ఎండవేడి వల్ల చర్మం కమలడం, మంటపుట్టడం సంభవిస్తుంది. చెమట, దుమ్ము జిడ్డు సమస్య వల్ల చర్మం నలుపురంగుకు మారుతుంది. ఈ సమస్య నివారణకు...
∙రెండు టీ స్పూన్ల నారింజతొక్కల పొడిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మానికి ఉపశమనంగా ఉండటమే కాకుండా నలుపు తగ్గుతుంది.
∙అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
∙కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని మచ్చలు తగ్గుతాయి.
∙రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం మచ్చలను తగ్గించుకోవచ్చు.
∙బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. కమిలిన చర్మం మీద బంగాళదుంప రసం రాస్తే ఉపశమనం ఉంటుంది. టాన్ సమస్య ఉండదు.
∙స్ట్రాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
∙రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.
ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం
Published Fri, Apr 13 2018 12:27 AM | Last Updated on Fri, Apr 13 2018 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment