మారకపోతే...మార్చేస్తాం | we wll provide good education to students:collector | Sakshi
Sakshi News home page

మారకపోతే...మార్చేస్తాం

Published Wed, Aug 7 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

we wll provide good education to students:collector

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పదవ తరగతి పరీక్షల్లో పది జిల్లా పరిషత్ పాఠశాలల్లో, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ‘డి’ గ్రేడ్  ఫలితాలు రావటం బాధగా ఉంది. పేరెం ట్స్,స్టూడెంట్స్ నుంచి బాగా ఒత్తిడి ఉంది.. టీచర్లపై, హెచ్‌ఎంలపై చర్య లు తీసుకోండి. డిప్యూటీ ఈఓలు 15 రోజులకు ఒకసారి స్కూళ్లను విజి ట్ చేయాలి. అంతా బీఈడీ చేసిన వారినే పెట్టుకున్నాం. మన నిర్లక్ష్యంతో నే వేలాది మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు.’ అంటూ భారీ నీటిపారుదల మంత్రి పి సుదర్శన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొత్తగా నిర్మించిన పాఠశాలల్లో రూఫ్ ఇప్పుడే పాడైతే ఎలా? లీకేజీలున్నాయి. భవనాలు సరిగ్గా లేవు. ఎంక్వై రీ చేయించి చర్యలు తీసుకోండి. ఇది విద్యాశాఖ పరిస్థితి కాగా... విద్యుత్తూ అంతే ఉంది. ట్రాన్స్ ఫార్మర్ ఫీజ్‌లు పోతే పెట్టటం లేదు. అవి చెడిపోయినా అంతే! రైతుల గతి ఏమి కావాలి ? మున్సిపాలిటీలు, ఇరిగేషన్‌లో ఇదే పరిస్థితి ఉంది’. అని ఆవేదన వ్యక్తం చేసిన మం త్రి  వచ్చే సమావేశం నాటికి పరిస్థితులు మారనట్లయితే. అధికారులనే మార్చివేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
 
 మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో ఐదు శా ఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో మం త్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో గరం గరం చర్చతో అధికారులకు వణుకు పుట్టించారు. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేసి, విద్యార్థులకు మంచి బోధన అందించే విధంగా కృషి చేయాలని  మంత్రి అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రత్యేక తరగతుల ను నిర్వహించి ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటుపడాల న్నారు. ‘డి’ గ్రేడ్ సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్ల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణ విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కొన్ని చోట్ల గదులలో వర్షపునీరుతో పాటు పగుళ్లు ఏర్పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిం చే కాంట్రాక్టర్లను మార్చివేసి కొత్త వారికి పను లు అప్పగించాలన్నారు.పనులు పక్కాగా జరిగే విధంగా చూడాలన్నారు.
 
 విద్యుత్ అంతే...
 గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే అధికారులు  వెంటనే మరమ్మతులు చేయించాలని మంత్రి సూచించారు. బోధన్ మండలం ఎరాజ్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పంటలసాగుకు విద్యుత్‌ను ఏడు గంటలు నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు.
 
 నగరంలో వరద ఏల?
 నిజామాబాద్ నగర ప్రజలు వరదతాకిడికి గురయ్యారంటే ఆశ్చర్యంగా అనిపించిందని మంత్రి అన్నారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని వెంటనే తొలగించకపోవడం వల్ల కొన్ని కాలనీలు జలమయంగా మారాయన్నారు. ఈ విషయాన్ని సీఎం కూడా అడిగారని తెలిపారు. నగర పాలక సంస్థ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోతే వారిని మార్చవల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
 
 సంయుక్త విచారణ
 జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ పాఠశాల భవనాల కప్పుల లీకేజీలు,నాణ్యతపై  ఆర్‌అండ్‌బీ, నీటిపారుదలశాఖ అధికారులతో సంయుక్తంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖ  నిర్లక్ష్యంతో  పంచాయతీ ఎన్నికల సందర్భంగా సిబ్బంది ఇబ్బంది పడా ల్సి వచ్చిందన్నారు.విద్యుత్ అధికారుల కోసం సంబంధిత ఎన్నికల సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.దీంతో విధుల పట్ల ఆశ్రద్ధ వహించిన జుక్కల్ ఏఈని సస్పెండ్ చేసినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ నగేష్ తెలిపారు.
 
 ఖరీఫ్ సాగు పెంచాలి..
 వర్షాలు సమృద్ధిగా కురిసినందున ఖరీఫ్ సాగు పెంచాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాలకు 4.400 హెక్టార్లలో పంట దెబ్బతిందని, రైతులు శనగ పంట వేసుకునేలా అధికారులు సూచించాలన్నారు. రైతుల కోరిక మేరకు తిరిగి ఎరువులను, విత్తనాలను సరాఫరా చేయాలన్నారు. కౌలస్‌నాల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలన్నారు. జిల్లాకు మంజూరైన గోదాములు సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు నిండినందున వాటి నుంచి నీటిని చెరువులకు మళ్లించాలన్నారు. శ్రీరాం సాగర్ నీటిని గోదావరిలోకి వృథాగా పోనివ్వకుండా జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు మళ్లించి, 22టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసినట్లు వివరించారు. అలాగే వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను మరమ్మతులు చేయాలని మంత్రి సూచించారు.
 
  సమావేశంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, అదనపు జేసీ శేషాద్రి, జేడీఏ నరసింహ, ఇరిగేషన్ ఎస్‌ఈ భగవంత్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవీసుకన్య, డీసీఓ శ్రీహరి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నగేష్, డీఈఓ శ్రీనివాసచారి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, జిల్లా అధికారులు పాల్గొన్నా రు.
 
 అధికారుల్లో నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎస్సెస్సీలో ప్ర భుత్వ పాఠశాలల్లో ‘డి’ గ్రేడ్ ఫలితాలు వచ్చాయి. తరగతి గదులూ లీకేజీ అవుతున్నాయి.విద్యుత్ అధికారులు కనీ సం ట్రాన్స్‌ఫార్మర్లను రిపేరు చేయడం లేదు. జిల్లా కేంద్రంలో కాలనీలు జలమయం కావడానికి డ్రైనేజీల్లో చెత్త తీయకపోవడమే కారణం! అధికారులు మారక పోతే వారినే మార్చేస్తాం.
 - భారీ నీటిపారుదల మంత్రి సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement