నవ్వు చూస్తూ బతికేయొచ్చు | Kajal Aggarwal To Marry A Businessman Soon | Sakshi
Sakshi News home page

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

Published Sun, Nov 3 2019 3:03 AM | Last Updated on Sun, Nov 3 2019 3:03 AM

Kajal Aggarwal To Marry A Businessman Soon - Sakshi

హీరోయిన్‌ల పెళ్లి వార్తలు.. ఎన్నిసార్లు అవి అబద్ధమైనా.. నమ్మబుద్దే కాదు. లేటెస్ట్‌గా ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త బాజాభజంత్రీలతో కలిసి వినిపిస్తోంది. విషయమైతే నిజమేనట. ‘ఎవరమ్మా.. అతగాడు?’ అంటే మాత్రం కాజల్‌ క్లూ ఇస్తున్నారు తప్ప కంక్లూజన్‌ ఇవ్వడం లేదు! సగం చెప్పి వదిలేస్తున్నారు.అతడు బిజినెస్‌ మేన్‌ అట. ఆధ్యాత్మిక సంపన్నుడట. తనను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాడట.

‘అయితే పూల బిజినెస్‌ చేస్తుంటారా?’ అని అడిగితే.. పువ్వు రాలి ముత్యమైనట్లుగా నవ్వేస్తున్నారు కాజల్‌. ‘అబ్బ.. క్లియర్‌గా చెప్పండీ’’ అని గుచ్చి గుచ్చి అడిగితే.. తనే ప్రపంచంగా తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకునేవాడని.. మళ్లీ ఓ కిలకిల నవ్వు. ఎవరైనా అదృష్టవంతుడే. ఆ నవ్వు చూస్తూ బతికేయొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement