త్రీ మంకీస్ - 32 | malldi special story | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 32

Published Wed, Nov 19 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

త్రీ మంకీస్ - 32

త్రీ మంకీస్ - 32

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 32
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘పెళ్ళైన వారానికల్లా నీకు అన్నీ వచ్చేస్తాయి. టెన్ - గో గ్రోసరీ షాపింగ్. ఎలెవన్ - మీట్ ఈచ్  అదర్స్ ఫ్రెండ్స్. ట్వెల్వ్ - బ్రౌజింగ్ ఏ మ్యూజియం. థర్టీన్... లేవకు. ఇంకా ఎగ్జామినేషన్ పూర్తి కాలేదు. థర్టీన్ - గో సైట్ సీయింగ్ టుగెదర్. ఫోర్టీన్ - ఎక్సర్‌సైజ్ టుగెదర్. ఫిఫ్టీన్ - త్రో ఏ పార్టీ టుగెదర్. సిక్స్‌టీన్ - రైట్ లవ్ లెటర్స్ టు ఈచ్  అదర్. సెవెంటీన్ - ఈట్ డిన్నర్ బై కేండిల్ లైట్. ఎయిటీన్ - గో టు ఏ కాన్సర్ట్ టుగెదర్. నైన్టీన్ - వాచ్ ది సన్ సెట్. ట్వంటీ - సెండే ఫన్నీ కార్డ్. ట్వంటీ టు - షేర్ ఏ ప్రైవేట్ జోక్. ట్వంటీ ఫోర్ - హేవ్ యువర్ పిక్చర్ టేకెన్ టుగెదర్. ట్వంటీ ఫైవ్... ట్వంటీ ఫైవ్‌ది ఏమిటో తెలుసా వార్.. షేర్ ఏన్ ఐస్‌క్రీం కోన్... లే. వార్! నిద్రలే. నిద్రపోయావేంటి?’’
 ‘‘మీరు నన్ను హిప్నటైజ్ చేయలేదా?’’
 ‘‘లేదు.’’
 ‘‘చేశారనుకున్నాను.’’
 ‘‘మొత్తం నూట పదహారు ఉన్నాయి. మిగిలినవి రేపు.’’
 ‘‘కాని ఇవన్నీ నేను జైల్లో ఉండగా సాధ్యం కాదు కదా డాక్టర్.’’
 ‘‘మూలీ’’ కుడి చేతి చూపుడు వేలుని కొడతా అన్నట్లుగా ఆడిస్తూ చెప్పింది.
 ‘‘మూలీ.’’

‘‘నిజమే. కాని నువ్వు శాశ్వతంగా జైల్లో ఉండవు కదా? ఏదో ఓ రోజు బయటకి వస్తావు.’’
‘‘ఈ లోగా బెయిలు మీద కూడా బయటకి రావచ్చు కదా?’’
‘‘అవును. నీకు బెయిలిచ్చే మిత్రులు ఎవరైనా ఉన్నారా?’’
 ‘‘నన్ను ప్రేమించే ఒకామె ఉంది.’’
 ‘‘నువ్వు ఆల్‌రెడీ ప్రేమలో ఉన్నావా?’’ మూలిక నిరుత్సాహంగా చూస్తూ అడిగింది.
 ‘‘అవును. ఆమె పేరు మూలిక. మూలీ.’’
 ‘‘భయపెట్టేశావు. యస్ నీకు బెయిలు గురించి ఆలోచిస్తాను. కాని నేను జైల్ డాక్టర్‌గా ఉన్నంతకాలం రక్తసంబంధీకులకి తప్ప ఇతరులు ఎవరికీ బెయిల్ ఇప్పించకూడదు.’’
 ‘‘మీరు ప్రేమించిన వారికి కూడా?’’
 ‘‘నేను ప్రేమించిన వారికి కూడా’’ ఆమె నవ్వి చెప్పింది.
 ‘‘మీ కాబోయే భర్తకి కూడా?’’
 ‘‘నా కాబోయే భర్తకి కూడా. నీకీ ప్రపంచంలో బంధుమిత్రులు చాలామంది ఉంటారు కదా? వాళ్ళల్లో ఎవరైనా...’’
 ‘‘వారంతా ఇక్కడే ఉన్నారు. నేను ముందుగా బయటకి వెళ్తే వాళ్ళకీ నేనే బెయిల్‌ని ఇప్పించాలి.’’
 ‘‘సరే. రేపు మళ్ళీ కలుద్దాం. కబురు చేస్తాను.’’
 ‘‘అలాగే మూలీ.’’
 ‘‘సీయు వార్.’’
 ‘‘మీ దగ్గరో ఫైవ్ ఉందా?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఫైవ్? ఏం ఫైవ్?’’
 ‘‘ఫైవ్ హండ్రెడ్ రుపీస్. నా డబ్బంతా జైలర్ తీసేసుకున్నాడు. ఖర్చులకి బొత్తిగా లేవు.’’
 ‘‘వై నాట్?’’ ఆమె తన హేండ్ బేగ్ తెరిచి వంద రూపాయల నోట్లు ఐదు తీసి వానర్‌కి ఇచ్చి చెప్పింది.
 ‘‘చూశావా? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. లేకపోతే ఇంత డబ్బుని అప్పు ఇచ్చేదాన్నే కాదు. ట్వల్వ్ పర్సెంట్ వడ్డీని కూడా నేను ఛార్జ్ చేయడం లేదు... గార్డ్’’ పిలిచింది.
 అతను వచ్చాక చెప్పింది.
 ‘‘పేషెంట్‌ని అతని సెల్‌కి తీసుకెళ్ళు. రేపు మళ్ళీ ఎగ్జామిన్ చేయాలి.’’
 ‘‘యస్ డాక్టర్’’ చెప్పి అతను వానర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు.
 8
 ‘‘నాకు ఇక్కడ టీ నచ్చడం లేదు. ఆ వేణ్ణీళ్ళల్లో టీ వాసనే లేదు’’ సాయంత్రం జైల్ మెస్‌లోని వానర్ చెప్పాడు.
 ‘‘నాకూ ఇక్కడి చపాతీ నచ్చలేదు. నిన్న రాత్రి తిన్న చపాతీ అరగనే లేదు. పిండి పిండి. సరిగ్గా కాల్చలేదు. నేను బయటకి వెళ్ళగానే బావర్చీకి వెళ్ళి వేడి వేడి చపాతీని, బగారా బైంగన్‌తో నంచుకుని తింటాను’’ మర్కట్ చెప్పాడు.

  ‘‘నాక్కూడా ఉల్లి కారం పెట్టిన వంకాయ కూరని వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలని ఉంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘అవును. రెండో రోజుకే జైలంటే విరక్తి పుడుతోంది’’ కపీష్ చెప్పాడు.

 ఓ ఖైదీని మర్నాడు విడుదల చేయబోతున్న సందర్భంగా అతని బంధువులు జైలర్ అనుమతితో అందరికీ తలో లడ్డూని సరఫరా చేశారు. వానర్ లడ్డూని నోట్లో పెట్టుకుంటూండగా దుర్యోధన్ వాళ్ళ ముందుకు వచ్చి కూర్చుని చెప్పాడు.

 ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిలోని లడ్డూని పైకి విసిరినట్లుగా నటించి పైకే చూడసాగాడు. దుర్యోధన్‌తో సహా అంతా పైకి చూస్తూండగా దాన్ని దుర్యోధన్ తన అనుచరుడి వైపు విసిరేస్తే అందుకు సిద్ధంగా ఉన్న అతను దాన్ని లాఘవంగా పట్టుకున్నాడు.
 ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? ఆ. నోట్లో లేదు చూశావా? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు.

 దుర్యోధన్ తన టేబిల్ వైపు నడిచి వెళ్ళి తన అనుచరుడి దగ్గర నుంచి లడ్డూని అందుకుని దాన్ని తింటూ చెప్పాడు - ‘‘అరె! ఇది మళ్ళీ నా చేతిలోకే వచ్చిందే.’’
 అక్కడి ఖైదీలంతా గట్టిగా నవ్వారు. వానర్ మొహం కోపంతో ఎర్రబడింది.
 (హౌ టు ఎస్కేప్ ఫ్రం జైల్?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement