భాగమే : భద్రాచలం ప్రాంతం తెలంగాణలో అంతర్భాగమేనని బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు అన్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలనే ఎత్తుగడను ప్రభుత్వం చేస్తోందని దీన్ని తాము అడ్డుకుంటామన్నారు. -
ఉప్పెనలా ఉద్యమం
‘సమైక్య ఉద్యమ ఉధృతి తీవ్రరూపం దాల్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా...కూలీల నుంచి ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగువారిని విడదీస్తున్నారనే ఆవేదన ..విభజనతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళన ...ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి రాలేదనే ఆగ్రహం ..వెరసి ఎనిమిదోరోజు ఉద్యమంలో మరింత వేడిని రగిల్చాయి. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా జిల్లాలోని అన్ని చోట్ల ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు చేపట్టారు. సాక్షి, కడప: రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఎనిమిదిరోజులుగా జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమసెగలు నింగికెగశాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా సెవెన్‌రోడ్స్ వరకూ సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. చెక్కభజన చేసుకుంటూ, సమైక్యాంధ్రకు మద్దతుగా పాటలు పాడుతూ నిరసన తెలిపారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అన్ని రాజకీయపార్టీల నేతలు జెండాలను, పార్టీ అజెండాలను పక్కనపెట్టి ఉద్యమంలోకి వచ్చి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం చేయాలని శివానందరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలు తెలుగుజాతికి ద్రోహం చేశాయని రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్కాంగ్రెస్పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేశ్‌బాబు, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, నగర సమన్వయకర్త అంజద్‌బాషా సందర్శించారు. దీక్షకు సంఘీభావంగా వంశీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పు చేపట్టారు. ఉరితీసేవారిని కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ కాంగ్రెస్‌పార్టీ నిరంకుశత్వంగా విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని అవినాష్‌రెడ్డి విమర్శించారు. న్యాయవాదులు, టీచర్ల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రగతిభవన్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ఉద్యోగులు వంటా-వార్పు చేపట్టారు. సాధారణ ప్రజలు కూడా కాలనీల వారీగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఏడురోడ్ల కూడలిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. రిమ్స్ జే ఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కాలేజీ పేరులో రాజీవ్ పేరును తొలగించి రాయలసీమ అని స్టిక్కర్ అంటించారు. ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టాభిరామ మండీమర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వేల మందికి వంటా-వార్పు నిర్వహించారు. బైక్ మెకానిక్, ఎల్ఐసీ, వస్త్రభారతి, ఎరువులు, పురుగుమందులు, చిల్లర అంగళ్ల వ్యాపారులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. న్యాయవాదులు, ప్రైవేటు, ఏయిడెడ్ ఉపాధ్యాయుల నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. శివాలయం వీధిలో ఆందోళన కారులు పలు ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. మునిసిపల్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. రాయచోటిలో ద్విచక్రవాహనాలను కూడా తిరగనివ్వకుండా ఆందోళన కారులు పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ఓ పెట్రోలు బంకుపై ఆందోళన కారులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. జమ్మలమడుగు పాతబస్టాండ్‌లో కొనసాగుతున్న నిరసనదీక్షలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వేర్వేరుగా సందర్శించి సంఘీభావం తెలిపారు. పట్టణంలో మునిసిపల్, నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రగుంట్లలో జువారీ ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చెక్కభజన చేశారు. ఆర్టీపీపీ ఉద్యోగులు రోడ్డుపై ఖో..ఖో, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మైదుకూరులో ైవె ఎస్ఆర్సీపీ క్రమశిక్షణకమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలేదీక్షలను వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సందర్శించారు. అక్కడే వంటా- వార్పు చేపట్టారు. అవినాష్‌రెడ్డి రోడ్డుపై క్రికెట్ ఆడారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ శవపేటికకు మహిళలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. బద్వేలులో జేఏసీ నేతలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కలసపాడులో వంటావార్పు చేపట్టారు. రాజంపేటలో పట్టణ పురోహితుల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్‌లకు పిండ ప్రదానం చేశారు. బోయినపల్లిలో వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
వరదబాధితుల అవస్థలు ఇన్నిన్ని కాదు
భద్రాచలం, న్యూస్‌లైన్ : గోదారమ్మ శాంతించింది.... భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 42 అడుగుల నీటిమట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉప సంహరిస్తున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. అయితే వరద తొలగిన తర్వాత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. గ్రామాలు బురద మయంగా తయారయ్యాయి. ముంపు తగ్గటంతో పునరావాసాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుని పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదకు ఇళ్లలోకి బురద చేరి సామాగ్రి అంతా అందులో చిక్కుకుపోయింది. వాటిని బయటకు తీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. కాగా, ముంపు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో చాలాచోట్ల రహదారులపై ఉన్న నీరు కూడా తొలగిపోయింది. అయితే వాజేడు మండల కేంద్రానికి సమీపంలో ఇంకా నడుం లోతు నీరు నిల్వ ఉంది. అదే విధంగా చీకుపల్లి వద్ద పది అడుగులకు పైగానే నీరు ఉండటంతో అవతల ఉన్న 32 గ్రామాలకు ఇంకా పడవ ప్రయాణమే సాగుతోంది. భద్రాచలం నుంచి వాజేడు వరకూ మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద వరద నీరు పూర్తిగా తొలగిపోయింది. దీంతో విస్తాకాంప్లెక్స్ వద్ద దుకాణాలు వారం రోజుల తరువాత బయట పడ్డాయి. అంతా నష్టమే.. గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత వాసులకు అపార నష్టం వాటిల్లింది. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికల కోసం సర్వేను ముమ్మరం చేశారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోవటంతో పాటు చాలా చోట్ల స్తంభాలు నేలకొరగటంతో నష్టం సుమారు రూ.50 లక్షల వరకూ ఉంటుందని ఆ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. వరదలతో వాజేడు మండలం, అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం మండలాలకు వెళ్లే ఆర్అండ్బీ రహదారులకు పలు చోట్ల గ ండ్లు పడ్డాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో ఒండ్రు మట్టి చేరటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రహదారిలో బుధవారం పలు చోట్ల వాహనదారులు బురదలో జారి కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యయి. రాకపోక లకు అంతరాయం లేకుండా ఉండేందుకు ఆర్అండ్బీ శాఖాధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఏజెన్సీలో ప్రబలుతున్న వ్యాధులు : గోదావరి తగ్గుముఖం పట్టాకా అంటు వ్యాధులు విజృంభిస్తుండటంతో ఏజెన్సీ వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. కూనవరం మండలంలో మంగళవారం అతిసార వ్యాధితో ఓ మహిళ మృతి చెందగా, బుధవారం జ్వరంతో కుంజా రాజు(35) మృత్యువాత పడ్డాడు. వరద ఉధృతి తగ్గినప్పటికీ గ్రామాల్లో బురద పేరుకుపోవటంతో వాటిని ఇప్పటికిప్పుడు శుభ్రం చేసే పరిస్థితి లేక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు సైతం పారిశుధ్య చర్యలపై దృష్టి సారించకపోవటంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేద ని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టక పోతే విష జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యాశాఖ వింతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా విద్యాశాఖలో పా లన గాడితప్పింది. ప్రతీ నెల పదోన్నతుల ప్రక్రియ అటకెక్కింది. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రయోజనం కల్పించే సీనియారిటీ జాబితా ఎంతకీ విడుదల కావడం లేదు. సర్వీసు క్రమబద్ధీకరణ నత్తనడకన సాగుతోంది. మొత్తంగా జిల్లా విద్యాశాఖలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తర్వాత జిల్లా విద్యాశాఖపై ఎలాంటి పని ఒత్తిడి లేదు. ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయుల సర్వీసు అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన విద్యాశాఖ వీటిని అసలే పట్టించుకోవడం లేదు. పాఠశాలల తనిఖీ సమయంలో చిన్నచిన్న విషయాలకే సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే ఆ శాఖ ఉన్నతాధికారులు... తమ కార్యాలయం పనితీరును మాత్రం బేరీజు వేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగి పర్సనల్ రికార్డు(పీఆర్) రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలకు సంబంధించి అన్ని కేటగిరీల్లో కలిపి జిల్లాలో 14,400 మంది టీచర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతీనెల పదోన్నతులు ఇవ్వాలి. డిసెంబర్ 2012లో ఈ ప్రక్రియ నిర్వహించిన అనంతరం పక్కనపెట్టారు. ఉపాధ్యాయుల నిరసనతో జిల్లాలో చివరిగా మే 25న పదోన్నతులు కల్పించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)లుగా, స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. ఇక నుంచి ప్రతీ నెల కచ్చితంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తామని విద్యాశాఖ జిల్లా అధికారి అప్పుడు ప్రకటించారు. మేలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు సంబంధించి ఏప్రిల్ వరకు ఖాళీ అయిన స్థానాలను మాత్రమే భర్తీ చేశారు. అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. మే 31, జూన్ 30, జూలై 31... ఇలా మూడు నెలల్లో రిటైర్మెంట్ అయిన వారి స్థానాల్లో ఎవరినీ నియమించడం లేదు. నెలకోసారి పదోన్నతులు అనే విషయం ప్రకటనలకే పరిమితం కావడంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. గడిచిన మూడు నెలల్లో గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు 12, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం పోస్టులు 40 ఖాళీ అయ్యాయి. మరోవైపు 50 మంది ఉపాధ్యాయులు కొత్తగా మొదలైన ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, ప్రిన్సిపాళ్లుగా చేరారు. వీరి స్థానాలు సైతం ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 120 పోస్టుల వరకు ఖాళీ అయ్యాయని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. అర్హులకు పదోన్నతి కల్పించి ఈ స్థానాల్లో నియమించాల్సి ఉండగా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పదోన్నతుల ప్రక్రియ జూలైలోపు జరిగితే పదో వేతన సవరణ సంఘం ప్రకారం ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగేది. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రయోజనం కోసం పదోన్నతుల కౌన్సెలింగ్ తేదీని ముందుకు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మన జిల్లాలో మాత్రం ఆలస్యంగా కూడా ఈ ప్రక్రియ జరగడం లేదు. ఈ విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం డీఈవోను కలిసినట్లు తెలిసింది. ఇప్పటికైనా పదోన్నతులు కల్పించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఫలితం కనిపించడంలేదని తెలుస్తోంది. సీనియారిటీకి దిక్కు లేదు ఉపాధ్యాయులకు వృత్తిపరంగా మేలు చేసే సీనియారిటీ జాబితా విషయంలో జిల్లా విద్యాశాఖ మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సీనియారిటీ జాబితా వెల్లడిలో నిర్లక్ష్యంపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 3న తాత్కాలిక జాబితా ప్రకటించారు. జూలై 3లోపు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత వారంలోపు తుది జాబితా వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రకటన కూడా యథావిధిగా అటకెక్కింది. విద్యాశాఖ చెప్పిన గడువు ముగిసి నెల రోజులైనా ఇప్పటికీ సీనియారిటీ తుది జాబితా విడుదల చేయడం లేదు. ఇలా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంతో స్టెప్అప్, ప్రీపోన్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందని సీనియర్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులకు మేలు జరుగుందని వీరు చెబుతున్నారు. సర్వీసు క్రమబద్ధీకరణ అంతే సంగతులు నియామకమైనప్పటి నుంచి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రొబెషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల జారీలోనూ విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం 2012లోనే 7 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మాత్రం కేవలం 400 మంది సర్వీసును మాత్రమే క్రమబద్ధీకరించారు. నేరుగా నియామకమైన ఉపాధ్యాయులకు సంబంధించి ప్రవర్తన తీరుపై పోలీసుశాఖ నివేదికలు అవసరముంటాయి. వీటిని త్వరగా తెప్పించాల్సిన బాధ్యత నియామక అధికారి అయిన డీఈవోదే. డీఈవో కార్యాయం తీరు వల్లే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు నేరుగా సర్వీసు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. జిల్లాలో మాత్రం ఇది జరగడం లేదు. దీంతో వేల మంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. -
ఏజెన్సీ డీఎస్సీకి లైన్ క్లియర్
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ డీఎస్సీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 2012 నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసుకోవచ్చని కోర్టు నుంచి ఉత్తర్వులు అందడంతో ఐటీడీఏ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఐటీడీఏ పరిధిలో గల పాఠశాలల్లో 370 ఎస్జీటీ, 182 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2012లో స్పెషల్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో 493 పోస్టులకు అనుమతి వచ్చింది. అయితే మిగతా జిల్లాల్లో ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి అయినప్పటికీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం కోర్టు కేసుల వివాదాలతో భర్తీప్రక్రియ నిలిచిపోయింది. డీ ఎస్సీకి దరఖాస్తు చేసుకున్న పలువురు లంబాడా అభ్యర్థులు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు కాదని ఆదివాసీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టును సైతం అశ్రయించారు. దీంతో ఉపాధ్యాయల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఏడాదికి పైగా కోర్టులో వాదనలు జరిగాయి. లంబాడా అభ్యర్థులు సమర్పించిన ఏజెన్సీ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఐటీడీఏ అధికారులు కోర్టుకు నివేదించారు. ఇందుకు సమ్మంతించిన కోర్టు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 11న ఐటీడీఏ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి తెలిపారు. తేలని పీఈటీల పంచాయితీ... ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించినప్పటికీ పీఈటీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. 41 పీఈటీ పోస్టుల భర్తీకి ఐటీడీఏ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించి అర్హుల జాబితా కూడా ప్రకటించారు. అయితే పీఈటీ ఉద్యోగాలకు ఐటీడీఏ అధికారులు ప్రకటించిన జాబితాలో కొందరు నకి లీ సర్టిఫికెట్లు జతచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థులు సమాచార హక్కు చట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల మార్కుల జాబితాలను యూనివర్శిటీ నుంచి తెప్పించి ఐటీడీఏ అధికారులకు అందజేయటంతో అవి నకిలీవిగా తేలాయి. వారిని తొలగించి మరో సారి జాబితా ప్రకటించినప్పటికీ అందులో కూడా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిన ఆదివాసీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది నిర్ణయాన్ని కోర్టు పెండింగ్‌లో పెట్టడంతో పీఈటీ పోస్టుల భర్తీకి ఆమోదం లభించలేదు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
బెజ్జూర్, న్యూస్‌లైన్ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్కపెల్లి(బి) గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్లే వెంకటికి భార్య అమృత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమృత ఆరు నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి రావాలని కోరినా రావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటి(28) మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. బుధవారం ఉదయం సిర్పూర్లోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడి తల్లి తారాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై వివరించారు. మానసిక క్షోభతో యువకుడు.. ఆసిఫాబాద్ : యజమాని మృతితో మానసిక క్షోభకు గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని సందీప్‌నగర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై సాదిక్‌పాషా కథనం ప్రకారం.. సందీప్‌నగర్‌కు చెందిన కాడె సంజూ(21) కాగజ్‌నగర్‌కు చెందిన ఫ్రిజ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్నాడు. రాత్రి పట్టణంలో గుర్ఖాగా ఉంటున్నాడు. ఇటీవల రాజన్న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి అంత్యక్రియలకు కాగజ్‌నగర్ వెళ్లిన సంజూ మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు. మంగళవారం తిరిగి వచ్చి రాత్రి 11గంటల సమయంలో గుర్ఖా విధులకు వెళ్లాడు. వేకువజామున 3గంటలకు వచ్చి ఇం ట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసేసరిగి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిం చాడు. మృతుడి తల్లి కోకిల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మతిస్థిమితం లేని మహిళ.. మందమర్రి రూరల్ : మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన అయోషా బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అయోషా పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మతిస్థిమితం సరిగా లేని ఆమె ఇదివరకు పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంపై ఆధారపడిన కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం వస్త్రోత్పత్తిదారులతో జౌళి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. పాలిస్టర్ పరిశ్రమకు సరఫరా అవుతున్న యారన్ రేట్ ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు ఉత్పత్తైన గుడ్డకు ధర రాకపోవడంతో వస్త్రోత్పత్తిదారులు గుడ్డ ఉత్పత్తిని తగ్గించారు. దీంతో సగానికిపైగా సాంచాలు ఆగిపోయాయి. కార్మికులకు పనిలేని పరిస్థితి నెలకొంది. యారన్ ధరతగ్గిస్తే వస్త్రోత్పత్తి గిట్టుబాటవుతుం దని, లేకుంటే బట్ట ఉత్పత్తి చేయలేమని యజమానులు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, కార్మికులు రోడ్డున పడకుండా యజమానులు పరిశ్రమను నడపాలని సూచిం చారు. కాటన్ పరిశ్రమలో పెద్దగా ఇబ్బంది లేకపోగా, పాలిస్టర్ పరిస్థితి దయనీయంగా ఉందని యజమానులు వివరించారు. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు సూచించారు. ఆర్డీవో కె.శ్రీనివాస్, జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి అశోక్‌రావు, ఏడీవో రశీద్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీఈ నారాయణ, వస్త్రోత్పత్తిదారులు సుదర్శన్, సత్యం, భాస్కర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
పెళ్లిళ్లకు ఉద్యమ ఎఫెక్ట్ ?
అన్నవరం, న్యూస్‌లైన్ :ఈ నెల పదోతేదీ నుంచి శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. రత్నగిరి, సత్యదేవుని సన్నిధి పెళ్లిళ్లకు సిద్ధమవుతోంది. ఏటా శ్రావణమాసంలో రత్నగిరిపై సుమారు 300 వివాహాలు జరుగుతాయనేది ఓ అంచనా. ఈనెల పదో తేదీ నుంచి వివాహాలు ప్రారంభం కానున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో రత్నగిరికి వచ్చే భక్తుల రాక తగ్గింది. ఆలయంలో వివాహాలు కూడా తక్కువ జరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల విరామం అనంతరం మరలా ఈనెల పదో తేదీ శ్రావణ శుద్ధ చవితి ఉత్తర నక్షత్రం, వృషభ లగ్నంలో వివాహ ముహూర్తంతో ఈ వివాహాల సీజన్ ప్రారంభం కానుంది. వరుసగా 11,12,15,16,17,21,23,25,29 తేదీల్లో వివాహాలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, బంద్ ప్రభావంతో ఈ ముహూర్తాల్లో జరిగే వివాహాలను వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముహూర్తాలలో పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నట్టు వివాహ బృందాలు సమాచారం అందించాయని క్యాటరింగ్, డెకరేషన్ కార్మికులు తెలిపారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో వివాహాలు నిర్వహిస్తామని వారు చెప్పినట్టు సమాచారం. సత్యదేవుని ఆలయానికి ఏటా కార్తీక, వైశాఖం తర్వాత శ్రావణమాసంలోనే భక్తులు ఎక్కువగా వస్తారు. సుమారు 5 లక్షల మంది భక్తులు రత్నగిరికి వచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేసారు. ఆదాయం శ్రావణ మాసంలో రూ.మూడు కోట్లు వరకూ రాగలదని అంచనా వేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ అంచనాలు నిజమవుతాయా అనేది ఆలయ వర్గాల్లో సందేహం నెలకొని ఉంది. ఏర్పాట్లపై ఈఓ సమీక్ష ఈఓ పి. వేంకటేశ్వర్లు, దేవస్థానం అధికార్లతో బుధవారం ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రావణ శుక్రవారం, శని, ఆది వారాల్లోనూ, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. సత్యగిరిపై గల హరిహర సదన్, విష్ణు సదన్ సత్రాల్లో బస చేసే భక్తుల కొరకు దేవస్థానం బస్‌ను సత్రం గదుల రిజర్వేషన్ కార్యాలయం నుంచి సత్యగిరికి ఉచితంగా నడుపనున్నారు.పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఈఓ ఆదేశించారు. -
బెల్లంపల్లి జిల్లాపై ఆశలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన రావడంతో బెల్లంపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఆశలు రేకెత్తాయి. రాష్ట్రం ఏర్పడితే కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను విడదీసి తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలం నుంచి ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదన వస్తే తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరి శీలిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో బెల్లంపల్లి, మంచిర్యాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఏ ప్రాంత ప్రజ లు ఆ ప్రాంతంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. బెల్లంపల్లి, మంచిర్యాల లో ప్రత్యేకంగా రాజకీయ, కార్మిక, వ్యా పార, వాణిజ్యవర్గాలతో కమిటీలను కూ డా ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ పోటాపోటీగా విజ్ఞాపన పత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో జిల్లా అంశం తెరపైకి వచ్చింది. వనరులు పుష్కలం జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నా యి. విశాలమైన భవనాలు, క్వార్టర్లు, వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు వినియోగానికి అందుబాటులో ఉన్నా యి. తూర్పు ప్రాంతం కేంద్రంగా బెల్లంపల్లి ఇప్పటికే పోలీస్ జిల్లాగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకంగా అదనపు ఎస్పీ కా ర్యాలయంతోపాటు ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధా న రైల్వే మార్గం, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర ప్రభుత్వ కార్యాల యాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. గెస్ట్‌హౌజ్‌లు ఇతర సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మున్సిఫ్ కోర్టు మంజూరు కాగా, బస్ డిపో మంజూరు కోసం స్థల పరిశీలన కూడా జరిగింది. భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు పూర్తిగా జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నాయి. అందుకే చిరకాలంగా ఈ ప్రాంత వాసులు జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారంపడే అవకాశాలు ఉండవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ ప్రాంత ప్రజలు బెల్లంపల్లి జిల్లా అవుతుందనే కొండంత ఆశతో ఉన్నారు. -
సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : దేశంలో 60శాతం ఉన్న యువత సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక పద్మావతి గార్డెన్స్‌లో జరిగిన నవభారత యువ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో ఎలాంటి అవకాశాలు లేక అభివృద్ధికి దూరమవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేడు ఆహార ఉత్పత్తి పెరగడం లేదని, పక్కనే గోదావరి ఉన్నా సాగునీరు లేక పంటలు చేతికందడం లేదని తెలిపారు. పాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి సాగునీరందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాల్సి ఉన్నా ప్రభుత్వాల చేతిగాని తనంతో వ్యవసాయం నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నేటి యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నా.. అవకాశాలు లేక మేథాసంపత్తి సరిహద్దులు దాటుతోందని తెలిపారు. ఏమాత్రం అవకాశాలు ఉన్నా యువత తమ ప్రతిభా పాటవాలతో దేశాన్ని 200ఏళ్లు ముందుకు తీసుకెళ్లే సత్తా చాటుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో బీజేపీ ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అన్నారు. జాప్యం చేయకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, ఇందుకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్ లేని తెలంగాణ అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పంథాను చాటేలా ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నరేంద్రమోడీ సభను జయప్రదం చేయాలని కోరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి తులా ఆంజనేయులు, బీజేపీ జిల్లా ఇన్చార్జి వి.మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోనె శ్యాంసుందర్‌రావు, ఆరుముళ్ల పోశం, జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ న్న, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పురుషోత్తం, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ వెరబెల్లి రవీందర్రావు, నాయకులు మున్నారాజ్ సిసోడియా, పెందూర్ ప్రభాకర్, పూసాల వెంకన్న పాల్గొన్నారు. -
కిలో ఉల్లి రూ.34
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాలోని 13 రైతు బజారులతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలు కిలో రూ.34కు వినియోగదారులకు విక్రయించేందుకు ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఉల్లిపాయల హోల్‌సేల్ విక్రయదారులు, రైతు బజారుల ఎస్టేట్ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహిం చారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు అసాధారణంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు రైతుబజార్లు ద్వారా తక్కువ ధరలకు ఉల్లిపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి నిర్దేశించిన ధరకు ప్రత్యేకౌంటర్లలో ఉల్లిపాయలను అందిస్తామన్నారు. ఉల్లిపాయల సరఫరా, ధరల నియంత్రణను అదుపు చేసేందుకు హోల్‌సేల్ విక్రయదారులు కిలో రూ.33లకు సరఫరా చేయాలన్నారు. వాటిని ప్రత్యేక కౌం టర్లలో రూ.34కి ప్రజలకు విక్రయించాలని రైతుబజారుల ఎస్టేట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీ నగర్ రైతు బజారుల్లో , అమలాపురం రైతు బజారులోను, రాజమండ్రిలోని ఏడు రైతు బజార్లలో, రామచంద్రపురం, రావులపాలెం, కొత్తపేట రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పా టు చేశామన్నారు. కాకినాడలోని మసీద్ సెంటర్, రమణయ్యపేట, రామారావుపేట, నాగమల్లితోట జంక్షన్లలోని సూపర్ బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల న్నారు. పౌరసరఫరాల శాఖాధికారులు, తహశీల్దార్లు, ఆర్డీలు నిరంతరం పర్యవేక్షించాలని జేసీ ఆదేశించారు. -
14కు తెలుగు అకాడమీ కేసు వాయిదా
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుపతి తెలుగు అకాడమీ శాఖలో 2008లో జరి గిన నిధుల దుర్వినియోగం కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. కేసులో నిందితుడిగా ఉన్న తెలుగు అకాడమీ శాఖ ఉద్యోగి రాఘవరెడ్డి బుధవారం కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. వేద పాఠశాల కేసు 19కు వాయిదా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో ఓ విద్యార్థిపై జరి గిన లైంగిక వేధింపుల కేసు విచారణను తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి కమలాకర్‌రెడ్డి ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కేసులో సాక్షిగా ఉన్న రుయా ఆస్పత్రి డాక్టర్ వెంకటేశ్వర్లను నిందితుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. న్యాయవాదులు బుధవారం హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణకు ఇరుపక్షాల వారు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
ఊపిరాడక కార్మికుడి మృతి
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : ఏరియాలోని ఆర్కే-7 గనిలో కోల్‌ఫిల్లర్ కార్మికుడు ఆడెపు రాజన్న(54) ఊపిరాడక మృతి చెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకా రం.. ఎప్పటిలాగానే రాజన్న మంగళవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. 2ఏ సీమ్, 34 లెవల్ వద్ద విధులు నిర్వహించాడు. బుధవారం ఉద యం 6.00 గంటల సమయానికి రెండు టబ్బ ల వరకు నింపాడు. రెండో టబ్బులో కొంత ఖాళీ ఉంది. ఇంతలో అస్వస్థతగా అనిపించడం తో కుళాయి వద్దకు వెళ్లి నీళ్లు తాగివచ్చాడు. మళ్లీ తట్టా ఎత్తడం మొదలు పెట్టగానే ఒక్క సారిగా కాళ్లు, చేతులు లాగుతున్నాయంటూ కుప్పకూలాడు. ఒళ్లంతా చెమటలు పట్టడంతో తోటి కార్మికులు అతడిని గాలి ఉన్న ప్రదేశానికి తీసువచ్చి సపర్యలు చేస్తుండగానే మృతి చెం దాడు. మైనింగ్ సర్దార్ నాగేశ్వర్రావు, ఓవర్‌మన్ రాయమల్లు, కార్మికులు కలిసి మృతదేహా న్ని ఉపరితలానికి తీసుకువచ్చారు. తర్వాత రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లా రు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమార్తె లు, ఒక కొడుకు ఉన్నారు. గాలి అందకే మృతి : కార్మికులు గాలి సరిగా అందకనేరాజన్న మృతి చెందాడ ని కార్మికులు ఆరోపించారు. పని స్థలంలో గాలి సరిగా లేదని, ఎక్కువగా ఉక్కపోస్తుంద ని, ఒక్కోసారి ఊపిరి ఆడడంలేదని తెలిపారు. మూడు నెలలుగా సమస్యను అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వివిధ కార్మిక సంఘాల నేతలు గని వద్దకు చేరుకుని గని మేనేజర్ రామారావు, సేఫ్టీ అధికారి లక్ష్మణ్, ఏరియా ఎస్‌ఓటూ జీఎం మల్లికార్జున్రా వు, ఏజీఎం(పర్సనల్) మహమ్మద్ అబ్బాస్, గని ఏజెంట్ హబీబ్హుస్సేన్లను నిలదీశా రు. కనీసం మృతుడి భార్యా పిల్లలు గని వద్ద కు రాకుండానే శవాన్ని ఆస్పత్రికి ఎలా పంపిం చారని మండిపడ్డారు. అధికారులు ఏమని రిపోర్టు రాసారో చూడకుండానే గుర్తింపు సం ఘం నాయకులు, అధికారులు కలిసి హాడావుడిగా పోస్టుమార్టంకు తరలించారని ఆరోపిం చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ తదితర యూని యన్ల నాయకులు మృతుడి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. సంస్థ నిర్లక్ష్యమే కారణం : ఏఐటీయూసీ యాజమాన్యం నిర్లక్షం కారణంగానే రాజన్న మృతి చెందాడని, గని మేనేజర్, రక్షణ అధికారులపై చర్య తీసుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కె.వీరభద్రయ్య, ఉపాధ్యక్షు డు మంద మల్లారెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, జడల పోశం డిమాండ్ చేశారు. గతంలో ఇదే గనిలో గడ్డం రాజయ్య అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందినప్పుడు గనిలో వెంటిలేషన్ బాగుందని కితాబిచ్చిన అధికారులు నేడు జరి గిన ఘటనకు సమాధానం చెప్పాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. చర్య తీసుకోవాలి : వైఎస్సార్ టీయూసీ రాజన్న మృతికి కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్తినేని రవికుమార్, చీఫ్ ఆర్గనైజిం గ్ సెక్రెటరీ చల్లగుల్ల విజయశ్రీ డిమాండ్ చేశా రు. చాలా గనుల్లో వెంటిలేషన్ సమస్య ఉంద ని, యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై చూపడం లేదన్నారు. ఇటివల కాలంలో గనుల్లో ఇలాం టి మరణాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని గుండెపోటులుగా చిత్రీకరిస్తూ అధికారు లు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఐఎఫ్టీయూ గనిలో వెంటిలేషన్ సరిగా అందించనందుకు బాధ్యులైన అధికారులందరిపైనా చర్య తీసుకోవాలని ఐఎఫ్టీయూ శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు కె.దేవయ్య డిమాండ్ చేశారు. కార్మికుడు చనిపోతే గని వద్దకు అతని భార్య, పిల్లలు రాకముందే శవాన్ని ఆస్పత్రికి తరలిం చారని ఇది అధికారుల అమానవీయ చర్యకు నిదర్శనమన్నారు. -
సమైక్యమే అజెండా
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మరింత ఊపందుకొంది. ఊరూవాడా ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు, వంటావార్పు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యుత్ ఉద్యోగులు విడివిడిగా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలో పాలుపంచుకున్నారు. సాక్షి, రాజమండ్రి :‘ఓరి తె లుగు వాడా తగదింటి నడుమ గోడ’ అంటూ సమైక్యవాదులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వేళ్లూనుకుంది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలు వేర్వేరు జేఏసీలుగా, రాజకీయేతర సంఘాలు, కుల సంఘాలు విడివిడిగా తమ నిరసనలు కొనసాగించాయి. మానవహారాలు, రాస్తారోకోలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు బుధవారం సమైక్యాంధ్ర పోరులోకి దిగారు. విశాఖపట్నం కేంద్రంగా ఈపీడీసీఎల్, ట్రాన్స్‌కోలకు చెందిన 12 సంఘాలు విద్యుత్ జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసీ జిల్లా చైర్మన్ జి. నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, కోశాధికారి వి.వి.ఎస్.ఎల్.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఎస్ఈ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. నిరశన దీక్షలు ఈనెల 11 వరకూ కొనసాగుతాయని విద్యుత్ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. జేఏసీల కార్యాచరణ రాజమండ్రి కాస్మోపాలిటిన్ క్లబ్ లో బార్ కౌన్సిల్, వ్యాపార వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, అలాగే ఉభయగోదావరి జిల్లాల జర్నలిస్టులు జేఏసీగా ఏర్పడి రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశాయి. గురువారం నుంచి శాంతియుతంగా సమైక్య ఉద్యమం కొనసాగించాలని జర్నలిస్టుల జేఏసీ నిర్ణయించింది. రాజమండ్రిలో... కోటగుమ్మం సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు ఆరోరోజూ కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్కాట్‌తోట నుంచి కోటగుమ్మం వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం వరకూ ర్యాలీ నిర్వహించి పాత ఫిలింరీళ్లు దహనం చేశారు. తాడితోట సెంటర్లో సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. మున్సిపల్ ఉద్యోగులు, కలప వర్తకులు, వడ్రంగి పనివారు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్, క్యాటరింగ్ వర్కర్స్ ర్యాలీలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అభ్యాసకులు కోటగుమ్మం సెంటర్లో విన్యాసాలు నిర్వహించి సమైక్యవాదం వినిపించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇన్నీసుపేట వద్ద బీసీ హాస్టల్ విద్యార్థులు వంటా వార్పు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలంలో పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన 300 కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కడియం, ధవళేశ్వరంలో నిరసనలు కొనసాగాయి. కాకినాడలో... జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. జిల్లా సమాచార కేంద్రానికి తాళం వేశారు. మెయిన్‌రోడ్డులో భారీ ర్యాలీ చేశారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ పార్టీ నాయకుడు చలమశెట్టి సునీల్, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ ఆందోళనల్లో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సహచరులు వారించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్లో సమైక్య హోమం నిర్వహించారు. సుమారు 40 ఆటో వర్కర్ల సంఘాలు నగర బంద్ పాటించాయి. క్వారీ లారీల సంఘం లారీల ప్రదర్శన చేపట్టింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించారు. కోనసీమలో... అమలాపురం, అమలాపురం రూరల్, ఉప్పలగుప్తంలలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జేసీబీ నిర్వాహకులు, నిర్మాణ కాంట్రాక్టర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో జేసీబీలతో ర్యాలీ జరిగింది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల సంఘం అమలాపురంలో ర్యాలీ నిర్వహించారు. నల్లావారి వీధిలో యువకులు కర్రసాము నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుల వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులో ర్యాలీ జరిగింది. వ్యవసాయశాఖ ఉద్యోగులు, మార్వాడీ సంఘాలు గడియారం స్తంభం సెంటర్లో నిరనన ప్రదర్శన చేశారు. ఆటోడ్రైవర్లు, తాపీమేస్త్రులు నిరసనలు నిర్వహించారు. కొత్తపేట, అంబాజీపేటల్లో ఆందోళనలు సాగాయి. పి.గన్నవరం, అయినవిల్లిలో వైఎస్సార్ సీపీ దీక్షలు ఐదోరోజుకు చేరాయి. నిరాహార దీక్షలు సామర్లకోట, ఏలేశ్వరం, రామచంద్రపురంలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరశన దీక్షలు కొనసాగాయి. సీతానగరం కోరుకొండ, తుని, రంపచోడవరం, రాజానగరంలో అడుసుమిల్లి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. హైవేపై రాస్తారోకోలు ప్రత్తిపాడులో కాంగ్రెస్ కార్యకర్తలు, జగ్గంపేటలో వివిధ విద్యాసంస్థలకు చెందిన 5000 మంది 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ క్రికెట్ ఆడారు. తునిలో మున్సిపల్ కార్మికులు వంటా వార్పూ నిర్వహించారు. ఆకట్టుకున్న ర్యాలీ తెలుగుతల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గెద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రం రామచంద్రపురంలో అందరినీ ఆకట్టుకుంది. ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ చిత్రీకరించిన ఈ బొమ్మతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. అనపర్తి, మండపేట నియోజకవర్గాలో దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. రంపచోడవరంలో ఆటోవర్కర్స్ యూనియన్ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టింది. -
వరద ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వర్షం, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. పక్షం రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం, వరదలు పోటెత్తడం, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి ఉప్పొంగి బ్యాక్‌వాటర్ గ్రామాల్లో చేరింది. పక్షం రోజులుగా కాగజ్‌నగర్, చెన్నూర్, ఆదిలాబాద్ డివిజన్లలోని వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జైనథ్, బేల, తాంసి, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూరు, దహెగాం, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు తదితర మండలాల్లోని గ్రామాల్లో వరదలతో జంతువుల కళేబరాలు ఇళ్లలోకి చేరాయి. చెత్తాచెదారం కొట్టుకొచ్చి గ్రామాలు కంపుకొడుతున్నాయి. డ్రెయినేజీలు, రహదారులపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. మంచనీటి బావుల్లో వర్షం నీరు చేరడంతో వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పక్షం రోజుల వ్యవధిలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. వందలాది మంది జ్వరం, విషజ్వరం, డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. అనేక పల్లెలు మంచం పట్టాయి. ప్రజలు అంటూవ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో భయపడుతున్నారు. రహదారులు కోతలకు గురవడంతో వైద్య చేయించుకోవడానికి బయటికి వెళ్లలేని పరిస్థితి. వైద్యులు కూడా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కనీసం బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయడం లేదు. ఉప్పొంగుతున్న వాగులు.. ప్రాణాలు హరీ.. వర్షాలు, వరదలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నుంచి వరద పారడంతో బాహ్యగ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, కాజ్‌వేలు, బ్రిడ్జిలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటూ వెళ్లాలన్నా కాలినడక వెళ్లాల్సిందే. ఆసిఫాబాద్, చెన్నూర్, కాగజ్‌నగర్ డివిజన్లలోని కెరమెరి, బెజ్జూర్ మండలాల్లో రోగులను మంచంపై తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో పడవలు ఆశ్రయించారు. బెజ్జూరు మండలం నందిగామ్‌కు చెందిన దుర్గం కార్తిక్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా భారీ వర్షాలతో గ్రామం దాటే పరిస్థితి లేదు. దీంతో మోకాళ్లలోతు నీళ్లలో బెజ్జూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో ప్రాణాలు వదిలాడు. ఇదే మండలంలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కిలోమీటర్ వరకు వాగు దాటించి ఆస్పత్రికి చేర్పించారు. ఇదే విధంగా వేమనపల్లి మండలం జాజులపేట గ్రామంలో అంజలి అనే చిన్నారి మృత్యువాత పడింది. మందుల కొరత జిల్లా ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. వాంతులు, విరోచనాలకు వచ్చే ఫ్యూరోజొలిడాన్, డోమ్‌పెరిడాన్ ద్రావణాలు కూడా అందుబాటులో లేవు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి. రోగులు బయట మందుల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాంతులు, విరోచనాలు అయ్యేటప్పుడు ఉపశమనం కోసం ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు, ప్యూరోజొలిడాన్ సిరప్ కొరత ఉంది. పిల్లలకు జ్వరం కోసం పారాసిటమాల్ సిరప్ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. దగ్గు కోసం ఇచ్చే వ్యాధి నిరోధక మందులు అమాక్సిలిన్ పలు ఆస్పత్రుల్లో లేవు. దగ్గు కోసం ఇచ్చే సీపీఎం సిరప్, దమ్ము కోసం ఇచ్చే సాల్బుటమాల్ సిరప్, దమ్ము, దగ్గు కోసం ఇచ్చే డేరిఫిలిన్ ఇంజక్షన్ కూడా లేకపోవడంతో రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లోనే రోగులు ఒకే బెడ్డుపై ఇద్దరు పడుకుని చికిత్స పొందుతున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటున్నారు. జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున జ్వరపీడితులు రావడంతో పడకలు ఖాళీలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు రిమ్స్‌లో ప్రతి వార్డులోను కనిపిస్తున్నాయి. దీంతో సరైన చికిత్స అందకుండానే తిరుగుముఖం పట్టిమృత్యువాత పడుతున్నారు. బజార్హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామానికి చెందిన ఇస్రు డయేరియా బారిన పడగా రిమ్స్‌కు చికిత్స కోసం తరలించగా సరైన చికిత్స అందించకుండానే ఆయనను డిశ్చార్జి చేయడంతో గ్రామానికి తీసుకెళ్లారు. మరుసటి రోజే మృతి చెందాడు. వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించకుండానే పలు చోట్ల మెడికల్ క్యాంపులను ఎత్తివేస్తుండడంతో వ్యాధిగ్రస్థులు సతమతమవుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం వర్షాలు, వరదలతో చెత్తాచెదారం, కొత్తనీరు వచ్చి చేరింది. డ్రెయినేజీలు, రహదారులపై నీరు నిల్వ ఉంటుంది. దోమలు, ఈగలు వ్యాపిస్తున్నాయి. వీటిని నివారించడానికి బ్లీచింగ్, క్లోరినేషన్ చే యాలి. సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య కార్యక్రమాలు స జావుగా జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గత నెల రూ.10 వేల చొప్పున ఒక్కో గ్రామ పంచాయతీకి ఎన్ఆర్హెచ్ఎం నిధులను మలేరియా విభాగం నుంచి విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. కలుషిత నీరు తాగిన ప్రజలు అస్వస్తకు గురవుతున్నారు. దో మ లార్వాలు వృద్ధి చెందకుండా బెటైక్స్ స్ప్రే చేయాల్సి ఉన్నప్పటికి గ్రామాల్లో నిధుల కొరత కారణంగా అది జరగడం లేదు. కొత్త సర్పంచ్‌లు కొలువుదీరినప్పటికి ఇంక చెక్‌పవర్ మంజూరు కాకపోవడంతో నిధుల విడుదలలోను జాప్యం జరుగుతుంది. ఎంపీడీఓలు, స్పెషల్ అధికారులు, ఈవోఆర్డీలు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్ఠిసారించకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. వైద్యుల కొరత జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మూడు ఏరియా ఆస్పత్రులు నిర్మల్, భైంసా, మంచిర్యాల, ఆరు కమ్యునిటీ హెల్త్ సెంటర్లు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్-టి, బెల్లంపెల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ ఎంసీహెచ్ ఉండగా ఏరియా, కమ్యునిటీ హెల్త్సెంటర్లలో సగానికిపైగా కాంట్రాక్టు డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో రెగ్యులర్ వైద్యులు లేరు. సిర్పూర్లో ఒక్కరు మాత్రమే రెగ్యులర్ వైద్యుడు ఉన్నారు. జిల్లాలో ఎజెన్సీ ప్రాంతంలోని 33 పీహెచ్‌సీలను కలుపుకొని మొత్తంగా 72 పీహెచ్‌సీలు ఉండగా 174 వైద్యుల పోస్టులకు గాను 142 మంది పనిచేస్తున్నారు. దీంట్లో 89 మంది రెగ్యులర్ కాగా 53 మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. ఒక్కో వైద్యునికి మూడు, నాలుగు పీహెచ్‌సీల ఇన్‌చార్జీలుగా నియమించడంతో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉట్నూర్ అడిషనల్ డీఎంహెచ్‌వోనే ఆరు పీహెచ్‌సీల బాధ్యతలను నిర్వర్తిస్తూ అదనంగా అడిషనల్ డీఎంహెచ్‌వో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. అయినా అధకారులు వైద్య శిబిరాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వామి తెలిపారు. -
సమైక్య సెగ ఢిల్లీని తాకాలి
కురబలకోట, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, సమైక్యంగా ఉండడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన కురబలకోట మండలం అంగళ్లుకు వచ్చారు. అక్కడి సమైక్య ఉద్యమ సారథి గోల్డన్‌వ్యాలీ రమణారెడ్డి, జేఏసీ కన్వీనర్ వై.సతీష్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. అంగళ్లులో జరిగిన బహిరంగ సభలో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీని తాకాలని పిలుపునిచ్చారు. కొడుకు కోసం సోనియా రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. మన రాష్ట్రం వారు కాకుండా బయటి రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అధి నాయకులు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తరాలుగా కలసి ఉన్న తెలుగువారి విభజన దేశానికే ముప్పన్నారు. సమైక్యవాదాన్ని వినిపించడానికే తాను బస్సు యాత్ర ప్రారంభించానని వెల్లడించారు. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో తిరగనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన లేదని కేంద్రం హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు విశాలాంధ్ర సభ నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదవీ కాంక్షతో రగులుతున్న కేసీఆర్, అతని పరివారం మాత్రమే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులను నిలదీయడం ద్వారా సమైక్యాంధ్ర సాధన సులభమవుతుందన్నారు. -
‘చితి’కిపోతున్నారు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : డిగ్రీ చదువుకున్న వెంగల చక్రధర్‌కు ఉద్యోగం కరువైంది. కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశపడితే వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఆ చేతులకు పనిలేకుండా చేసింది. అప్పుల బాధతో పచ్చని సంసారంలో చిచ్చు రేగగా, మానసిక సమస్యలూ చుట్టుముట్టడంతో ఆవేదనకు లోనైన చక్రధర్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చక్రధర్ ఇంట్లో అందరూ శ్రమించేవారే. తల్లి లక్ష్మీదేవి బీడీ కార్మికురాలు. తండ్రి భూపతి మరమగ్గాల కార్మికుడు. చెల్లెలు వీణ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో అందరూ పనిచేస్తున్నా ఇల్లు గడ వడం కష్టంగానే ఉంది. పద్మనగర్‌లో చిన్న పెంకుటిం ట్లో ఉంటున్న చక్రధర్ వారం రోజులుగా పని సరిగా లేక.. సాంచాలు నడవక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఏడాదిన్నర కిందట శాంతినగర్‌కు చెందిన కవితతో అతడికి పెళ్లయింది. పెళ్లికి రూ.లక్షన్నర వరకు అప్పులయ్యాయి. ఆ అప్పుల బాధలు.. చెల్లెలు పెళ్లికి ఎదగడం... వచ్చే ఆదాయం పొట్టపోసుకోవడానికే సరిపోతుండడంతో మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే సెల్ఫోన్లో పాటలు వింటూ పరదా చాటున కూర్చున్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారుండగా ఉరేసుకున్నాడు. చేనేత దినోత్సవం వేళ.. ప్రపంచ చేనేత దినోత్సవం సంబరాలను సిరిసిల్లలో నేతన్నలు బుధవారం నిర్వహించగా.. ఆ సంబరాల మాటునే విషాదం చోటుచేసుకుంది. చక్రధర్ ఆత్మహత్య సంఘటన కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమకు దిగుమతయ్యే యారన్ (నూలు) రేట్లు భారీగా పెరగడం, ఉత్పత్తవుతున్న పాలిస్టర్ గుడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆదాయం రాకపోవడంతో సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు రెండు వారాలుగా పూర్తిస్థాయిలో వస్త్రోత్పత్తి చేయడం లేదు. దీంతో సిరిసిల్లలో పద్నాలుగు వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభమే ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. భరోసా ఇవ్వని సర్కారు రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల మరమగ్గాలు జిల్లాలో ఉండగా... ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి పాతికవేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురై ఇబ్బందులు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన సర్కారు నివేదికల పేరిట కాలయాపన చేస్తోంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు 35 కిలోల బియ్యం, ఇంటింటికీ పావలా వడ్డీ రుణాలను సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా అందించారు. జాబ్‌మేళాలు నిర్వహించి నేత కుటుంబాల యువకులకు ఉద్యోగాలిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించి ఆదుకున్నారు. ప్రస్తుత పాలకులు నేతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బుధవారం సాయంత్రం చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డీవో సమక్షంలో సమావేశమయ్యారు. పరిశ్రమను నడపాలని వస్త్రోత్పత్తిదారులను కోరారు. పెరిగిన నూలు రేట్లతో పరిశ్రమను నడపలేమని యజమానులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం నేతన్నలను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం. ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు? ఒక్కగానొక్క కొడుకు కళ్లెదుటే ఉరేసుకుని తనువు చాలిస్తే ఆ కన్నతల్లి గుండె చెరువైంది. గుండెలు బాదుకుంటూ ‘కొడుకా ఎంత పని చేసినావంటూ..’ లక్ష్మీదేవి చేస్తున్న రోదనలు అందరినీ కదిలించాయి. ‘అన్నయ్యా... ఎందుకీ పని చేశావని’ చెల్లెలు వేదనకు అంతేలేదు. ‘అయ్యో కొడుకా.. నేను సాంచాల్ పనికి పొయ్యేసరికి పాణం తీసుకుంటివి..’ అంటూ కన్న తండ్రి భూపతి కుమిలిపోతున్నాడు. అందరికి ఆ‘ధారమై’న చక్రధర్ ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడడంతో ఆ కన్నీళ్లకు బాధ్యలెవరు?. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలను రక్షించేదెవరు ?
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ప్రజల రక్షణ కోసం ఏర్పడిన పోలీసు వ్యవస్థ అర్థం మారుతోంది. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జాతీయ నేతల వ్రిగహాలకు, పార్టీ కార్యాలయాలకు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల రక్షణ గాలికొదిలేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో నెల్లూరులోని రెండిళ్లల్లో పట్టపగలే దొంగలు పడి దొరికినకాడికి దోచుకెళ్లారు. గొలుసుదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడల్లోని గొలుసులను లాక్కెళ్లారు. పోలీసు రికార్డులకెక్కని సంఘటనలు కోకొల్లలు. వరుస ఘటనలు నగర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన పోలీసులు సమైక్య ఆందోళనలు, రాస్తారోకోల పర్యవేక్షణ, విగ్రహాలకు భద్రత తదితర కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఫలితంగా దొంగలు తమ హస్తలాఘాన్ని ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది పోలీసులకు వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో పోలీసుస్టేషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. మొక్కుబడిగా నలుగురైదుగురు మాత్రమే స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించే వారిని పట్టించుకొనేవారు కరువయ్యారు. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టసాధ్యం. ఉద్యమాల పేరుతో నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కావడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దీనికి తోడు నగరంలోని ప్రధాన రహదారి నిర్మాణంలో ఉండటం తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తమ రక్షణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పల్లె కదిలింది
సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమానికి ప్రతి పల్లె తాను సైతం అంటూ కదిలి వస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా ప్రజానీకం ఆందోళనలు ఉధృతం చేస్తోంది. తొలుత విద్యార్థులు, ఉద్యోగులతో ప్రారంభమైన సమైక్యాంధ్ర ఆందోళన ఇప్పుడు పల్లెలకు వ్యాపించింది. ప్రతిరోజూ గ్రామీణులు రోడ్లపైకి వస్తూ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. రోడ్లపై ఎద్దుల బండ్లు, రాళ్లు, కట్టెలు అడ్డం పెట్టి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం రాష్ట్ర విభజనపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేస్తామని ప్రజలు శపథం చేస్తున్నారు. 50 ఏళ్లకు పైగా శ్రమించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటే, ఇవాళ ఆ నగరం మీది కాదంటూ కాంగ్రెస్ అధిష్టానం విభజనకు పాల్పడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ముఖ్యంగా సీమాంధ్ర కు అందులోనూ నెల్లూరు జిల్లా ఉద్యోగులు, విద్యార్థులకు నష్టం జరగడమే కాక అంతకు మించి సాగు,తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయన్న మాట యధార్థం. ఈ దిశగా మేధావులు,నేతల వాదనలను ఇక్కడి ప్రజలు ఆలకిస్తున్నారు. భవిష్యత్తులో సీమాంధ్రకు జరగనున్న అన్యాయం కళ్లముందు కనిపిస్తుండడంతో ఇక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు ఆగ్రహావేశాలతో ఆందోళనలలో పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడితే కృష్ణా జలాల సమస్య తలెత్తుతుందని, తెలంగాణ నేతలు ఎట్టి పరిస్థితిలోనూ దిగువకు నీళ్లు వదలరని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అప్పుడు గొడవ పడినా ప్రయోజనం ఉండదన్నది ప్రజల వాదన. ఇప్పుడు ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ,కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలను చూసేందుకు కూడా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలనే ఆయా రాష్ట్రాలు రానివ్వని విషయాన్ని సామాన్య జనం ఉదహరిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే చుక్కనీరు దిగువకు రానివ్వరని, దీంతో కేవలం వరదలు వస్తే తప్ప సోమశిలకు సరైన సమయంలో నీరు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఏడాదికేడాదికి వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ వర్షపాతం కూడా సరిగ్గా నమోదవుతున్న పరిస్థితులు లేవు. ఈ క్రమంలో వరదలు వస్తే తప్ప దిగువకు నీళ్లు రావన్న భయం ప్రజల్లో ఉంది. పర్యవసానంగా సోమశిల ఆధారంగా ఉన్న 8 లక్షలకు పైగా ఆయకట్టు బీళ్లగా మారే పరిస్థితి లేకపోలేదని డెల్టా రైతాంగం మరింత ఆందోళనతో ఉంది. ఇదే జరిగితే జిల్లాలోనే కాక ఇతర ప్రాంతాలకు సైతం తిండి గింజలు అందిస్తున్న నెల్లూరు జిల్లాలోనూ కరువు కాటకాలు తప్పవన్నది విశ్లేషకుల మాట. ఇక జిల్లాకు చెందిన వేలాది మంది విద్యావంతులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో వీరందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. ఇప్పటికే అక్కడి ఉద్యోగుల పరిస్థితి దినదినగండమైంది. రాష్ట్రం విడిపోతే భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. మొత్తంగా రాష్ట్ర విభజన అన్నివర్గాల వారి బతుకులను అతలాకుతలం చేయనుంది. అందరి భయం ఇదే. దీంతో ఇక్కడి ప్రజలు గ్రామస్థాయిలో వీధుల్లోకి వచ్చి ఆందోళన బాటపట్టారు. జిల్లాలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఉద్యమకారులకు అండగా నిలిచింది. దీంతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది. టీడీపీ ఆలస్యంగా ఉద్యమానికి మద్దతు పలికింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకొని తొలుత ముఖం చాటేసిన ఇక్కడి కాంగ్రెస్ నేతలు మరింత ప్రజాగ్రహం చవిచూడక ముందే ఉద్యమంలోకి ఆలస్యంగా ప్రవేశించారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉద్యమాన్ని నిర్వహిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఉద్యమ కారులు,రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనను అడ్డకోకపోతే భావితరాలు క్షమించవని, సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ఉద్యమంలోకి రావాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. -
కదం తొక్కారు
నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమజ్వాల రోజురోజుకూ జిల్లాలో ఎగిసి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం బుధవారం ఉవ్వెత్తున ఎగిసింది. పల్లె మొదలుకుని పట్టణం వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు స్వగృహాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులా ట చోటుచేసుకుంది. సమైక్యాంధ్రపై ఎలాంటి ప్రకటన చేయని మంత్రి రామనారాయణరెడ్డిని ప్రజలు నిలదీ స్తారనే ముందు జాగ్రత్తతో పోలీసులు చూపిన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ నుంచి భారీ ప్రదర్శనగా వెళ్లి మినీబైపాస్‌రోడ్డులో వంటావార్పు నిర్వహించారు. బుజబుజనెల్లూరులో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళి, వైఎస్సార్సీసీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ బారులుతీరాయి. సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్‌పై రాస్తారోకో నిర్వహించారు. వీఎస్‌యూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ భారీగా సాగిం ది. ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను విధులను బహిష్కరించేలా చేసి నిరసనలు వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సం యుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. కావలి లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జెండా సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. దీంతో పాటు న్యాయవాదులు, ట్రక్కు ఆటో డ్రైవర్ల యూనియన్లు, ఎన్జీఓలు ప్రత్యేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్తుకూరులో విద్యార్థి, యువజన సంఘాలు బస్టాండ్ కూడలిలో మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే పొదలకూరులో ట్రక్కు ఆటోల ప్రదర్శన, మనుబోలు, వెంకటాచలంలలో విద్యార్థులు రాస్తారోకోలు నిర్వహించారు. వెంకటగిరిలో జర్నలిస్టుల సంఘం, సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో కాశీపేట సెంటర్లో సోనియా బొమ్మకు నిప్పంటించారు. సైదాపురంలోని సీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు సోనియా చిత్రపటానికి శవయాత్ర చేసి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. వింజమూరులోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఉదయగిరిలో జర్నలిస్టులు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రిలే నిరాహార దీక్షకు దిగారు. వరికుంటపాడు, సీతారాంపురం మండలాల్లో విద్యార్థులు వైఎస్సార్సీపీ నేతలు వంటా వార్పుల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. కోవూరులో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరులలో సమైక్యాంధ్ర, జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీల ద్వారా నిరసనలు కొనసాగించారు. సూళ్లూరుపేటలో ఆర్టీసీ జేఏసీ, వ్యవసాయ శాఖాధికారులు, పెన్షనర్ల అసోసియేషన్, వైఎంఆర్సీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో ఎమ్మెల్యే పరసారత్నం సమైక్యాంధ్ర కోరుతూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రంలలో కూ డా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గూడూరులో మత్స్యకార మహిళలు కేసీఆర్ బొమ్మకు శవయాత్ర నిర్వహించి క్లాక్ టవర్ వద్ద దహనం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్ కుమా ర్, బాలచెన్నయ్య కూర్చొని తమ మద్ద తు ప్రకటించారు. ట్రాన్స్‌కో సిబ్బంది డీఈ కార్యాలయం ఎదుట ఆందోళనలతో నిరసన వ్యక్తంచేశారు. చిట్టమూ రు, కోట మండలాల్లో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
ఊపిరి తీసిన వర్షాలు
ఉట్నూర్ రూరల్/తానూర్/దండేపల్లి, న్యూస్‌లైన్ : వర్షాలు రైతుల ఊపిరి తీస్తున్నాయి. పక్షం రోజులుగా కురిసిన వర్షం నీరు చేలలో చేరడంతో మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో దిగుబడి రాదని, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి ఎలా తీర్చాలనే బెంగతో ముగ్గురు రైతులు మనస్తాపం చెంది బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48), తానూర్ మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్(25), దండేపల్లి మండలం తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)లు ఆత్మహత్య చేసుకున్నారు. చేలో నీరు చేరి.. ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48)కు మూడెకరాల భూమి ఉంది. ఇందులో పత్తి సాగు చేశాడు. మొదటి కురిసిన వర్షాలకు మొక్కలు కుళ్లిపోయాయి. మళ్లీ సోయా సాగు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయి. రెండుసార్లు పెట్టుబడి నష్టం వాటిల్లడంతో మనస్తాపం చెందాడు. బుధవారం వేకువజామున ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. కిషన్‌కు భార్య గంగాబాయి ఉంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువరైతు.. తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్‌కు ఆరు నెలల క్రితం వివాహమైంది. తనకున్న రెండెకరాలతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం ప్రైవేటుగా రూ.లక్ష అప్పు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షానికి చేలలో నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దిగుబడి వచ్చే అవకాశం లేక అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేశ్‌కు తల్లి సక్కుబాయి, తండ్రి ఉత్తం, భార్య లక్ష్మి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మసూద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా ఏరియా ఆస్పత్రిలో రాజేశ్ మృతదేహన్ని పరిశీలించారు. ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కౌలు రైతు.. దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)కు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. గతేడాది పెద్దకూతురుకు పెళ్లి చేశాడు. దీంతో కొంత అప్పుల పాలయ్యాడు. మరో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఉన్నారు. ఈ యేడు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇందుకు రూ.లక్ష అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి చేనులో నీళ్లు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో పంట దిగుబడి రావడం అనుమానమే అని భావించాడు. ప్రస్తుతం, గతంలో చేసిన అప్పులు రూ.2లక్షలు కావడంతో మనస్తాపం చెందాడు. బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వివరించారు. -
8 రోజులుగా రాకపోకల్లేవు
సాక్షి, తిరుపతి : ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎనిమిది రోజులుగా నిర్మానుష్యంగా మారింది. చూసినంత దూరం ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క తిరుపతి ఆర్టీసీ బస్టాండే కాదు. చిత్తూరు రీజియన్‌లోని 14 ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలోని 18 బస్టాండ్లలోనూ ఇదే వరస. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహకరించి విధులకు గైర్హాజరు అవుతుండటంతో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీనికి తోడు జిల్లాలో రహదారుల దగ్బంధం కొనసాగుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందం గా రోడ్లపైకి వచ్చి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సులను డిపోలకే పరిమితం చేసింది. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, పుంగనూరు, పల మనేరు వంటి పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి ప్రజలు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటక బస్సు సర్వీసులను కూడా ఆయా రాష్ట్ర సంస్థలు నిలిపేశాయి. రీజియన్‌కు రూ.11 కోట్ల నష్టం ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌కు ఇప్పటి వరకు రోజుకు రూ.1.25 లక్షల చొప్పున ఎనిమిది రోజులకు రూ.11 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14 డిపోల్లో 1450 దూర ప్రాంత బస్సులు రోడ్డెక్కకపోవటంతో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపు ఇవ్వటంతో 450 బ స్సుల వరకు తిరుగుతున్నాయి. జిల్లాలో మారుమూ ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒకటి అర గ్రామీణ స ర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసు లు, హైటెక్, వోల్వో సర్వీసులు కదలడం లేదు. ఇప్ప టి వరకు అలిపిరి డిపో పరిధిలో ఒక బస్సు స్వల్పం గా దగ్ధం కాగా, సత్యవేడు డిపో పరిధిలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు రైళ్లలో వెళ్తున్నారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాల నిలువుదోపిడీ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనే రు, మదనపల్లి, పుంగనూరుకు సమీప గ్రామాల నుంచి రోజువారి ఉపాధి కోసం వచ్చేవారు, చిరు వ్యాపారాలు సెవెన్సీటర్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో సిటీ బస్సులు తిరగకపోవటంతో కొద్ది దూరానికి కూడా కనీసం రూ.50 ఇవ్వనిదే ఆటోవారు రావటం లేదు. దీంతో సామాన్యులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సెవెన్ సీటర్లే దిక్కుగా మారాయి. హైవేల పై సెవెన్సీటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్లచేస్తున్నాయి -
మళ్లీ మైక్రో ఫైనాన్స్ వేధింపులు
కందుకూరు, న్యూస్‌లైన్: ‘షేర్ మిలా...’ఈ పేరు వినపడిందంటే గ్రామాల్లోని ప్రజలకు ఒకప్పుడు వణుకుపుట్టేది. మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లోకి వస్తున్నారంటేనే రుణం తీసుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు అదిరిపోయే వారు. అవసరాలకు వారి వద్ద రుణం తీసుకుంటే వారం వారం కచ్చితంగా కట్టాల్సిందే. వారి వద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొనేవి. ఇది 2008 - 10 సంవత్సరాల్లోని మాట. మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల ఆగడాలకు గ్రామాల్లో రుణాలు తీసుకుని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారూ ఉన్నారు. ప్రజల అవస్థలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో ఆయా సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. దీంతో సంస్థల ప్రతినిధులు తట్టాబుట్టా సర్దుకొని వెనక్కి తగ్గారు. అయితే అప్పటి వేధింపులు ఇప్పుడు మళ్లీ వెంటాడడం ప్రారంభించాయి. షేర్ మైక్రో ఫైనాన్స్ సంస్థ 2009 సంవత్సరంలో ఒక్క కందుకూరు ప్రాంతంలోనే సుమారు 2,300 మందికిపైగా అప్పులిచ్చింది. అప్పట్లో ప్రభుత్వ చర్యలకు భయపడి వసూళ్లకు వెనకాడిన సంస్థ ప్రతినిధులు తాజాగా వారం పది రోజుల నుంచి రుణాలు తిరిగి చెల్లించాలంటూ బకాయిదారులకు నోటీసులు పంపించడం ప్రారంభించారు. కొంత మంది తిరిగి కట్టినా..మళ్లీ తీసుకున్న రుణం మొత్తం కట్టాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఇప్పటికే డబ్బు కట్టేసిన వారు ఆందోళనలో ఉన్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులతో పాటు అదనంగా కొంత చెల్లించాలంటూ షేర్ మైక్రో ఫైనాన్స్‌కు చెందిన ప్రతినిధులు బాధితుల వద్దకు రావడం ప్రారంభించారు. దాదాపు 90 శాతం వరకు రుణం తిరిగి చెల్లించిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించినా..లేదు మొత్తం కట్టాల్సిందేనని మొండికేయడంతో కందుకూరుకు చెందిన శ్రీనివాసరావు, నాగూర్ అనే బాధితులు మంగళవారం కందుకూరు పోలీసులను ఆశ్రయించారు. రూ.3 వడ్డీ అని ముందు చెప్పి రూ. 12 వరకు వసూలు రుణం ఇచ్చేటప్పుడు నెలకు నూటికి మూడు రూపాయలు మాత్రమే వడ్డీ పడుతుందని సంస్థ ప్రతినిధులు నమ్మబలుకుతారు. కానీ నెలవారీ కిస్తీలకు వచ్చే సరికి బాధితులు కట్టే అదనపు మొత్తం ఒక సారి లెక్కేసి చూసుకుంటే రూ.100లకు సరాసరిన రూ. 12ల వరకు వడ్డీ పడుతుంది. సాధారణంగా సరాసరిన వేసే వడ్డీకి వారం వారం లేక నెల నెలా కట్టే కిస్తీ మొత్తాన్ని తీసివేసి ఆ తర్వాత ఉన్న మొత్తానికి వడ్డీ వేయాలి. అయితే అసలుకు ముందే వడ్డీ నిర్ణయించి కిస్తీలు వేయడం వల్ల బాధితునిపై అదనపు భారం పడుతోంది. చివరి మూడు నెలలు కట్టాలి 2009 డిసెంబర్లో రూ. 30 వేలు రుణం తీసుకున్నా. మొత్తం 12 నెలల్లో వడ్డీతో కలిపి మొత్తం చెల్లిస్తానని సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నా. చివరి మూడు నెలలు మాత్రమే కుస్తీలు చెల్లించాల్సి ఉంది. అందుకు తగిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. కానీ మొత్తం చెల్లించాలని సంస్థ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగా నోటీసులు కూడా పంపించారు. - నాగూర్, కందుకూరు తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు కందుకూరులోని రైతు బజారు వద్ద కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాను. 2010లో రూ.30 వేలు వ్యాపార అవసరాల కోసం తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు. ఇప్పుడేమో రెండింతలు మొత్తం చెల్లించాలని నోటీసులు పంపించారు. అంత మొత్తం చెల్లించడం ఇప్పట్లో నావల్ల అయ్యే పని కాదు. మూడు సంవత్సరాలకు రెట్టింపు కట్టమంటే వడ్డీ రూపంలో చాలా పడుతుంది. సాధారణ వడ్డీ అయితే కట్టేందుకు సుముఖంగానే ఉన్నాను. - నల్లూరి శ్రీనివాసరావు, కోడిగుడ్ల వ్యాపారి పరిశీలించి కేసు నమోదు చేస్తా మైక్రో ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, వాళ్ల విధి విధానాలను పరిశీలిస్తున్నాను. బాధితులు కొంత మంది మమ్మల్ని ఆశ్రయించారు. కొంత రుణం తిరిగి చెల్లించినా కట్టలేదని ప్రతినిధులు చెప్తున్నట్లు బాధితులు మా దృష్టికి తీసుకొచ్చారు. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నాం. అక్రమాలు ఉన్నాయని తేలితే కేసు నమోదు చేస్తాం. - హుస్సేన్‌బాషా, పట్టణ ఎస్సై -
రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఆగుతున్న గుండెలు
సాక్షి, ఏలూరు: రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే తెలుగువారంతా విలవిల్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే తట్టుకోలేక కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. విడిపోయి బతకలేమని, తమ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమంటూ మరికొందరు ఆత్మ బలిదానం చేస్తున్నారు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశంతో.. కన్నీళ్ల నుంచి జనించిన తెగింపుతో.. జై సమైక్యాంధ్ర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనం గొంతెత్తి నినదిస్తున్నారు. ఎన్ని రోజులైనా, మరెన్ని కష్టాలెదురైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న సమైక్య ఉద్యమ ఆందోళనలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అన్నివర్గాల ప్రజలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఒకే రోజు నలుగురు మృతి.. పెయింటర్ ఆత్మబలిదానం రాష్ట్ర విభజనను తట్టుకోలేక బుధవారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మరణించగా ఓ పెరుుంటర్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఇరగవరం మండలం కాకిలేరులో దిగుమర్తి రాజీవ్‌గాంధీ (24)అనే పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ అనే మహిళ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో తాపీ కార్మికుడు కర్రి నాగరాజు(35) గుండెపోటు గురైతో మృతిచెందారు. ‘అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే’ ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో సోనియాగాంధీని రాక్షసిగాను, కేసీఆర్‌ను మహిళగానూ చిత్రీకరించిన ఫ్లెక్సీలతో ప్రదర్శనలు చేశారు. ఆ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను దహనం చేశారు.వైఎస్సార్ సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాయి. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిన్నారులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, శివాజీ వేషధారణలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. రైతాంగ సమాఖ్య ర్యాలీ భారీ నిర్వహంచింది. తెలుగుతల్లి చిత్ర పటం వద్ద సావిత్రి భూదేవ సేవా సంఘం 108 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపింది. ఫైర్‌స్టేషన్ సెంటర్లో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు, వసంతమహల్ సెంట ర్లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ది పశ్చిమగోదావరి జిల్లా అధీకృత ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన బైక్‌లు, ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించగా, లారీలు, టాటా మ్యాజిక్, జీప్‌లు, కార్ల సంఘాలు కూడా ర్యాలీ నిర్వహించా యి. దీంతో ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. వంటా వార్పులు.. నిరసన దీక్షలు పాలకొల్లు నియోజకవర్గంలో అనేకచోట్ల వంటావార్పు నిర్వహించారు. యలమంచిలి మండలం చించినాడలో రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. తణుకులో కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు వాహనాన్ని అడ్డుకుని వైఎస్సార్సీపీ నాయకులు ఘెరావ్ చేశారు. ఆచంట, వ ల్లూరు, పెనుగొండ, మార్టేరు సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆచంటలో జేఏసీ నాయకులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో మంత్రి పితానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులతో మంత్రి తనయుడు వెంకట్ వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడిలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కొవ్వూరు సంస్కృత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. బంద్ విజయవంతం నిడదవోలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. గణేష్ చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మూడవ రోజుకు చేరుకన్నాయి. కైకరంలో జాతీయ రహదారిపై వికలాంగులు రాస్తారోకో చేశారు. భీమవరం ప్రకాశం చౌక్ నిరసనలతో హోరెత్తింది. ఉండి మండలం మహదేవపట్నం, కాళ్ల మండలం పెద అమిరంలో రహదారులను దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. సోనియా, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. ఆకివీడులో ఆందోళనకారులు రిలే నిరాహార దీక్షలతోపాటు రాష్ట్రానికి, దేశానికి పట్టిన కీడు పోవాలని వేద పండితులతో అగ్ని హోమాన్ని నిర్వహించారు. -
సమైక్య పోరు నిరసనల హోరు
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కళ్లుమూసుకున్నారా? అంటూ జనం పాలకులపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా అన్ని రకాల కుల వృత్తులు, వ్యాపార, కార్మిక, సేవా రంగాలకు చెందిన అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో రోజు సమైక్యవాదులు కదం తొక్కారు. సాక్షి, తిరుపతి : సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జిల్లాలోని రెవెన్యూ, ఎంపీడీవో, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రెవెన్యూ, పల్లె పాలనను చూసుకునే మండల పరిషత్‌లు, నగర పాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్నారు. వైద్యశాలకు తాళాలు సమైక్య ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో రుయా, స్విమ్స్, పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళనలు చేస్తు న్న ఉద్యమకారులకు సంఘీభావం తెలియజే స్తూ సమైక్యవాదులకు అండగా నిలుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కలిసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. వినోదానికి బ్రేక్ ఉద్యమంలో జనం కీలకపాత్ర పోషిస్తుండటంతో వినోదాలకు బ్రేక్ ఇచ్చారు. జిల్లాలోని సినిమా హాళ్లు మూసివేశారు. టీవీలో ఎంటర్టైన్మెంట్ చానళ్లను కూడా నిలిపేసి కేబుల్ నెట్వర్క్ యూనియన్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులు గా టీవీలో ప్రసారాలు రావటం లేదు. వ్యాపార వర్గాలన్నీ షాపులు మూసివేసి ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదవ రోజు కొనసాగిన ఆందోళనలు జిల్లాలో ఎనిమిదవరోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తాళాలువేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపించారు. చంద్రగిరిలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మకు చీర, పసుపు, కుంకు మ, గాజులు, పూలతో సారెపెట్టి మహిళలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో అంధులు సమైక్యాంధ్ర కోసం నగర ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించి బంద్ నిర్వహించారు. సత్యవేడులో సమైక్యవాదులు ఏ చిన్నవాహనా న్ని కూడా వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాలాజీ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో క్రీడాకారులు స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొడుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు తిరుపతిలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి కళాకారులతో కలసి గద చేతబట్టి ఆం దోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు విన్నూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వీయులో విద్యార్థుల ఆమరణ నిరాహరదీక్షలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ముం దు డాక్టర్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మాజీ కౌన్సిలర్లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిం చారు. కాంగ్రెస్ సెలూన్లో కటింగ్ కోసం వచ్చిన సీఎం కిరణ్, బొత్స, కావూరిలకు గుండు కొట్టి పంపించటా న్ని ఒక చిత్రకారుడు గీసి చూపించారు. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ యజమానులు టీవీలకు పలువురు విభజన పరుల చిత్రాలను అంటించి రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు. -
సమైక్యాంధ్రకు ‘పశ్చిమ’లో మిన్నంటుతున్న నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వేలాది మందితో ఉప్పు సత్యాగ్రహం.. వెల్లువెత్తిన విదేశీ వస్త్ర బహిష్కరణ.. సహాయ నిరాకరణ.. పన్నుల చెల్లింపు నిరాకరణ.. ఇవన్నీ దేశ స్వాత్రంత్య ఉద్యమం నాటి ఘట్టాలు. 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనల్ని అప్పటి తరం వాళ్లు చెబుతున్నా.. ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను చదువుతున్నా శరీరం రోమాంఛితమవుతుంది. ‘అబ్బా.. అప్పట్లో ఉద్యమాలు అలా జరిగేవా.. అప్పటి ప్రజలు అంతటి పోరాట పటిమ కలిగి ఉండేవారా.. అలాంటి ఆందోళనలు ఈ తరాల వారికి సాధ్యమేనా.. వారి నిబద్ధత ప్రస్తుత సమాజానికి సాధ్యమేనా’ అనే ప్రశ్నలెన్నో ఉద్భవిస్తాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లాలో వెల్లువెత్తుతున్న ఉద్యమాలు ఆ ప్రశ్నలను పటాపంచలు చేస్తున్నాయి. పైగా ఆ కాలంలో మహా నాయకులెందరో ముందుండి చైతన్యం రగిలించారు. స్వాతంత్య్ర ఉద్యమాల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు అలాంటి నాయకులెవరూ లేరు. కానీ.. సామాన్య జనమే ఉద్యమపథంలో ఉరకలు వేస్తున్నారు. భావోద్వేగాలు రగిలినప్పుడు ఉద్యమాలు వాటికవే పుడతాయనడానికి సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటం ఓ గొప్ప ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నది సాదాసీదా జనం కాదు. సాక్షాత్తు మేధావులు చెబుతున్న మాట ఇది. ఖాకీ కవాతుల్ని తోసిరాజని... రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు పోలీసులు చేసిన కవాతులు.. పారామిలటరీ బలగాల హడావుడి సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో చేష్టలుడిగి చూస్తున్నారుు. జిల్లా చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. తొమ్మిది రోజుల క్రితం రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటివరకూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిరంతరాయంగా మిన్నంటుతూనే ఉన్నాయి. ఎవరి ప్రోద్బలం లేకుండానే.. ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛం దంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండటం మేధావుల్ని సైతం ఆశ్చర్చ చకితుల్ని చేస్తోంది. ఇక్కడి ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా రాష్ట్రాన్ని విడగొడుతున్నారనే సరికి ఒక్కసారిగా అన్ని వర్గాలవారు తమంతట తాముగా రోడ్లపైకి వస్తుం డటం ఆశ్చర్యపరుస్తోంది. విభజన ప్రకటనకు ముందు రోడ్లపై పోలీసులు చేసిన కవాతులు, పారామిలటరీ బలగాల హడావుడి ఉద్యమం ధాటికి కనుమరుగయ్యూరుు. పోలీ సులు కూడా ఏంచేయలేక అచేతనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు ప్రతి వీధి నుంచి నిమజ్జనాల ఊరేగింపులు రోడ్లపైకి వచ్చినట్లుగా ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నా రుు. ఉద్యమకారులు ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. పల్లెలు సైతం తొలి రోజునుంచే ఉద్యమబాట పట్టారుు. వినూత్నానికే వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన.. ఒక ధర్నా.. ఒక బహిరంగ సభ.. రాస్తారోకో వంటి పద్ధతులు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో చేస్తున్నన్ని వినూత్న ఆందోళనలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు చెబుతున్నారు. దిష్టిబొమ్మల దగ్ధాలు, వంటా వార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటలు ఆడి తమ నిరసన తెలుపుతున్నారు. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. వ్యక్తి నుంచి సంఘం వరకూ.. యువకులు, విద్యార్థులు ఉద్యమానికి కొండంత అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. రైతులు, కార్మికులతోపాటు రిక్షా కార్మికులు, తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకటేమిటి చివరకు హిజ్రాలు సైతం సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వ్యాపారులు షాపులు మూసివేసి షట్టర్లకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లెక్సీలు వేలాడదీశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు ఆర్‌ఆర్‌పేట మొత్తం నిర్మానుష్యంగా మారి ప్రతి షాపు ఎదుటా ఈ ఫెక్ల్సీలే కనబడుతున్నాయి. తోపుడు బండిపై పళ్లు అమ్ముకునే వ్యక్తి సైతం సమైక్యాంధ్ర నినాదాన్ని ఒక అట్టముక్కపై రాసి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడంటే ఉద్యమం ఎంత లోతుల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కార్లు, ఆటోలు, రిక్షాలపైనా సమైక్యాంధ్ర స్టిక్కర్లే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జేఏసీలు ప్రారంభంలో ఎవరికివారే విడిగా చేసిన ఉద్యమాలు రెండు మూడు రోజుల్లోనే ఒకే గొడుకు కిందకు వచ్చాయి. పట్టణాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏలూరులో 60కిపైగా సంఘాలున్న జేఏసీ సమావేశమై వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. తాడేపల్లిగూడెం, భీమవరం జేఏసీలు తమ కార్యక్రమాలను ప్రకటించాయి. మిగిలిన పట్టణాలతోపాటు చాలా మండల కేంద్రాల్లోనూ జేఏసీలు ఉద్యమాలకు పకడ్బందీగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కూడా తమ గ్రామాల్లో ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్య్రోద్యమం ఎలా జరిగిందో తాము చూడలేదు కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అందుకు తీసిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమ కేంద్రాలుగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ ఉదయం నుంచి రాత్రి వరకూ ఆందోళనలతో హోరెత్తుతోంది. ప్రతిరోజూ ఈ సెంటర్లో 12 నుంచి 15 వరకూ ఆందోళనలు జరుగుతున్నాయి. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు ఇతర రంగాలకు చెందిన 23 సంఘాలు బుధవారం ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఆందోళనలు జరపాయంటే ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీమవరం ప్రకాశం చౌక్‌లోనూ నిత్యం 15కిపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. సమైక్య నినాదంతో ఈ సెంటర్ దద్ధరిల్లుతోంది. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో కూడా ప్రతిరోజూ పదికిపైగా ఆందోళనలు నమోదవుతున్నాయి. ఇక మిగిలిన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిరసనలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు సైతం సమైక్యాంధ్ర కోసం పోరుబాట పట్టాయి. -
చంద్రబాబు లేఖతోనే రాష్ట్ర విభజన
ఒంగోలు , న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పార్టీ జిల్లా క్యార్యాలయంలో చేపట్టిన దీక్షలు బుధవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు పార్టీ బీసీ సెల్ నాయకులు దీక్షలో కూర్చున్నారు. వీరికి బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, కందుకూరు మున్సిపల్ మాజీ చైర్మన్ బూర్సు మాలకొండయ్యలు పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేస్తారని తెలియగానే సమైక్యాంధ్ర ప్రజలకు మొట్టమొదట అండగా నిలిచిన పార్టీ వైఎస్ఆర్ సీపీయేనన్నారు. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు ఇంకా పదవుల కోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చే ముందు సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష తెలుసుకోవాలన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేకపోవడం విచారకరమన్నారు. కొందరు నేతలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని, వారికి చిత్తశుద్ధి ఉంటే సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపించాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం తుంగలో తొక్కి తెలంగాణను హడావుడిగా ప్రకటించడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ఆమె తన కుమారుడిని ప్రధాని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యవాదులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు. పోలీసుల తీరు తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉందేమోనన్న అనుమానం బాలాజీ వ్యక్తం చేశారు. పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామన్న మెప్పు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉంటే ఇప్పటికైనా రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ బతికున్నప్పుడు సీమాంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన సమర్థంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇప్పటి నేతలు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. సమైక్యవాదులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరాజు, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు జాజుల కృష్ణ, వల్లెపు మురళి, కండే రమణయ్య యాదవ్, పొగర్త చెంచయ్య, జంపని శ్రీనివాసగౌడ్, కొణతం విల్సన్‌బాబు, గంజి ప్రసాద్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారిని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ వై.వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు తోటపల్లి సోమశేఖర్, నాగిశెట్టి బ్రహ్మయ్య, సింగరాజు వెంకట్రావులు అభినందించారు. -
వెంకట్రామన్నగూడెంలో విషాదం
వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్న మూడేళ్ల చిన్నారి మరణం ఆ కన్న తల్లిదండ్రులకు కడుపుకోతకు గురిచేసింది. కళ్ల ముందే తమ కంటిపాప విగతజీవిగా మారేసరికి ఆ కుటుంబం రోదనకు అంతులేకుండా పోయింది. ఆ చిట్టి పాప బోసి నవ్వులు ఇక లేవనే నిజం తెలిసి బంధువులతో పాటు చుట్టుపక్కల వారూ ఆవేదనకు గురయ్యారు. బుధవారం వెంకట్రామన్నగూడెంలో నీళ్ల తొట్టెలో పడి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన చిన్నారి ఝాన్సీ (3) ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకట్రామన్నగూడెం గ్రామానికి చెందిన నాగబాబు, రత్నం కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఝాన్సీ (3) ఉన్నారు. వీరు గతంలో సమీప బంధువైన బొట్టా నారాయణమూర్తి ఇంటిలో అద్దెకు ఉండేవారు. ఇటీవలే నాగబాబు స్థలం కొనుక్కొని తాటాకిల్లు కట్టుకోవడంతో ఆ ఇంటికి వెళ్లిపోయారు. చిన్నారి జాన్సీ మాత్రం నారాయణమూర్తి ఇంటికి వెళ్లి అక్కడి పిల్లలతో ఆడుకుంటుంది. బుధవారం నాగబాబు కుమార్తె జాన్సీతో కలిసి నారాయణమూర్తి ఇంటికి వెళ్లాడు. నాగబాబు, నారాయణమూర్తి టీవీ చూస్తుండగా జాన్సీ పిల్లలతో ఆడుకుంటూ ఇంటి ఆవరణలోని నీటితొట్టెలో పడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి జాన్సీ కోసం నాగబాబు, నారాయణమూర్తి చుట్టుపక్కల గాలించారు. నారాయణమూర్తి కుమారుడు శ్రీనుకు అనుమానం వచ్చి నీటి కుండీ దగ్గరకు వెళ్లిచూడగా అందులో కొట్టుకుంటోంది. వెంటనే బయటకు తీసి బాలికను భుజాన్న వేసుకుని సమీపంలోని పీహెచ్సీ వద్దకు వెళ్లగా అక్కడ అటెండర్ పట్టిం సుబ్బారావు మాత్రమే ఉన్నాడు. ఈ ఘటన మధ్యాహ్నం 1.15 గంటలకు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో పీహెచ్సీలో వైద్యాధికారి ఆశాకిరణ్ పెదతాడేపల్లిలో నిర్వహించే 104 సేవలు కార్యక్రమానికి వెళ్లగా శిరీష అనే మరో వైద్యురాలు, సిబ్బంది అందుబాటులో లేరు. అటెండర్ సుబ్బారావు బాలికను పరిశీలించి పొట్టలో ఉన్న నీటిని బయటకు కక్కించాడు. అప్పుడు బాలిక మెదిలినట్లు పాప బంధువులు తెలిపారు. అయితే వైద్యులు లేకపోవడంతో చికిత్స అందక బాలిక మృతి చెందింది. జాన్సీ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. బంధువులు, గ్రామస్తుల ఆందోళన వైద్యులు లేకపోవడంతోనే తమ చిన్నారి చనిపోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు రోడ్డుకు అడ్డుగా టెంట్‌వేసి ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థానిక అధికారులు డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు అందించారు. ఆర్డీవో సూచనల మేరకు గూడెం తహసిల్దార్ వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో శకుంతల కూడా పీహెచ్‌సీకి వచ్చి వైద్యులను, సిబ్బందిని విచారించారు. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. వైద్యులు, సిబ్బంది తీరుపై ఫిర్యాదు ఈ సందర్బంగా పీహెచ్సీలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై డీఎంహెచ్‌వోకు, తహసిల్దార్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఉదయం 8 గంటలకు తీయాల్సిన ఆసుపత్రి పది గంటలకు తీస్తున్నారని, 12 గంటలకు మూసి వేస్తున్నారని ఆరోపించారు. వైద్య సేవలకు అటెండరే దిక్కవుతున్నాడని వాపోయారు. డీఎంహెచ్‌వో శకుంతల ఆదేశాల మేరకు బాలికకు వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలోనే పోస్టుమార్టం చేశారు. తాడేపల్లిగూడెం సీఐ చింతా రాంబాబు, ఎస్సైలు తిలక్, భగవాన్‌ప్రసాద్, కొండలరావు పాల్గొన్నారు. -
‘కస్తూర్బా’లో కలుషిత ఆహారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు కలుషిత ఆహారమే పరమాన్నమైంది. కడుపు మాడ్చుకోలేక.. ఆకలిబాధను ఎవరికీ చెప్పుకోలేక కుళ్లిన భోజనం తిని బుధవారం 18 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం.. వసతిగృహ పర్యవేక్షకుల కక్కుర్తి వెరసి విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారింది. వివరాల్లోకెళ్తే..స్థాని క కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నా రు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి హాస్టల్లో అన్నం, పప్పు, చెట్నీ వడ్డించారు. భో జనాలు ముగించుకుని నిద్రకుపూనుకున్న విద్యార్థినులు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకరి తరువాత మరొకరు.. ఇలా 18 వాం తులు, విరేచనాలు చేసుకున్నారు. రాత్రి అందుబాటులో ఎవరూ లేకపోవడంతో త మ బాధను ఎవరికీ చెప్పుకోలేపోయారు. రాత్రంతా అలాగే గడిపిన విద్యార్థినులు ఉ దయం హాస్టల్‌కు వార్డెన్ రాగానే విషయం చెప్పగా..హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కవిత, రోజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరి గిందని తెలిపారు. అస్వస్థతకు గురైన వి ద్యార్థులకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుం డా సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ చె ప్పారు. జరిగిన ఘటనపై వార్డెన్ శ్రీలతను వివరణ కోరగా..విద్యార్థినులకు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు. సందర్శించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆస్పత్రి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన లు తలెత్తకుండా చూడాలని వార్డెన్ శ్రీలత ను ఆదేశించారు. -
రెండో ప్రవూద హెచ్చరిక ఉపసంహరణ
కొవ్వూరు, న్యూస్‌లైన్: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీటిమట్టం తగ్గినా ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. ఇక్కడ రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. రహదారులపై బురద పేరుకుపోయింది. గురువారం సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఏడు రోజులుగా వరద ముంచెత్తడంతో గీతామందిరం ప్రాంగణంలో సుమారు మూడు అడుగుల మేర ఒండ్రు మట్టి పేరుకుపోయింది. మద్దూరులంక గ్రామం వరద ముంపు నుంచి తేరుకుంది. అయినా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. సముద్రంలోకి 13.02 లక్షల క్యూసెక్కులు ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గుతుంది. ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఉదయం 6 గంటలకు 15.10 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 7 గంటలకు 13.50 అడుగులకు తగ్గింది. ఆనకట్ట నుంచి 13,02,785 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక గురువారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న పంటలు : వరద ముంచెత్తడంతో పోలవరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లో వేలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. అరటి, దొండ, వంగ, కూరగాయలు, చెరకు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. చెరకు తోటల్లో బురద చేరి పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి బోర్లు, చేతిపంపుల్లో నుంచి వరద నీరు వస్తోందని అంటున్నారు. లోతట్టు ప్రాం తాల్లో బురద తొలగించేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
పంచాయతీలకు నిధుల గండం
గిద్దలూరు (రాచర్ల), న్యూస్‌లైన్: ఎట్టకేలకు పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ప్రత్యేక పాలనలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులుపడ్డారు. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గాలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అనేక తీర్మానాలు చే శాయి. అయితే వాటి పరిష్కారానికి పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. ప్రజలకెన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తాము ఆ హామీలనెలా నిలబెట్టుకోవాలో అని మథనపడుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలి: సర్పంచ్‌లకు అధికారాల వికేంద్రీకరించడంలో పాలకుల నిర్లక్ష్యం, వ్యవస్థలో ఉన్న లోపాలు గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా 29 రకాల అధికారాలను పంచాయతీలకు బదలాయించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అందులో పేర్కొన్న విధంగా నేటికీ అమలవడం లేదు. గ్రామాల అభివృద్ధికి బాధ్యులుగా ఉన్న సర్పంచ్‌లకు జిల్లా ప్లానింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడంపై పలు విమర్శలున్నాయి. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యులకు గ్రామ స్థాయిలో అవగాహన లేకపోవడం వలన గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. చాలా గ్రామాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీలకు అధికారాలు బదలాయించాలి: ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు బదలాయించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీలో సర్పంచ్‌లకు స్థానం కల్పించినప్పుడే పల్లె సీమలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు. గిద్దలూరు మండలంలో 18, రాచర్లలో 14 పంచాయతీలుండగా, అందులో ఒకటి, రెండు పంచాయతీలు మినహా అన్ని పంచాయతీల్లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. గ్రామ స్థాయిలో ఇంటి పన్ను, ఇతర పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు కాకపోవడంతో మురికి కాలువలను శుభ్రం చేయడం, తాగునీటి పథకాలను నిర్వహించడం తలకు మించిన భారమవుతోంది. కొన్ని గ్రామాల్లో తప్పని సరై మౌలిక వసతుల కోసం పనులు చేసి సర్పంచ్‌లు అప్పులపాలవుతున్నారు. రెండేళ్ల సుదీర్ఘ ప్రత్యేక పాలన అనంతరం ఎట్టకేలకు సర్పంచ్‌లు కొలువు తీరారు. వారిని పలకరించగా వారి మనోగతాలిలా ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలకు అధికారాలివ్వాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామసీమల అభివృద్ధికి సహకరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీలు నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి మధిర చంద్రశేఖరరెడ్డి, సర్పంచ్, గుడిమెట్ట నిధులు, అధికారాలు లేక పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. నిధులన్నింటినీ నేరుగా పంచాయతీలకు అందజేయాలి. వివిధ పద్దుల కింద వచ్చే నిధులను కచ్చితంగా పంచాయతీలకు ఇవ్వాలి. అప్పుడే సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి చేయగలరు. తగినన్ని నిధులు కేటాయించాలి శంకర్‌నాయక్, సర్పంచ్, కే.యస్.పల్లె ప్రభుత్వం పంచాయతీలకు తగినన్ని నిధులు కేటాయించడం లేదు. నిధులివ్వకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. వీధి లైట్లు వేయలేని దుస్థితిలో సర్పంచ్‌లున్నారు. చేతిలో చెక్‌బుక్ ఉన్నా, ట్రెజరీలో డబ్బులు లేకపోతే ఏంచేయాలి. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. తాగునీటి వసతి కల్పనకే నిధులు సరిపోవు సూరా రామలక్ష్మమ్మ, సర్పంచ్ పంచాయతీలో తాగునీటి కల్పన భారంగా మారింది. తగ్గుతున్న భూగర్భ జలాలతో మోటార్లు మరమ్మతులకు గురికావడం, నూతన బోర్లు వేయడం కోసం నిధులు అధికంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. పంచాయతీల్లో అవసరమైన అన్ని రకాల వసతులకు సరిపడే నిధులు కేటాయించాలి. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎ స్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ స భ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేం ద్రం నిర్ణయం తీసుకునే ముందు ఇరుప్రాం తాల ప్రజల అభిప్రాయాలను తీసుకుని, ఎ వరికీ అన్యాయం జరగకుండా చూడాల్సి ఉండేదన్నారు. బుధవారం గద్వాలలో బృం దావనం గార్డెన్ ఫంక్షన్హాల్లో జరి గిన స ర్పంచ్‌లు, సింగిల్‌విండో డెరైక్టర్ల సన్మానసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ పై పార్టీ ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉందన్నారు. సంప్రదింపుల పేరిట అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచిన కేంద్రం, నిర్ణయం వెలువరించే ముందు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. వై ఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తెలంగాణకు వ్యతిరేకం గా రాజీనామాలు చేసినట్లు వ్యతిరేక మీడియా చే స్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. తమ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఇడుపులపాయలో మరోసారి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేయడం ద్వారా ఇప్పటికైనా బురదజల్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రతోవైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా పార్టీ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్నారు. రాజన్న పాలనను ప్రజలు మళ్లీ చూస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీ నుంచి కొండా సురేఖ బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ నుంచి తెలంగాణ వారంతా వెళ్లినట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకులకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలోనూ వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్నం నాగిరెడ్డి మాట్లాడుతూ..మహానేత వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్‌ను రాబోయే ఎన్నికల్లో సీఎంగా చూడాల్సి వస్తుందన్న భయంతోనే కుట్రపన్ని అక్రమ కేసులతో జైలుకు పంపారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయం: ఎడ్మ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గుర్తుల్లేని ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ వారిగా చెప్పుకోవచ్చన్న ఆలోచనతో సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించిందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలమేందో తెలుస్తుందన్నారు. ఇక ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ, సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ హవా కొనసాగుతుందన్నారు. పార్టీ గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..గద్వాల ప్రాంతంలో దౌర్జన్యపాలన కొనసాగుతుందని, ప్రజలు దౌర్జన్యానికి భయపడి తమకే ఓటు వేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టిన వారి భ్రమలు ఇక సాగవని హెచ్చరించారు. పల్లెల్లో తాగడానికి నీళ్లు దొరకడం లేదని, కానీ భరతసింహారెడ్డి మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కొండాపురం షఫిఉల్లా, చిన్నయ్య, కృష్ణారెడ్డి, మజీద్, గోవింద్, గంట రమేష్, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
దర్శి, న్యూస్‌లైన్: సాగర్ కాలువలు జలకళను సంతరించుకోనున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.40 అడుగులకు చేరింది. మరో నాలుగడుగుల మేర నీరు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండినట్లే. బుధవారం సాయంత్రానికి సాగర్ ప్రాజెక్టు 26 క్రెస్టుగేట్లు ఐదడుగుల మేర ఎత్తి లక్షా 90 వేల 116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 8 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. సాగర్ కుడి కాలువ 53/2 మైలు వద్ద చేజెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని జోన్-2 కింద ఉన్న ప్రకాశం జిల్లాకు విడుదల చేశారు. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 వద్దకు నీరు చేరేసరికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఆ తరువాత మూడేళ్లపాటు సరిగా వర్షాలు కురవలేదు. దీంతో జలాశయంలో నీటి నిల్వ డెడ్‌స్టోరేజ్‌కు చేరింది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వారం రోజులుగా సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీరందించగలమని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ యల్లారెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులంతా ఖరీఫ్‌లో వరిసాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం: ఈ ఏడాది ముందస్తుగా సాగర్ కాలువలకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. మాగాణి సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాది సాగుచేయక రైతులు రాబడి కోల్పోయారు. ఆయకట్టులో సాగు పనులుంటే కూలీలకు కూడా దండిగా ఉపాధి లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలసలు తప్పుతాయి. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మాగాణి సాగవుతుంది. ఎకరాకు 35 నుండి 40 మంది కూలీలకు పని లభిస్తుంది. ఆధునికీకరణ పనుల నిలిపివేత త్రిపురాంతకం, న్యూస్‌లైన్: సాగర్ జలాశయానికి సమృద్ధిగా నీరు చేరి కుడి కాలువకు విడుదల చేయడంతో మరో రెండు రోజుల్లో జిల్లాకు సాగర్ జలాలు అందనున్నాయి. సాగర్ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజర్లకు నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ ప్రధాన కాలువ, మేజర్లపై చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. కాలువలకు నీళ్లు వదులుతుండటంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించారు. సాగర్ జలాలు వస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకోగా, మరికొన్ని చోట్ల నారుమళ్లు పోశారు. తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగా నీరు విడుదల చేస్తామని సాగర్ అధికారులు తెలిపారు. వీటితో తాగునీటి చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపనున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదు
హుజూర్నగర్, న్యూస్‌లైన్ :నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇక ఆగదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలకాలంగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక రాష్ట్రఅంశంపై యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ.. చరిత్రలో నిలిచిపోయేవిధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణపై ప్రకటనతో సోనియాగాంధీ.. ఇక్కడి ప్రజల హృదయాల్లో దైవం గా నిలిచిపోయారన్నారు. నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయి ప్రజల కల నెరవేరబోతుందన్నారు. సీమాంధ్ర ప్రాంతాల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకే కోర్‌కమిటీ సభ్యులు ఏకె.ఆంటోని నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగా లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఏ ప్రాంతం వారికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న వారిని వెళ్లగొడతామని ఇటీవల ఓ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అనవసరమన్నారు. రాజ్యాంగానికి లోబడి, నియమావళి ప్రకారం ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని చెప్పారు, మిగిలిన వారిని వారి సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో ఢిల్లీ తరహాభద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర హోంమంత్రి షిండే పర్యవేక్షణలో శాంతిభద్రతలను చూస్తామని ఇటీవల సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ వెల్లడించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకే రాష్ట్రాన్ని విభజించారని కొందరుచెప్పడం అనైతికమన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నారు. హుజూర్‌నగర్‌కు ఐటీఐ కళాశాల మంజూరు హుజూర్‌నగర్‌కు ఐటీఐ కళాశాల మంజూరు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. రూ.6.02 కోట్లతో ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదలఅభివృద్ధి సంస్థ డెరైక్టర్ సాముల శివారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నెలలోగా సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో తిష్టవేసిన సమస్యలన్నింటినీ నెలరోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్.ముక్తేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నల్లగొండలోని ఆస్పత్రి కార్యాలయంలో బుధవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూలనపడిన అల్ట్రా సౌండ్ మిషన్ స్థానంలో కొత్త మిషన్‌ను కమిటీ తీర్మాణంతో కొనుగోలు చేయాలని, గత ఐదు నెలలుగా పనిచేయని సీటీస్కాన్ మిషన్‌ను వెంటనే మరమ్మతులను చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపైనే ఉందన్నారు. అత్యవసర మందులను బయట నుంచి కొనుగోలు చేయకుండా జనరిక్ స్టోర్స్ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమున్న మందులు సరఫరా చేయడానికి డీఆర్డీఏ సిద్ధంగా ఉందన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ను, డ్రెయిన్ పైప్లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్లైన్లు వేయించాలని ఆదేశించారు. నాణ్య తా ప్రమాణాలు పాటించే కాంట్రాక్టర్‌ను గుర్తించి పనులను అప్పగించి త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రి రక్తనిధి కేంద్రం నుంచి ఆస్పత్రిలోని పేషంట్లకు ఉచి తంగా రక్తం అందజేయాలని, బయటి పేషంట్లకు నామమాత్రపు ఫీజు తీసుకుని అందజేయాలని కోరారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమావేశం నాటికి అస్పత్రిలో సమస్యలన్నింటినీ పరిస్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆ మోస్, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ హరినాథ్, ఆర్ఎంఓ డాక్టర్ ఉదయ్‌సింగ్, డాక్టర్లు శ్రీనివాస్‌రావు, నర్సింగరా వు, మాతృనాయక్, హేమలత, రెడ్‌క్రాస్ కార్యదర్శి పులిజాల రాంమోహన్‌రావు, ఈఈ ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కుబడిగా సాగిన సమావేశం నిత్యం 300మంది ఇన్‌పేషంట్లు, 500కు పైగా ఔట్ పేషంట్లతో కిటకిటలాడుతున్న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని పరిస్కరించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర అధికారులు సభ్యులుగా ఉన్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీ సమావేశం కావా ల్సి ఉంది. కానీ, 20 నెలల తరువాత సమావేశమైనప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరుకాకపోవడం గమనార్హం. సమస్యలపై చర్చించేవారు లేకపోవడంతో సమావేశం మొక్కుబడిగా గంటసేపట్లోనే ముగించేశారు. డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిస్కరించాలని, ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లగొండలోని ఆస్పత్రిలో డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్రావు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలోనికి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ సమావేశం అనంతరం వినతిపత్రం తీసుకుంటామని అధికారులు సమాధానం చెప్పడంతో ఆయా సంఘాల నాయకులు సమావేశ మందిరంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేస్తున్న డీవైఎఫ్ఐ నాయకులు జంజిరాల సైదులు, శ్రీనివాసచారి, శ్రీకాంత్,శ్రీను, నరేష్, సాయి ఇమ్రాన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.శ్రవణ్‌కుమార్, వి.లెనిన్, మునీర్, పి.నాగరాజు, సైదులు, మణీందర్లను అరెస్టు చేశారు. -
జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం
వలేటివారిపాలెం/లింగసముద్రం/గుడ్లూరు/కందుకూరు/పామూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 3.25 సమయంలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప భూకంపం సంభవించింది. వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం, చుండి, అయ్యవారిపల్లి, పోలినేనిచెరువు, మాలకొండ తదితర గ్రామాల్లో, గుడ్లూరు మండలంలోని పెదలాటరఫి, చినలాటరఫి, మొగళ్లూరు, గుడ్లూరు బీసీ కాలనీ, తెట్టు గ్రామాల్లో, లింగసముద్రం మండలంలోని లింగసముద్రం, పెదపవని, మొగిలిచర్ల, పెంట్రాల గ్రామాల్లో, కందుకూరు పట్టణంలో మధ్యాహ్నం 3.15 సమయంలో, పామూరు మండలంలో మధ్యాహ్నం 3.40 నుంచి 3.45 మధ్య స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. బ్యారన్లపై ఉండే రేకులు, ఇళ్లలోని సామగ్రి కదిలాయి. ఇళ్ల గోడలు కంపించడంతో అరుగులపై కూర్చున్న వారు పరుగులు తీశారు. వలేటివారిపాలెం బస్టాండ్ సెంటర్లో భూమి కంపించడంతో దుకాణాల్లో ఉన్న వారు భయంతో రోడ్లపైకి పరుగుపెట్టారు. ఇళ్లలో ఉన్న చిన్నచిన్న వస్తువులు కింద పడటంతో భయపడిన ప్రజలకు ఇళ్లబయటకొచ్చారు. ఇంట్లో టీవీ చూస్తుండగా భూమి కదిలినట్లయిందని, ఆ తాకిడికి ర్యాకుల్లో ఉన్న తేలిక వస్తువులు కింద పడటంతో భయంతో పరుగులు తీశానని పెదలాటరఫి గ్రామానికి చెందిన మాలకొండారెడ్డి తెలిపారు. మొగిలిచర్లలో మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో జిల్లా పరిషత్ పాఠశాలలోని రెండు మూడు గదుల్లో శ్లాబు, కిటికీల గోడలు, బ్లాక్ బోర్డులు పగుళ్లిచ్చాయి. పెదపవనిలో ఇళ్లపై సిమెంటు రేకులు నెర్రెలిచ్చాయి. పామూరు మండల పరిధిలోని పాబోలువారిపల్లె గ్రామానికి చెందిన ఉప్పుటూరి మాలకొండయ్య ఇంటి గోడలు స్వల్పంగా పగుళ్లిచ్చాయి. ప్రహరీ కూడా కొద్దిగా దెబ్బతింది. భూమి కంపించిన సమయంలో బీరువా లోపల, పైన ఉంచిన వస్తువులు కదిలినట్లు శబ్దాలొచ్చాయని, భూకంపం వచ్చినట్లు గ్రహించి వెంటనే బయటకు పరుగులు తీసినట్లు మాలకొండయ్య తెలిపారు. కందుకూరు పట్టణంలోని పాత బ్యాంకు బజారు, ఎస్బీఐ పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా పామూరు మండలం బోడవాడ, అయ్యవారిపల్లె, రేణిమడుగు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ఆ గ్రామాలకు చెందిన గోవిందు కొండారెడ్డి, ఎమ్ రామకృష్ణ తెలిపారు. -
జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం
వలేటివారిపాలెం/లింగసముద్రం/గుడ్లూరు/కందుకూరు/పామూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 3.25 సమయంలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప భూకంపం సంభవించింది. వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం, చుండి, అయ్యవారిపల్లి, పోలినేనిచెరువు, మాలకొండ తదితర గ్రామాల్లో, గుడ్లూరు మండలంలోని పెదలాటరఫి, చినలాటరఫి, మొగళ్లూరు, గుడ్లూరు బీసీ కాలనీ, తెట్టు గ్రామాల్లో, లింగసముద్రం మండలంలోని లింగసముద్రం, పెదపవని, మొగిలిచర్ల, పెంట్రాల గ్రామాల్లో, కందుకూరు పట్టణంలో మధ్యాహ్నం 3.15 సమయంలో, పామూరు మండలంలో మధ్యాహ్నం 3.40 నుంచి 3.45 మధ్య స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. బ్యారన్లపై ఉండే రేకులు, ఇళ్లలోని సామగ్రి కదిలాయి. ఇళ్ల గోడలు కంపించడంతో అరుగులపై కూర్చున్న వారు పరుగులు తీశారు. వలేటివారిపాలెం బస్టాండ్ సెంటర్లో భూమి కంపించడంతో దుకాణాల్లో ఉన్న వారు భయంతో రోడ్లపైకి పరుగుపెట్టారు. ఇళ్లలో ఉన్న చిన్నచిన్న వస్తువులు కింద పడటంతో భయపడిన ప్రజలకు ఇళ్లబయటకొచ్చారు. ఇంట్లో టీవీ చూస్తుండగా భూమి కదిలినట్లయిందని, ఆ తాకిడికి ర్యాకుల్లో ఉన్న తేలిక వస్తువులు కింద పడటంతో భయంతో పరుగులు తీశానని పెదలాటరఫి గ్రామానికి చెందిన మాలకొండారెడ్డి తెలిపారు. మొగిలిచర్లలో మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో జిల్లా పరిషత్ పాఠశాలలోని రెండు మూడు గదుల్లో శ్లాబు, కిటికీల గోడలు, బ్లాక్ బోర్డులు పగుళ్లిచ్చాయి. పెదపవనిలో ఇళ్లపై సిమెంటు రేకులు నెర్రెలిచ్చాయి. పామూరు మండల పరిధిలోని పాబోలువారిపల్లె గ్రామానికి చెందిన ఉప్పుటూరి మాలకొండయ్య ఇంటి గోడలు స్వల్పంగా పగుళ్లిచ్చాయి. ప్రహరీ కూడా కొద్దిగా దెబ్బతింది. భూమి కంపించిన సమయంలో బీరువా లోపల, పైన ఉంచిన వస్తువులు కదిలినట్లు శబ్దాలొచ్చాయని, భూకంపం వచ్చినట్లు గ్రహించి వెంటనే బయటకు పరుగులు తీసినట్లు మాలకొండయ్య తెలిపారు. కందుకూరు పట్టణంలోని పాత బ్యాంకు బజారు, ఎస్బీఐ పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా పామూరు మండలం బోడవాడ, అయ్యవారిపల్లె, రేణిమడుగు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ఆ గ్రామాలకు చెందిన గోవిందు కొండారెడ్డి, ఎమ్ రామకృష్ణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
కొండమల్లేపల్లి, న్యూస్‌లైన్ :పాఠశాలకని ఇంటి నుంచి బయలుదేరిన బాలుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. అప్పటి వరకు ప్రయాణించిన డీసీఎం వాహనమే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద సంఘటన బుధవారం దేవరకొండ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రిచెట్టు తండాకు చెందిన బాలు, చిట్టి దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడైన మూడావత్ విజయ్ (14) దేవరకొండ పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం తండాకు వచ్చిన డీసీఎంలో మరో విద్యార్థి బాబులాల్‌తో కలిసి దేవరకొండ కు బయలుదేరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని సుమోఅడ్డా వద్ద కిందకు దిగుతుండగా విజయ్ పుస్తకాలు కిందపడిపోయాయి. కిందకు వంగి పుస్తకాలను తీసుకుంటున్న సమయంలో డీసీఎం వెనక్కి రావడంతో వెనక చక్రాల కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే విజయ్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవరకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.నాగేశ్వర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఎరువూ..కరువే
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగానే ఆరంభమైంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుం డటంతో గత రెండేళ్ల పంటనష్టం బారి నుంచి గట్టెక్కేందుకు రైతులు పంటసాగు చేపట్టారు. తీ రా అవసరానికి సరిపడా ఎరువులు దొరక్కపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డా రు. ఈ ఖరీఫ్‌లో వరితో పాటు ప త్తి, మొక్కజొన్న తదితర రకాల పంటలను రై తులు సాగుచేశారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు కోసం ప్రణాళికలు రూపొందించారు. సాగువిస్తీర్ణం పె రిగే అవకా శం ఉందని ముందుగానే భావించి అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని నెలవారీ నివేదికలు పంపినా ఫలితం లేకపోయింది. దీంతో రైతన్నలు ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి త లెత్తింది. కొందరు వ్యాపారులు యూరియాపై అదనంగా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన ఎరువులపై నిర్ణయించిన ధర కంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పెరగనున్న సాగు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆయకట్టులో దాదాపు లక్ష హెక్టార్లలో వరిపంట సాగు కావచ్చని అధికారులు అంచనా వే శారు. అలాగే ఆర్డీఎస్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఆయకట్టులో పంటల సాగుకు నీళ్లిచ్చే అవకాశం ఉండటంతో సాగువిస్తీర్ణం భారీగా పెరగనుంది. ఆ మేరకు రైతులకు ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది. జూలైలో 22 వేల 650 టన్నుల యూరియా అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు కోరగా, ఇందులో 16,120 టన్నులు మాత్రమే వచ్చింది. ఆగస్టులో 20,050 టన్నుల యూరియా కోసం ప్రణాళికలు పంపించగా ఇప్పటివరకు ఒక్క టన్ను ఎరువు కూడా రాలేదు. జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్నా మార్కెట్లో మాత్రం దొరకడం లేదని రైతులు పెదవివిరుస్తున్నారు. అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఎక్కువ..మరికొన్ని ప్రాంతాలకు తక్కువ కోటా కేటాయించడంతో ఎరువుల సమస్య ఉత్పన్నమవుతుంది. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం డీలర్లకు కేటాయిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌కు కేటాయించిన ఎరువులను కూడా వ్యవసాయశాఖ అధికారులు సహకార సంఘాలకు కేటాయిస్తున్నారు. అయితే చాలాచోట్ల అక్కడి నుంచి బయట మార్కెట్‌కు తరలిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొరత ఏర్పడటంతో రైతులు నిత్యం సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పెరిగిన డిమాండ్ సకాలంలో వర్షాలు రావడం వల్ల మెట్ట ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తిర, కంది, ఆముదం, జొన్నతో పాటు వివిధ రకాల కూరగాయలకు సంబంధించిన పంటలు సాగుచేశారు. అదేవిధంగా బోరుబావుల కింద సాగుచేస్తున్న వరి పైరుకు, మెట్ట ప్రాంతంలో సాగు చేసిన పంటలకు రైతులు ఒకే సారి ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ఎరువుల కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువుల కొరతను అధిగమిస్తాం.. ఒక్కసారిగా వర్షం రావడం వల్ల ఎరువుల కొనుగోలుకు రైతులు వస్తుండటంతో కొంత మేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా కూడా కొరతను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి తెప్పిస్తున్నాం. ఎరువులు వచ్చిన వెంటనే ఆయా సహకార సంఘాలకు కేటాయించి రైతులకు పంపిణీ చేయాలని ఆదేశాలిస్తున్నాం. ప్రతి రోజూ మానిటరింగ్ చేస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. గతేడాది జూలై ఆఖరు నాటికి 33,070 మెట్రిక్ టన్నుల యూరియా రాగా ఈ ఏడాది జూలై ఆఖరుకు 46, 238 మెట్రిక్ టన్నులు వచ్చింది. రైతులు తక్కువ ధర అనే కారణంతో యూరియా వైపు మొగ్గు చూపుతుండటం వల్ల వాటికి కొంతమేర డిమాండ్ ఏర్పడింది. - కెవి.రామరాజు, వ్యవసాయశాఖ జేడీ -
ఇంటర్వ్యూలకు భారీ స్పందన
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) ఉమ్మడి కార్యాచరణ ద్వారా చేపట్టిన లబ్ధిదారుల ఎంపికకు నిరుద్యోగ యువత భా రీగా తరలివచ్చింది. బుధవారం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన శిబిరానికి పట్టణం నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీ గా వచ్చారు. బ్యాంకు అధికారులతోపాటు మున్సిపల్ కార్యాలయ, మెప్మా సిబ్బంది వారిని వారించడంలో కొంత ఇబ్బందులు పడ్డారు. రాజీవ్ యువశక్తి పథకానికి 186 దరఖాస్తులు, అభ్యుదయ యోజనకు 383 దరఖాస్తులు, మెప్మాకు 162, ఎస్సీ కార్పొరేషన్‌కు 411, ఎస్టీ కార్పొరేషన్(మాడా)కు 81, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 120 ఇలా మొత్తం 1343 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భం గా మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ మా ట్లాడుతూ 2013-14 సంవత్సరానికిగాను రాజీవ్ యువశక్తి, రాజీవ్ అభ్యుదయ యోజన పథకంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పట్టణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న వారిని బ్యాంకు అధికారులు రుణాల కోసం లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు రాయితీతో కూడిన రుణాలను వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరు చేస్తున్నట్లు వెల్లడిం చారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అం దించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మె ప్మా పీఆర్పీ రమేష్‌నాయక్, వివిధ బ్యాంకుల అధికారులు నాగభూషణరావు, గోపాలకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, విష్ణుమోహన్, సాయికుమారి, వీవీఎస్ మూర్తి, రవికిశోర్, ఎస్. రాం బాబు, అశోక్‌కుమార్, మెప్మా సీవోలు ఎం. శ్రీనివాసాచారి, సైదానాయక్, వెంకటేశ్వర్లు, సీఎల్ఆర్పీ పి పార్వతి పాల్గొన్నారు. -
సోనియాకు పిండ ప్రదానం
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటనతో ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిండ ప్రదానం చేశారు. బుధవారం స్థానిక సప్తగిరి సర్కిల్ నుంచి సుభాష్‌రోడ్డు మీదుగా టవర్ క్లాక్ వరకు ర్యాలీగా వెళ్లి, తిరిగి సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా సోనియాగాంధీ అమర్ రహే.. సోనియాగాంధీ మర్ గయా.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్లో వేద బ్రాహ్మణుడి వేషధారి చింతకుంట మధు మంత్రోచ్ఛారణల నడుమ పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ... సోనియాగాంధీ తన ఇష్టమొచ్చిన రీతిలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే నష్ట పోయేది రాయలసీమ వాసులేనని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు నీకు పట్టవా? అంటూ ప్రశ్నించారు. విభజనపై వెనక్కు తగ్గక పోతే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. చిన్న రాష్ట్రాలుగా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, తెలంగాణ వాసులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఉద్యోగులకు చిన్న హాని జరిగినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బండి పరుశురాం, షెక్షావలి, మైనూద్దీన్, మహానందరెడ్డి, మారుతీనాయుడు, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. -
సమైక్య ఉద్యమ స్ఫూర్తి
సాక్షి, ఒంగోలు: వాడవాడలా సమైక్య ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు ఇలా అందరూ సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మూడో రోజు రిలే నిరాహార దీక్షల్ని పార్టీ బీసీ సెల్ నేతలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షల్ని ప్రారంభించి ప్రసంగించారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ కారును అడ్డగించి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. న్యాయవాదులకు ఉద్యోగ జేఏసీ మద్దతు పలికింది. బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది వేల మంది విద్యార్థులతో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్మికులు ఒంగోలు జాతి ఎద్దుకు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన బోర్డును తగిలించి వినూత్న రీతిలో నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. ఒంగోలులో పాలిటెక్నిక్ విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, రైతాంగ సంక్షేమ సేవాసంఘం, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చీరాల, పేరాల సప్లయర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసింది. భారతీ జూనియర్ కాలేజీ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మలను గడియార స్తంభం సెంటర్లో దహనం చేశారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ జరిగింది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి ఒకరోజు రిలే దీక్ష చేపట్టగా, మార్కాపురంలో సమైక్యవాది గంగిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. దీక్షను వైఎస్సార్ సీపీ విజయవాడ సిటీ ఇన్చార్జి ఉడుముల కోటిరెడ్డి ప్రారంభించారు. తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానే దీక్ష నిర్వహిస్తున్నట్లు రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమంతునిపాడు మండలం వేములపాడులో కూడా ఆటో కార్మికులు ర్యాలీ చేశారు. మార్కాపురం మండలం చింతంగుంట్ల వద్ద రెండువేల మంది విద్యార్థులు, మహిళలతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కోర్టు సెంటర్లో రాస్తారోకో చేశారు. కొమరోలు మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం, ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. చీమకుర్తి మండలం ఎల్లయ్యనగర్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బల్లికురవలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో వాయిద్య కళాకారులు, రంగస్థల కళాకారులు పద్యాలు పాడుతూ సమైక్య రాష్ట్రానికి మద్దతు పలికారు. అనంతరం పాతబస్టాండు సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. పర్చూరులో మూడోరోజు న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. మర్రిపూడిలో 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. టంగుటూరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. -
అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణచలేరు
సాక్షి, అనంతపురం : ‘సమైక్య’ ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్న ప్రభుత్వం నాటి బ్రిటీష్ చీకటి పాలనను గుర్తుకు తెస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కేసులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, సమైక్యాంధ్ర కోసం జైలు కెళ్లడానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. బుధవారం వారు నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గురునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమం నాటి స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుకు తెస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎక్కడికెళ్లినా ప్రజల ఛీత్కారాలకు గురవుతున్నారని తెలిపారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేని సోనియాగాంధీ.. ఆయనకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో పాటు రాహుల్‌ను ప్రధాని చేయాలన్న కుటిల రాజకీయంతో రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాగాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర విషయంలో ప్రతి సందర్భంలోనూ వైఎస్సా ర్సీపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. 2008లో టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారని, దాని వల్లే నేడు రాష్ట్ర విభజన జరిగిందని వివరించారు. ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ.. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు రూ.4 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసి కొత్త డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు. చంద్రబాబు అలా డ్రామాలు అడుతుంటే.. సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలతో హై‘డ్రామా’లకు తెరలేపారన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేదని సాక్షాత్తు దిగ్విజయ్‌సింగ్ చెబుతుంటే.. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం రాజీనామాలతో లాభం లేదని.. అసెంబ్లీలో సమైక్య గళాన్ని విన్పిస్తామని చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని, లేనిపక్షంలో ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ రోజు ఉద్యమానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభంజనం ముందు నిలబడే శక్తిలేని సోనియా ‘విభజించు-పాలించు’ అనే బ్రిటీష్ కుటిల రాజకీయ నీతిని ఒంటబట్టించుకున్నారని విమర్శించారు. సమైక్యవాణి వినిపించడానికి ఢిల్లీకి వెళ్తున్నామని చెబుతున్న మంత్రులంతా.. వారికి వారుగా వెళ్లడం లేదన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న పిలుపుతోనే వెళ్తున్నారన్నారు. అక్కడ సోనియాగాంధీ పాదధూళిలో పునీతులై.. సమైక్యవాణిని పక్కనపెడుతున్నారని దుయ్యబట్టారు. సమైక్య ఉద్యమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొంటున్నాయని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డెరైక్షన్ మేరకే జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఉద్యమకారులపై బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. కొందరిని పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లి చావబాదుతున్నారని తెలిపారు. ‘సమైక్యాంధ్ర కోసం మేము జైలుకెళ్లడమే కాదు.. ప్రాణత్యాగానికైనా సిద్ధమే. కేసులు, బైండోవర్లకు భయపడే ప్రసక్తే లేదు. జిల్లా పోలీసుల తీరు బ్రిటీష్ వారిని గుర్తుకు తెస్తోంది. అసలు వీరు పోలీసులా లేక కాంగ్రెస్ తొత్తులా?’ అని కాపు మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 12లోగా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. శంకరనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాగా.. అందుకు తోడ్పాటు అందించింది టీడీపీ అని అన్నారు. సమైక్యాంధ్రపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని సూచించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన సోనియా రాష్ట్ర ప్రజలను విడదీసి పాపం మూటగట్టుకున్నారన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని చీలికలు, పేలికలు చేయడానికే అధికార పార్టీ నేతలు ప్రత్యేక రాయలసీమ వాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. ఇదంతా కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్లోనే జరుగుతోందన్నారు. పార్టీ నేత తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సమైకాంధ్రపై నోరుమెదపని చంద్రబాబు.. సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం రూ.4 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జిల్లా ముఖ్య అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, నాయకులు షెక్షావలి, లింగాల శివశింకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలు
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాం ప్లెక్స్ కూడలి వద్ద వంటావార్పు కార్యక్రమా న్ని నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గం టల వరకూ రహదారిని దిగ్బంధం చేసి వం టావార్పు నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపో యాయి. అనంతరం భోజన వడ్డన కార్యక్రమాన్ని సుజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా , నియోజకవర్గ నాయకులు రాంసుధీర్, చెలికాని మురళీకృష్ణ, రౌతు రామ్మూర్తి, బేతనపల్లి శివున్నాయుడు, రాంబర్కి శరత్, రాయలు, నాగిరెడ్డి అరుణ, బీసపు పార్వతి, ధనలక్ష్మి, బొగ్గు పద్మజ, తది తరులు పాల్గొన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ ఊరేగింపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ లో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను పది తలలతో ఏర్పాటు చేసి చె ప్పులు దండ, మందు సీసాలు పెట్టి వినూత్నరీతితో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మాజీ ఎమ్మెల్యేలు ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, శంబంగి వెంకటచినప్పలనాయుడు సంఘీభా వం ప్రకటించారు. మోకాళ్లతో వినూత్న నిరసన తాండ్రపాపారాయ విద్యాసంస్థల ఉద్యోగులు మోకాళ్లతో నిలబడి నిరసన తెలిపారు. ఊరేగింపుగా వచ్చి రైల్వేస్టేషన్ జంక్షన్‌గా మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడ మోకాళ్లతో నిల బడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన భరతమాత వేషధారణ ఆకట్టుకుం ది. పట్టణంలోని మిలట్రీకాలనీవాసులు కూ డా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపా రు. అలాగే బొబ్బిలి తైక్వాండో క్రీడాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వీరంతా ఊరేగింపుగా వచ్చి ద క్షిణదేవిడి వద్ద మానవహా రంగా ఏర్పడ్డారు. కోచ్ బంకురు ప్రసాద్, బొంగు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై తైక్వాండో ప్రదర్శన ఇచ్చారు. కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు విజయనగరం టౌన్: సమైక్యాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ పార్టీ యు వజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో బుధవారం ఎత్తుబ్రిడ్జి వద్ద వం టావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విభజన ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లావ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజ య్ మాట్లాడుతూ జిల్లా నేతలు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. పార్టీ నాయకుడు కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు చేసైనా సమైక్యాంధ్రాను సాధించుకుంటామన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పార్టీ మహిళా కార్యకర్తలు కబడ్డీ ఆడారు. వంటావార్పు కార్యక్రమం అనంతరం కేసీఆర్, కిరణ్, సోనియా, బొత్స చిత్ర పటాల వద్ద వం డిన వంటను వడ్డించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గేదెల తిరుపతి, పార్టీ నాయకులు డాక్టర్ సురేష్‌బా బు, మజ్జి త్రినాథ్, నామాల సర్వేశ్వరరావు, గండికోట శాంతి, చెల్లూరు ఉగ్రనరసింగరా వు, మురళీమోహన్, పెదిరెడ్ల కాశీరత్నం, వా జా మంగమ్మ, రాంబార్కి సత్యం, కొసర నారాయణ, క్రిస్టోఫర్ రాజు, ఇప్పిలి రామారావు,పొట్నూరు శ్రీను, మొయిద ఆదిబాబు, శివ, సియ్యాదుల శేఖర్, మద్దెల మోహన్, రాంబాబు, దేవి, రమణి, రాజశ్రీ, గౌరి, తది తరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో అదే జోరు పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. బుధవారం తెల్లవారు జా ము నుంచే అన్ని సంఘాల నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద వంటావార్పు కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే యువకులు, వైద్యులు, న్యాయవాదులు ప్రధాన రహదారిపై క్రికెట్ , వాలీ బాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బ్రహ్మణ సం ఘం నాయకులు సూర్యపీఠం నుంచి వేదమంత్రాలు చదువుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు ర్యాలీ చేసి,అక్కడ సమైక్యాంధ్రకు మద్దతుగా హోమం నిర్వహించారు. అలాగే పలు సంఘాలు పాత బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి కూడలి వరకు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ.. ర్యాలీలు చేశారుు. మేళతాళా లు, డ్యాన్స్‌లతో యువకులు సమైఖ్యవాదాన్ని ఢిల్లీ గద్దెకు వినిపించేలా గర్జించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని పలు దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛందం గా మూసివేశారు. స్థానిక తెలుగుతల్లి విగ్రహానికి పట్టణ ప్రముఖులు బెలగాం జయప్రకాష్, బొడ్డేపు రామకృష్ణ, తదితరులు పాలభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద యువకులు సెల్ టవర్ ఎక్కి సమైక్య నినాదాలను చేశారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు మానవహరం నిర్వహించి పిల్లలతో నృత్యం చేయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. పలు సంఘాల నాయకులు రాష్ట్ర విభజన వద్దని కోరుతూ ఆర్డీఓ వెంకటరావుకు వినతు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు గర్భాపు ఉదయభాను, జమ్మాన ప్రసన్నకుమార్, పట్టణ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు, తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు సీఐ బి. వెంకటరావు బందోబస్తు నిర్వహించారు. టీడీపీ లేఖ వల్లే రాష్ట్ర విభజన విజయనగరం ఫోర్ట్ , న్యూస్‌లైన్ : టీడీపీ తెలంగాణకు అనుకూలమని 2008లో లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజనకు కారణమని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సమైక్యవాదులు రెండు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చి న వెంటనే ప్రజల అభిష్టం మేరకు ఆందోళనలు చేస్తున్నా మన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవగ్రహా సహాస్ర సదర్భహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్య క్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నశ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఆంటోని కమిటీకి చట్టబద్ధత ఏదీ? జామి: తెలంగాణ ప్రకటన సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సోనియూగాంధీ నియమించిన ఆంటోని కమిటీకి చట్టబద్ధత లేదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీశెట్టి బాబ్జీ చెప్పారు. జామిలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వపరంగా వేసిన కమిటీ కాదని కేవలం పార్టీ పరంగా వేసిన కమిటీ అని అభివర్ణించారు. గతంలో ప్రభుత్వ పరంగా వేసిన శ్రీకృష్ణ కమిటీకి విలువ లేనప్పుడు చట్టబద్ధత లేని కమిటీలతో ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి కమిటీలు ప్రజలను మోసం చేసేందుకు దోహదపడతాయని తీవ్రంగా విమర్శించారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి, శాంతియుతంగా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పలువురు ఆ పార్టీ నేతలు ఉన్నారు. -
పథకం పూర్తిస్థాయిలో అందేలా చూడాలి
నర్సంపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం లక్షలాది రూపాయులు ఖర్చు చేస్తూ సాగు నీటి కొరత తీర్చడానికి తలపెట్టిన బిందుసేద్యం(డ్రిప్) పథకాన్ని రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కలెక్టర్ కిషన్ అధికారులను ఆదేశించారు. వుండలంలోని చంద్రయ్యుపల్లి, బాంజీపేట గ్రావూల్లో ఇరిగేష న్ పనితీరును బుధవారం ఆయున పరిశీలించా రు. ఈ సందర్భంగా గ్రావు శివారులో ఉన్న పొ లం గట్ల మీద నడు స్తూ బావుల వద్దకు వెళ్లి బిం దు సేద్యం పని తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. బిందుసేద్యం పరికరాలు అన్ని అందాయూ.. లేదా.. ఏమైనా డబ్బులు చెల్లించా రా తదితర విషయూలను అడిగి తెలుసుకున్నారు. చంద్రయ్యుపల్లి గ్రావూనికి చెందిన దుర్గల సూరయ్యు, దుర్గల పైడిలకు వుంజూరైన డ్రిప్ ఇరిగేషన్‌ను ట్రయుల్ రన్ చేయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం సబ్సిడీ రూపంగా అందించే డ్రిప్ ఇరిగేషన్ పథకం తవుకు వర్తించడం లేదని చంద్రయ్యుపల్లి గ్రావూనికి చెందిన రైతులు బాషబోయిన రాజు, ఎల్లస్వామి, సాంబరెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓకు సూచనలు ఇచ్చారు. బిందుసేద్యం పథకంలో అవకతవకలు జరి గితే చర్యలు తీసుకుంటావుని హెచ్చరించారు. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం పూర్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీ, ఎస్సీ రైతులకు పూర్తి శాతం సబ్సిడీ వర్తిస్తుందని, రైతులు దీ నిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రవుంలో ఆర్డీఓ అరుణకువూరి, తహసీల్దార్ రజి నీ, సునీత, ఆర్ఐ రాజు, ప్రసాద్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి మడికొండ : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదువాలని కలెక్టర్ కిషన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మడికొండలోని కేంద్రీ విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయంలో జరిగే అడ్మిషన్ల ప్రక్రియ, కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్ నిర్మాణం గురించి ప్రిన్సిపాల్ అనుముల సిద్దా రాములును అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కిషన్ మాట్లాడు తూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రగులుతున్న జ్వాల
సాక్షి, అనంతపురం : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, రైతులు, ఆటో కార్మికులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనం.. తదితర నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు పది వేల మందితో అనంతపురం నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ తెలుగుతల్లి కూడలి వరకు కొనసాగింది. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. దాదాపు ఐదు వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి.. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేశారు. జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి బాటలోనే సమైక్యాంధ్ర జేఏసీ, వడ్డెర సంక్షేమ సంఘం, అవే ఆధ్వర్యంలో వేర్వేరుగా టవర్‌క్లాక్ సర్కిల్లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి మద్దతు తెలిపారు. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి గ్రామానికి చెందిన రైతులు ఎడ్లబండ్లతో టవర్‌క్లాక్ చుట్టూ అరగంట పాటు తిరిగి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆటో కార్మికులు, ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయిస్, ట్రాన్స్‌కో, గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సప్తగిరి సర్కిల్లో కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. రిలే దీక్షలు చేస్తున్న సమైక్యవాదులకు ఎర్రిస్వామిరెడ్డి సంఘీభావం తెలిపారు. నగరంలోని ప్రతి కాలనీ వాసులు ర్యాలీలు చేపట్టి.. సోనియా, కేసీఆర్, సీఎం దిష్టిబొమ్మలను తగులబెట్టారు. బుధవారం ఒక్కరోజే నగరంలో 200కు పైగా దిష్టిబొమ్మలను దహనం చేయడం గమనార్హం. ఎస్కేయూలో ఉద్యోగులు, విద్యార్థుల రిలే దీక్షలకు వైస్ చాన్స్‌లర్ రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. వర్సిటీ సమీపంలోని రాధాస్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇటుకలపల్లె వైఎస్సార్సీపీ సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి... విద్యార్థుల దీక్షలకు మద్దతు తెలిపారు. ఇటుకలపల్లి మహిళలతో పాటు టిప్పర్ల అసోసియేషన్ కార్మికులు ఎస్కేయూ వద్ద సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇక కళ్యాణదుర్గంలో న్యాయవాదుల రిలేదీక్షలు మూడోరోజుకు చేరాయి. జేఏసీ నాయకులు వెనక్కు నడుస్తూ నిరసన తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. మంత్రులు కనిపించడం లేదని బత్తలపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్లులో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను సమైక్యవాదులు దహనం చేశారు. గుత్తిలో జాక్టో దీక్షలు ఏడోరోజుకు చేరాయి. గుత్తికి చెందిన కిశోర్ అనే యువకుడు బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఒక్క అనంతపురం నగరంలోనే బుధవారం 200 పైగా దిష్టిబొమ్మలను సమైక్యవాదులు దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గేదెలతో ర్యాలీ నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. పది మంది యువకులు శిరోముండనం చేయించుకున్నారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో కేబుల్ ఆపరేటర్లు ప్రసారాలను నిలిపివేసి.. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కోడూరులోని జాతీయరహదారిపై ఐకేపీ మహిళలు రాస్తారోకో చేశారు. కదిరిలో ట్రాన్స్‌కో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల ర్యాలీలో ఓ ఉద్యోగి నృసింహుని వేషధారణతో అలరించారు. సోనియా, కేసీఆర్, తెలుగుతల్లి వేషధారులతో కలిసి ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల టీచర్లు, మున్సిపల్ ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీలు చేశా రు. పట్టు, చేనేత ఉద్యోగులు, కార్మికులు 4 కిలోమీటర్లు వెనక్కు నడిచి నిరసన తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అందరూ తెల్ల పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయంలో పూజలు, చర్చి, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. మడకశిర, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తాడిపత్రిలో గ్రానైట్, స్లాబ్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ఫ్యాక్టరీలకు తాళాలు వేసి.. నిరసన తెలిపారు. ఉరవకొండలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు స్థానిక అనంతపురం-బళ్లారి బైపాస్ రోడ్డును దిగ్బంధించారు. విడపనకల్లు తహశీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. బెళుగుప్పలో సమైక్యవాదులు దీక్షలు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గండేడ్, న్యూస్‌లైన్: కూరగాయలు తీసుకురావడానికి సంతకు బయలుదేరిన ఓ వ్యక్తి మార్గంమధ్యలో మృత్యువాత పడ్డాడు. బైకును లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని మొకర్లాబాద్ మలుపులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మొకర్లాబాద్ ముందు తండాకు చెందిన లింబ్యానాయక్ (45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య తులసీబాయి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ భారమవడంతో ఆయన ముంబైకి వలస వెళ్లాడు. ఇటీవల తిరిగి గ్రామానికి వచ్చి వ్యవసాయం చూసుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం లింబ్యానాయక్ కూరగాయలు తీసుకురావడానికి బైకుపై మహమ్మదాబాద్ సంతకు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో మొకర్లాబాద్ వాగు సమీపంలో మలుపులో ఎదురుగా వస్తున్న లారీ ఈయన బైకును ఢీకొంది. ప్రమాదంలో లింబ్యానాయక్తో పాటు బైకు లారీ చక్రాల కిందపడిపోయింది. దీంతో ఆయన తలపగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. తండాకు సమీపంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. లింబ్యానాయక్ మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. తులిసీబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి.. మొక ర్లాబాద్ మలుపు ప్రమాదకరంగా మారిందని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ మలుపులో ప్రమాదాలు జరిగాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
బొత్స ఇల్లు ముట్టడి అడ్డుకున్న పోలీసులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనపై కిమ్మనకుండా ఉన్న జిల్లా నేతలపై సమైక్యాంధ్ర ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా నేతలపై ఇళ్లను ముట్టడిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ బుధవారం వారి ఇం టిని ముట్టడించారు. విభజన ప్రక్రియ వచ్చిన తర్వాత నుంచి పోలీసులు మంత్రి ఇంటి చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశా రు. వెనుకబడిన ఉత్తరాంధ్రపై అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నా సత్తిబాబు,ఎంపీ ఝాన్సీలక్ష్మిలు స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ కాంక్షతో ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు. బొత్స తీరుకు నిరసనగా జేఏసీ పిలుపులో భాగంగా తొలుత ఉద్యోగులంతా కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి బొత్స ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యం లో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవటంతో పాటు తోపులాట జరిగింది. ఒక దశలో బొత్స తీరును నిరసిస్తూ ఉద్యమకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు.దీంతో పోలీసులు వారిని అడ్డు కున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు సత్తిబాబు, ఝాన్సీలకు వ్యతిరేకంగా నినదిం చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా కనుమరుగవుతారన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. సమైక్యాంధ్ర కు మద్దతుగా రాజీనామా చేసే ప్రజాప్రతిని ధులను గెలి పించుకుంటామని, లేని పక్షంలో విజయనగరంలోఅడుగు పెట్టనివ్వమని హెచ్చ రించారు. ప్రజామోదం ఉన్నప్పుడే పదవులు వస్తాయన్న వాస్తవాలను గ్రహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరన్న వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధుల ఇంటికి ఆందోళన కారులు వెళ్లిన సమయంలో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని, అందుబాటులో ఉండే ఉద్యమకారుల వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారన్నారు. ఈ జిల్లాలో మాత్రం బొత్స అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగులకు కూడా ఉద్వేషకారులుగా చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బొత్స దంపతులు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అంతవరకు ఉద్యమాలు నిరంతరంగా కొనసాగుతాయని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రభూజీ, గౌరీశంకర్, కొట్నాన శ్రీనివాసరావు, కృష్ణవేణి, గిరిబాల, రాము, పిడపర్తి సాంబశివశాస్త్రి పాల్గొన్నారు. డీఎస్పీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బొత్స, సోనియా, కేసీఆర్ చిత్రపటాలకు పిండప్రదానం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో మిన్నంటుతున్న ఉద్యమ సెగలు కాంగ్రెస్ నాయకులకు, సమైక్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినవారికి గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతి పల్లెలో ఆందోళన కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. వీధివీధిలో సమైక్య నినాదం హోరెత్తుతోంది. ప్రతిరోజూ వినూత్న తరహాలో ఉద్యమాలు చేపడుతూ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎత్తు బ్రిడ్జి వద్ద వంటా-వార్పు కార్యక్రమం చేపట్టిన అనంతరం కేసీఆర్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియా, బొత్స చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు. విజయనగరం విద్యుత్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా విద్యుత్ ఉద్యోగుల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో దాసన్నపేట విద్యుత్ భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాసోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంబీపాకం శిక్ష విధించారు. ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పాఠశాలల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 50 స్కూల్ బస్సులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. డీసీసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హోమం నిర్వహించగా... టీడీపీ ఆధ్వర్యంలో మెసానిక్ టెంపుల్లో రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీ కాలనీవాసులు జిల్లా కోర్టు వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా రహదారి పైకి వచ్చి వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. పలువురు మహిళలు కబడ్డీ ఆడగా, యువకులు రహదారిపైనే క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీరకట్టులో ఉన్న ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో స్పందించిన ఎస్పీ ప్రత్యేక బలగాలను తీసుకువెళ్లి ఉద్యమకారులను చెదరగొట్టారు. మునిసిపల్ ఉపాధ్యాయ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ వీధుల్లో తిరిగారు. ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలు చేతబూని మానవహారం నిర్వహించారు. భోగాపురం మండలంలో మహరాజుపేట జంక్షన్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై వేలాది మంది ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు రోడ్లపైనే వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర, దహన సంస్కారం చేశారు. విజయనగరం - పాలకొండ ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటలకు వందలాది మందికి ప్రధాన రహదారిపై భోజనాలు వడ్డించారు. పెదనడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చీపురుపల్లి వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. నెల్లిమర్లలో వైద్యవిద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టి, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్.కోటలో దేవి జంక్షన్ వద్ద విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్‌వద్ద ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు రోడ్డుమీదే విద్యాబోధన చేశారు. పురిటిపెంట గ్రామం న్యూకాలనీకి చెందిన పి.రాము అనే సమైక్యవాది భవానీమాలతో విజయవాడకు కాలి నడకన బయలుదేరారు.బొబ్బిలిలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణరంగారావు ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. సాలూరు, పార్వతీపురం, పెద్దపెంకి, సీతానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాంలో కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇంటి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే సమైక్య వాదానికి కట్టుబడి మూడు రోజుల క్రితమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు ఆ పత్రాన్ని పంపినట్టు నెల్లిమర్ల ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రకటించారు. రాష్ట్ర విభజన విషయం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భోగాపురం మండలంలో మహరాజుపేటజంక్షన్ వద్ద ఆయన తెలిపారు. -
వైఎస్సార్సీపీకి కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా
కుత్బుల్లాపూర్,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీ నిర్ణయం సరిగ్గాలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షాపూర్‌నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ అభిమానులు, శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకే పార్టీ వీడుతున్నానని, తనకు రాజకీయగురువు ఎప్పటికీ వైఎస్ రాజశేఖర్రెడ్డియేనని స్పష్టం చేశారు. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. -
అవసరం తీరింది మరి..!
వరంగల్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల ముందు గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించిన సర్కారు... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే కోతలను అమలు చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి కరెంట్ సరఫరాలో కోతలు ఎక్కువయ్యాయి. పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసినప్పుడు మాత్రమే గ్రామాలకు ఇస్తున్నారు. సింగిల్ ఫేజ్ లైన్లకు పగలంతా మొత్తం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలకు ఇచ్చే కరెంట్ కేవలం 4గంటలు మాత్రమే. పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం గ్రామాల్లో ఓట్లను రాబట్టుకునేందుకు విద్యుత్‌ను ఎరగా వేసింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కరెంట్ పూర్తిస్థాయిలో ఇవ్వడంతో అక్కడ అధికార పార్టీకి మొగ్గు ఉంటుందని భావించిన సర్కారు.. పగలు, రాత్రి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని గ్రామాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేశారు. పట్టణాల్లో కొంత సమయం కోతలు విధించినప్పటికీ... గ్రామాలకు మాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా తేడా రాకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని ఫీడర్లకు ఒకే విడతలో ఏడు గంటలు సైతం సరఫరా చేశారు. రాత్రిపూట ఇచ్చే కరెంట్‌ను అదనంగానే పరిగణించారు. అయితే విద్యుత్ వాడకం తక్కువగా ఉండటంతో... గ్రామాలకు పూర్తిస్థాయిలో కరెంట్ ఇస్తున్నట్లు సర్కారు, డిస్కంలు ప్రకటించాయి. ఇప్పుడేమైందంటే... పంచాయతీ ఎన్నికలు ముగిసిన మరునాడు నుంచి గ్రామాల్లో విద్యుత్ కోతలు పునరావృతమయ్యాయి. ఈ విషయం గ్రామాల్లోని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు సింగిల్‌ఫేజ్ సరఫరా నిలిపివేస్తుండగా... 9 గంటలకు త్రీఫేజ్ సరఫరా ఇస్తున్నారు. మధ్యాహ్నం 1గంటకు మళ్లీ సరఫరాకు బ్రేక్ వేసి... సాయంత్రం 6 గంటలకు తిరిగి సింగిల్‌ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకోవడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతోందని, కోతలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కోత పంచాయతీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే అమల్లో పెడుతున్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన 26 రోజుల పాటు గ్రామాల్లో సరఫరాలో ఎలాంటి బ్రేక్డౌన్లు లేవు. కానీ... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే సరఫరా ఆపేస్తున్నారు. సంగెం మండలం గాడెపల్లిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో కేవలం నాలుగు గంటలు సరఫరా ఇచ్చారు. ఈ నాలుగు గంటల వ్యవధిలో దాదాపు పది సార్లు పది నిమిషాల పాటు ఈఎల్ఆర్(ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్) తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా అడపదడపా కోత పెట్టారు. అయితే ఇటీవల వరుసగా వానలు కురువడంతో ప్రస్తుతం రాత్రి విద్యుత్ వినియోగం అంతగా లేదని అధికారులే చెబుతున్నారు. కానీ, గ్రామాలకు కోతలు మాత్రం యథావిధిగానే అమలు చేస్తున్నారు. పగలు రెండు గంటలే గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కరెంట్‌ను కోతలు లేకుండా ఇచ్చారు. ఎన్నికలు కాగానే కోతలు విధిస్తున్నారు. ఆ సమయంలో వర్షాలు కురిసినవి వ్యవసాయానికి అవసరం లేదు. ఇప్పుడు వరినారు పెరిగింది. నాటు వేసే సమయంలో కరెంట్ కోతలు విధిస్తున్నారు. పగటిపూట కేవలం రెండు గంటలే ఇస్తున్నారు. అది కూడా ప్రతి పది నిమిషాలకొకమారు ట్రిప్పు అవుతున్నది. దోణి తడవడం లేదు, దోయ్యపారడం లేదు. ఇంటికిచ్చే కరెంట్ అయితే పొద్దంతా బుగ్గ వెలగడం లేదు. అప్పుడప్పుడు వస్తంది... మళ్లా పోతాంది. - జాటోత్ వాగ్యానాయక్, జాజోత్ తండా, సంగెం -
పెళ్లి ఇంట్లో చావుబాజా
సోంపేట, న్యూస్‌లైన్: మరో పదహారు రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఒకే ముహూర్తానికి ఇద్దరి అన్నదమ్ములకు పెళ్లి జరగాల్సి ఉండడంతో కుటుంబ సభ్యులందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంటికి రంగులు వేశారు. పొలం పనులు పూర్తి చేస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందన్న తరుణంలో విధి వక్రించింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కాటేసింది. పెళ్లి ఇంట్లో విషాదం నింపింది. ఇది జింకిభద్ర గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తామాడ కృష్ణవేణికి రమేష్, భీమారావు, మహేష్ ముగ్గురు కుమారులు. రమేష్ సింగపూర్‌లోను, భీమారావు కువైట్‌లో ఉద్యోగాలు చేస్తుండగా, చిన్నవాడైన మహేష్ తల్లికి తోడుగా గ్రామంలో ఉంటున్నాడు. ఈ నెల 24న రమేష్, భీమారావుకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రమేష్.. అదే గ్రామానికి చెందిన సంగారు ఈశ్వరరావు అక్క నీలవేణి ఇంటికి మంగళవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బారువ వెళ్తూ అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టారు. దీంతో పెళ్లి కొడుకు రమేష్(27)అక్కడికక్కడే మృతి చెందగా, ఈశ్వరరావు కాలు విరిగిపోయింది. ఆయన ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. రమేష్ సోదరుడు భీమారావు ఈ నెల 9న కువైట్ నుంచి గ్రామానికి చేరుకోనున్నాడు. ఇంతలో ప్రమాదం జరగడంతో తల్లి కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భర్త మరణించి ఏడాది పూర్తయిన వెంటనే చెట్టంత కొడుకును మృత్యువు కబళించడంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. క్షతగాత్రుడు ఈశ్వరరావును బారువ పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రమేష్ మృతదేహానికి బారువ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో జింకిభద్ర గ్రామంలో చురుగ్గా తిరుగుతూ అందరితో కలవిడిగా ఉండే తామాడ రమేష్ మృతిచెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. రమేష్ సింగపూర్ నుంచి పెళ్లికోసం ఆరునెలలు క్రితం స్వగ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. పెళ్లిపనులు చేసుకుంటున్న యువకుడిని మృత్యువు కబళించిందంటూ వాపోతున్నారు. మంగళవారం ఉదయం రమేష్ ఎకరా పొలంలో దమ్ముచేసి నాట్లు వేయించాడని, తెల్లారే సరికి ఇలా విగతజీవిగా మారడాన్ని తట్టుకోలేకపోతున్నారు. -
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో.. తమ నియోజకవర్గాల్లో సమైక్య రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నా.. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ తలపై తడిగుడ్డ వేసుకుని నిమ్మళంగా కూర్చున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్, ఢిల్లీల్లో లాబీయింగ్ పేరుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలకు ‘తందాన’ అంటూ డ్రామాలాడుతూ తమను ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.గత ఎనిమిది రోజులుగా ఉద్యమ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా అధికార పార్టీ నేతలు స్పందిం చకపోగా ఉద్యమకారులకు వెరచి తమ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు రాజీనామా చేసినా.. ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికి పంపడాన్ని కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామాలో భాగమని సమైక్యవాదులు అనుమానిస్తున్నారు. కాగా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే తమ భవి ష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పదవులను కాపాడుకునే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళీ, శత్రుచర్ల విజయరామరాజులు ఎమ్మెల్యేలతో మాట్లాడి సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. పైగా ఉద్యమకారుల ముట్టడి నుంచి తప్పించుకునేం దుకు కృపారాణి, కోండ్రు మురళీలు తమ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించుకున్నారు. అధిష్టాన దేవతలైన ఇందిర, రాజీవ్ విగ్రహాలకు సైతం పోలీసు కాపలా పెట్టించారు. నేతల తీరుపై ఆగ్రహం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై సమైక్యాంధ్ర ఆందోళకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నపాటి సాహసం కూడా చేయలేని దుర్బలులు మన నేతలని దుయ్యబడుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు సమైక్య ఉద్యమంపై ఏమాత్రం నోరుమెదపడం లేదని విమర్శిస్తున్నారు. ఇక ఢిల్లీలో తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అధిష్టానం చెప్పేదానికి తలూపుతున్నారని, ఇటువంటి నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మంత్రుల ఇళ్లకు, నేతల విగ్రహాలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అధిష్టానానికి ఎదురుతిరిగే ధైర్యం లేని ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుంది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తమను వచ్చే ఎన్నికల్లో వారు ఓట్లు వేయరేమోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. -
సీబీఐ కేసులో సబితకు ఊరట
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు మాజీ మంత్రి సబితారెడ్డికి ఊరట లభించింది. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోను బుధవారం న్యాయస్థానం కొట్టేయడంతో ఆమెకు ఉపశమనం కలి గింది. సాక్షులను ప్రభావితం చేసేలా మీడియా తో మాట్లాడారని అభియోగాన్ని మోపిన సీబీ ఐ.. మంత్రులు సబిత, ధర్మాన ప్రసాదరావును జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పును ప్రకటించింది. మంత్రులు తప్పుగా మాట్లాడలేదని పేర్కొంటూ జ్యుడిషియల్ కస్టడీని నిరాకరించింది. దీంతో కొన్నాళ్లుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న సబితకు ఓదార్పు లభించింది. దాల్మియా సిమెంట్ కం పెనీకి గనుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించామని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుం టామని’ స్పష్టం చేశారు. మంత్రుల వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని పే ర్కొంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జగన్ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడం, తమను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేయడం సబిత శిబిరంలో ఆందోళన రేపింది. సీబీఐ కేసు అనంతరం మంత్రి పదవికి రాజీ నామాచేసిన సబిత... మునుపటిలా జిల్లా రాజ కీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు సైతం దూరం పాటించారు. ఈ తరుణంలో తాజాగా న్యాయస్థానం తీర్పు ఆమెకు కాసింత ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైరాశ్యంలో కూరుకుపోయిన ఆమె వర్గీయులకు ఈ వార్త సంతోషాన్ని కలిగించింది. -
సంబరానికైనా...సమరానికైనా సై
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం సంబరానికైనా...సమరానికైనా సమన్వయంతో పోరాటానికి సిద్ధం గా ఉన్నామని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ తదితర సీమాంధ్ర పార్టీలు ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తూ నిరసనలు చేపడుతున్నాయని మం డిపడ్డారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ సాధించే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. పార్టీని జిల్లాలో సమన్వయం చే సేందుకే ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని, ఎవరిపైనో పెత్తనం కోసం కాదన్నారు. అందరినీ కలుపుకొని సమష్టిగా ముందుకెళ్తామన్నారు. కొంతమంది టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం ఎప్పుడు చేస్తారంటూ చర్చ జరుపుతున్నారని, లక్ష్యసాధనలో అనేక గాయాలయ్యాయని, ఇంకా అవిమానలేదని, అనేక త్యాగాలు, అవమానాలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నామని ఈ స్థితిలో విలీనం గురించి చర్చించడం సరైం దికాదన్నారు. ఢిల్లీలో కొందరు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన దానిపై విషప్రచారం చేస్తూ కుట్ర లు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా అమర్సింగ్లుగా మారే యత్నాలు మానుకోవాలని సూ చించారు. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లుగానే మునిసిపల్, జడ్పీ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే సీఎం, డీజీపీలదే పూర్తి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు బొకేలతో పెద్దిని అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు కన్నెబోయిన రాజయ్యయాదవ్, నాయకులు గుడిమల్ల, ఇండ్లనాగేశ్వర్రావు, మర్రి యాదవరెడ్డి, కమరున్నీసా, లలితాయాదవ్, రహీమున్నీసా, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, డిన్నా, సంపత్, శ్యామ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే ఉంటా : చందూలాల్ ఢిల్లీకి వెళ్లిన తాము దిగ్విజయ్‌సింగ్‌ను కలిస్తే దానిపై విషప్రచారం చేస్తున్నారని, తాను టీఆర్ఎస్తోనే ఉంటానని మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్ స్పష్టం చేశారు. దిలీప్ద్వారా అజిత్‌సింగ్‌ను కలిశామని అక్కడి నుంచి దిగ్విజయ్‌సింగ్ వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. తమ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, ఏ పార్టీలో ఉన్నా అంకితభావంతో పనిచేశామన్నారు. -
వీధుల్లోకి విస్తరించిన సమైక్య ఉద్యమం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. పట్టణాలు, గ్రామాలను దాటి వీధుల్లోకి సైతం విస్తరిం చింది. నిన్నటిదాకా యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనగా బుధవారం నుంచి మహిళలు, పెన్షనర్లు, రైతు లు సైతం రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో జేఏసీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలవారు ర్యాలీలు నిర్వహించారు. సోనియాగాంధీ దిగివచ్చేలా ఉద్యమం కొనసాగించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ గణాంక విభాగం ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. మహిళా న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేశారు. జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులు డే అండ్ నైట్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులు, ప్రజాప్రతి నిధుల తీరును ఎండగట్టారు. జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు మూడో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన పాలకొండలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు డిపో ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌కు హాజరైన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. పాలకొండ మం డలం కొండాపురం వద్ద గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించగా, పాలకొండ-విశాఖ ప్రధాన రహదారిపై గోపాలపురం గ్రామస్తులు వంటా, వార్పు చేసి క్రికెట్ ఆడారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొండ డివి జన్ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. వీరఘట్టం మండలం నడుకూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఐసీడీఎస్ యంత్రాంగం ఈ కార్యక్రమా న్ని ప్రైవేటు స్థలంలో నిర్వహించింది. భామినిలో మహిళా సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల రిలే నిరాహారదీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. పాతపట్నంలో 60 అడుగుల జాతీయ పతాకంతో మహిళలు, జేఏసీ సభ్యులు, ఎన్జీవో సంఘ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కేసీఆర్‌ను గాడిదగా అభివర్ణిస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జేఏసీ నేతలు పంచాయతీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నినాదాలతో దద్దరిల్లిన పలాస పలాసలో వివిధ వర్గాల వారు చేపట్టిన ర్యాలీ లు మూడు రోడ్ల కూడలికి చేరినపుడు ఉద్యమకారులు చేసిన నినాదాలతో పట్టణం దద్దరి ల్లింది. అక్కడ సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు మౌన దీక్ష చేపట్టారు. ఎన్జీవోలంతా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. వజ్రపుకొత్తూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎచ్చెర్ల బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులు 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శాంతిహోమం నిర్వహించారు. జాతీయ రహదారి డివైడర్‌పై సీతారామలక్ష్మణుల ప్రతిమలతో పాటు శివలింగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ప్రార్థిస్తూ పూజలు జరిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యమకారుల డిమాండ్‌కు తలొగ్గిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాలనీలంకఠంనాయుడు పదవికి రాజీనామా చేశారు. తద్వారా జిల్లాలో అలా చేసిన తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలిచారు. రాజాంలో వివిధ వర్గాల వారు ర్యాలీలు నిర్వహించారు. నరసన్నపేటలో న్యాయవాదులు విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో లైన్స్‌క్లబ్, ఐసీడీఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తల్లిపాలవారోత్సవాల వద్దకు వెళ్లి ర్యాలీలో పాల్గొనాలని అక్కడున్నవారిని కోరారు. అనంతరం పాతబస్టాండ్ మీదుగా ఆర్టీసీ కాంప్టెక్స్ వరకూ ర్యాలీగా వెళ్లి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రణస్థలం, కోష్ఠ, పైడిభీమవరం, పాలకొండ, ఆమదాలవలసల్లో బంద్ సంపూర్ణం సంతకవిటి మండలంలో ఆదర్శ యువజన సం ఘాల సభ్యులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేయగా గుళ్లసీతారామపురంలో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రణస్థలం, కోష్ఠ, పైడిభీమవరం, పాలకొండ, ఆమదాలవలసల్లో సంపూర్ణ బంద్ జరిగింది. ఆమదాలవలసలో లగేజీ వ్యాన్లతో యాజమానులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ ఉద్యమం చేపట్టారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పొందూరులో సోనియా, బొత్స దిష్టిబొమ్మలను దహనం చేశారు. సరుబుజ్జిలి, రొట్టవలస, షలంత్రిలలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. సరుబుజ్జిలిలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుబుజ్జిలి జంక్షన్లో విద్యార్థులు రెండు గంటలసేపు రహదారిని దిగ్బంధిం చారు. బూర్జ మండలం లచ్చయ్యపేట, ఉప్పినివలసల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహిం చారు. పొందూరు మండలం లైదాం, మలకాం గ్రామాల్లో విద్యార్థులు సోనియా, బొత్స దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు. ఇచ్ఛాపురంలో కొవ్వొత్తులతో ప్రదర్శన ఇచ్ఛాపురంలో ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. సోంపేటలో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. గాంధీ మండపం వద్ద మానవహారం నిర్వహించారు. టెక్కలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు. -
కాజ కోదండ రామాలయంలో చోరీ
కాజ(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్ : కాజ గ్రామంలోని కోదండ రామస్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు చొరబడి రూ.3.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్చకుడు సత్య ప్రసాద్ ప్రతి రోజు మాదిరిగా బుధవారం ఉదయం 5 గంటలకు దేవస్థానానికి చేరుకున్నాడు. దేవస్థానం లోపల తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. ఉత్సవ విగ్రహాల వద్దకు వెళ్లి పరిశీలించగా ఆరు వెండి కిరీటాలు, నాలుగు బంగారు మంగళ సూత్రాలు, వెండి చటారి, బంగారు నెక్లెస్, స్వామి వారి వెండి పాదాలు, వెండి ధనస్సు, వెండి బాణం, రెండు ఉత్తర జంధ్యాలు, వెండి పంచపాత్రలు చోరీ అయినట్టు గుర్తించారు. విషయాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కృపాల్‌రెడ్డికి తెలియజేసి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు, రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, ఎస్ఐ వై.సత్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని దేవస్థాన ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించారు. వేలిముద్రల విభాగం అధికారి కె.వెంకటేశ్వరరావు, క్లూస్ ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేలిముద్రల ఆధారాలను సేకరించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న పడమట దేశమ్మ తల్లి, శ్రీకృష్ణుని మందిరాల్లో కూడా బుధవారం తెల్లవారుజామున దొంగలు హుండీలను పగులగొట్టి వాటిలోని నగదు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రతి రోజూ రాత్రి వేళ పోలీస్ సిబ్బంది గ్రామంలో ప్రత్యేక గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంచార జాతికి చెందిన ఓ ముఠా దేవాలయాల దోపిడీలకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారం వుందన్నారు. -
రూ. 52.54 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు నెల రోజులుగా కూలి డబ్బులు ఆగిపోయాయి. జిల్లాకు రావాల్సిన మొత్తం రూ. 52.54 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎన్నికల కోడ్.. ఉపాధి హామీ పనులకు అడ్డంకి కాకపోయినా కోడ్ కారణంగానే డబ్బులు ఆగిపోయినట్లు క్షేత్ర స్థాయి ఉద్యోగులు కూలీలను మభ్యపెడుతున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి నుంచే నిధులు విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. వారానికోసారి ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బు రాకపోవడంతో దాదాపు 31వేల మంది కూలీలు దిక్కులు చూస్తున్నారు. మరోవైపు పే ఆర్డర్లు ఆన్లైన్లో అప్డేట్ చేసినప్పటికీ డబ్బులు జమ కావడం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం... ఉపాధి పనులు చేసే కూలీలకు వారం రోజుల వ్యవధిలోనే డబ్బులు చెల్లించాలి. వేతనాల చెల్లింపులో ఆలస్యమైతే సంబంధిత క్షేత్రస్థాయి ఉద్యోగులు మొదలు ప్రాజెక్టు ఆఫీసర్ల వరకు బాధ్యత వహించాలి. 14 రోజులకు మించి ఆలస్యమైతే అందుకు బాధ్యులైన అధికారులకు 0.3 శాతం చొప్పున జరిమానా విధించాలి. ఇవన్నీ పక్కన బెట్టినట్లుగా... నెల రోజులుగా సర్కారు ఉపాధి నిధులను ఆపేయడంతో అటు ఉద్యోగుల్లోనూ... ఇటు క్షేత్రస్థాయిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం నాటి ఆన్లైన్ నివేదికల ప్రకారం జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 31308 పే ఆర్డర్లకు బిల్లులు నిలిచి పోయాయి. అందుకు సంబంధించి దాదాపు రూ.52.54 కోట్ల చెల్లింపులు ఆలస్యపు జాబితాలో చేరిపోయాయి. నిబంధనల ప్రకారం ఈ ఆలస్యానికి బాధ్యులైన ఉద్యోగులకు రూ.75.95 లక్షలు జరిమానా విధించి వారి వేతనాల్లో కోత వేయాలి. పేమేంట్ ఏజెన్సీలు ఆలస్యం చేసినా సరే.. ఇదే నిబంధన వర్తిస్తుంది. ఆలస్యానికి తమ వంతు వాటాగా రూ.16.43 లక్షలు ఏజెన్సీలకు కోత వేయాలి. ఈ ఆలస్యపు చెల్లింపులకు తగిన కారణాలను... ఉద్యోగుల వివరణలను పరిశీలించిన ప్రాజెక్టు డెరైక్టర్ రూ.15.99 లక్షల జరిమానాలను తిరస్కరించారు. రూ.10.53 లక్షల జరిమానాలకు ఆమోదం తెలిపారు. మిగతా రూ.65.86 లక్షల జరిమానా ఫైళ్లు ప్రాజెక్టు డెరైక్టర్ పరిశీలనలో ఉన్నాయి. ఈ లెక్కన ఉపాధి నిధుల చెల్లింపు ఇష్టారాజ్యంగా సాగుతోందని రూఢీ అవుతోంది. ఇప్పటికే ఎంపీడీవోల పరిధి నుంచి ఈ పథకాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల కో డ్ పేరిట నిధులు ఆగిపోయిన తీరు గందరగోళానికి తెర లేపుతోంది. కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల ఎంపిక సైతం గాడి తప్పుతోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ పచ్చతోరణం, మహా త్మాగాంధీ వన నర్సరీ, పండ్లతోటల పెంపకం తప్ప మిగతా పనులేవీ చేపట్టకుండా ఆంక్షలు విధించారు. దీంతో పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకాల్లో చేప ట్టే పనులన్నీ రైతులకు తప్ప కూలీలకు ఉపయుక్తంగా లేవనే విమర్శలు వస్తున్నాయి. -
12 గ్రామ పంచాయతీల తుదిపోరుకు సమాయత్తం
సాక్షి, నరసరావుపేట: జిల్లాలోని 12 గ్రామ పంచాయతీలకు, 118 వార్డులకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాఅధికారులు సమాయత్తమయ్యారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు, కండ్లకుంట, వినుకొండ మండలం అందుగులపాడు, ఈపూరు మండలం ఊడిజర్ల, గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లిఅగ్రహారం, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, గుంటూరు డివిజన్లోని చల్లావారిపాలెం గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. 40 మంది సర్పంచ్ అభ్యర్థులు, 118 వార్డులకు 260 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,264మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. నేడు ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో శిరిగిరిపాడు, కండ్లకుంట, తూబాడు, రొంపిచర్ల, ముత్తనపల్లి, ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం పంచాయతీలు అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో ఈ గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు జరుగుతాయనే కారణంతో ఇక్కుర్రు, రొంపిచర్ల, ముత్తనపల్లి, తూబాడు, శిరిగిరిపాడు, కండ్లకుంట పంచాయతీలకు ఎన్నికలను కలెక్టర్ సురేశ్‌కుమార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత నెలకొని ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగ్రామం తూబాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో లేకపోవడం గమనార్హం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నరసరావుపేట, గురజాల డీఎస్పీలు వెంకటరామిరెడ్డి, పూజ తెలిపారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీలతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 968 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. రొంపిచర్ల: ఎన్నికలు జరుగనున్న ముత్తనపల్లి, రొంపిచర్ల గ్రామాల్లో పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. -
బాలికల గురుకుల వసతిగృహంలో ప్రబలిన అంటువ్యాధులు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ (కస్తూర్బా) బాలికల గురుకుల వసతిగృహంలో అంటువ్యాధులు ప్రబలాయి. దాదాపు 20 మంది బాలికలు చేతులకు, కాళ్లకు చీము పుండ్లతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ వసతి గృహంలో 147 మంది బాలికలు చదువుకుంటున్నారు. వసతి గృహ ంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు గదులు ఇరుకుగా ఉండి బాలికలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాగా వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అంటువ్యాధులు మరింత మంది బాలికలకు ప్రబలే ప్రమాదం ఉంది. వసతి గృహంలోనే ఉండి బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఏఎన్ఎం అనురాధ కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వీరికి వెంటనే వైద్య సౌకర్యం అందలేదు. మొదట్లో నలుగైదుగురు విద్యార్థినిలకు మాత్రమే చేతులు, కాళ్లకు పుండ్లు ఏర్పడగా ఆ తర్వాత 20 మంది బాలికలకు ఈ అంటువ్యాధి సోకింది. బుధవారం వీరిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్సకు వచ్చిన వారిలో పలువురు బాలికలు జ్వరంతో కూడా బాధపడుతున్నారు. వీరిలో టి. మహేశ్వరి అనే ఏడో తరగతి బాలిక విపరీతమైన జ్వరంతో పాటు చేతి వేళ్ల మధ్య పుండ్లతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఐదో తరగతి చదువుతున్న వనిత అనే బాలిక పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపించినా ఫలితం లేకపోవడంతో మహేశ్వరిని బుధవారం సాయంత్రం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా వసతి గృహం వార్డెన్ దశరాథరామిరెడ్డి మాట్లాడుతూ ..ఏఎన్ఎం విధులకు రాకపోవడం వల్ల బాలికలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. వసతి గృహంలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, కొద్ది మంది బాలికలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. -
గుంటూరులో సమైక్యాంధ్ర జేఏసీ ధర్నా
పాఠశాలలో ఆడుతూ పాడుతూ అక్షరాలు నేర్వాల్సిన చిన్నారి రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుంది. పాఠాల్లో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నారన్న ఆందోళన నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల్లో కనిపించింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని ఇన్నాళ్లూ అభివృద్ధిపై కన్న కలల్ని యూపీఏ ఛిద్రం చేసిందని సీనియర్ సిటిజన్లు ఆవేదన చెందుతున్నారు. ఇదే అభిప్రాయాలతో వైద్యులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఇలా అందరూ సమైక్యాంధ్ర విభజనపై కదం తొక్కుతున్నారు.. రాజకీయ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యంగా అడుగులేస్తుండగా, ప్రజాసంఘాలు తమ ఉద్యమ పంధాను వీడనాడకుండా నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమ ఆందోళనలతో బుధవారం కూడా జిల్లా అట్టుడికింది. మున్సిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె కొనసాగుతుంది. తాడేపల్లిలో మున్సిపల్ ఉద్యోగులు శిరోముండన చేయించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు రెండోరోజుకు చేరాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్లు, పారిశుద్ధ్య ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా తరువాత ఆటాపాటా కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞాన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ నుంచి హిందూకళాశాల సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో, ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి శంకర్‌విలాస్ సెంటర్లో ధర్నా చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు. ఎంపీ రాయపాటి యువసేన కార్యకర్తలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. గుంటూరులో సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ సమావేశం.. విభజనకు నిరసనగా సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ బుధవారం గుంటూరులోని ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో సమావేశమైంది. మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఆ సంస్థ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. ఇక ఏపీఎన్జీవో సంఘం పిలుపుమేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది విధులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లు నిలిపివేసిన కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు, హమాలీలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూ కళాశాల సెంటర్లో నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక విజయరాజు ఆమరణ నిరాహార దీక్షబూనారు. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు తోపుడుబండ్లతో ర్యాలీ జరిగింది. టీడీపీ డ్రామాలాడుతోంది.. ఎమ్మెల్యే మస్తాన్‌వలి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి తన అనుచరులతో హిందూకళాశాల సెంటర్లోని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కొంతసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విభజనకు అనుకూలంగా అందజేసిన లేఖను బహిరంగపరిచారు. సమైక్య ఉద్యమంలో టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మర్రి రాజశేఖర్... చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ సందర్శించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమ ర్యాలీ జరిగింది. సత్తెనపల్లి, పెదకూరపాడు, మంగళగిరిలలో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ, జిల్లావ్యాపార సంఘాల ఆధ్వర్యంలో యూపీఏ అధినేత్రి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెనాలిలో జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు సమాధులు కట్టారు. వారి చిత్ర పటాలను దహనం చేశారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. -
నష్టాల బాటలో ఆర్టీసీ
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి. రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చాలా బస్సులు రద్దు తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
పడిపోయిన కూరగాయల వ్యాపారం
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: కూరగాయలు భయపెడుతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల కూరగాయలూ కిలో రూ.35పైనే పలుకుతున్నాయి. ఇటీవల టమాటా కాస్త దిగొచ్చినా మిగతా కూరగాయల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. సామాన్యులు మార్కెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ప్రతి కూరగాయను పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. నెల బడ్జెట్లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో ఏమేం వండాలో ముందుగానే లెక్కలు వేసుకుని కొనుగోలు చేస్తున్నారు. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్.. ఇలా సర్దుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కొనుగోలు చేస్తున్నారు. ఫ్రిజ్‌ల నిండా నింపుకొనే పరిస్థితికి టాటాచెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక పేదలు పచ్చళ్లతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు.. తీరా రైతుల పంటలు మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరి గిన ప్రతిసారి రైతులు ఆశతో సాగు ప్రారంభించడం.. నాలుగైదు నెల ల్లో పంట చేతికొచ్చాక ధరలు లేకపోవడం యేటా రివాజుగా మారిం ది. చేవెళ్ల మండలంలోని 30 పంచాయతీల పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు. కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి. చేవెళ్ల మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కొనలేని పరిస్థితి మార్కెట్లో కూరగాయల ధరలు చూస్తే భయమేస్తోంది. రోజురోజుకు ధరలు పైపైకి పోతున్నాయి. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పడు రెండు రకాల కూరగాయలు కూడా రావడంలేదు. రోజూ కూరలు కొనడం ఇబ్బందిగా ఉండి ఒకపూట పచ్చడితో తింటున్నాం. - కృష్ణ, చేవెళ్ల గ్రామస్తుడు వ్యాపారం కష్టంగానే ఉంది ఈ ధరల మూలంగా విక్రయాలు పడిపోయాయి. అందరూ పావుకిలో, అరకిలోకు మించి కొనడం లేదు. ఏ కూరగాయ ధర చెప్పినా ‘అంత రేటా..’ అని ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లాభాలు కూడా బాగా తగ్గిపోయాయి. - శ్రీను, కూరగాయల చిరువ్యాపారి