![ఫ్రెష్‌లుక్‌కి పన్నీరు!](/styles/webp/s3/article_images/2017/09/5/81493233198_625x300.jpg.webp?itok=X0Gehoir)
ఫ్రెష్‌లుక్‌కి పన్నీరు!
ఆనందం
వేసవిలో చర్మంలోని నూనెగ్రంథులు యాక్టివ్‌గా మారుతాయి. ఎక్కువగా స్రవిస్తాయి. దాంతో ముఖం త్వరగా జిడ్డుగా మారతుంటుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే... నిమ్మరసం లేదా బత్తాయి లేదా కమలాపండు రసం ముఖానికి పట్టించి, ఆరిన తర్వత చన్నీటితో కడగాలి. తర్వాత ముఖానికి పన్నీటిని అద్దాలి.
రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా ఉంటుంది. బొప్పాయి పండు గుజ్జులో పన్నీరు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే ముఖం జిడ్డు వదిలి కాంతివంతంగా మారుతుంది. పుల్లటి పెరుగులో శనగపిండి, పన్నీరు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి.