సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏం చేస్తున్నారు?
సెల్ఫ్ చెక్
అరవై ఏళ్లనగానే అందరికీ విశ్రాంతి గుర్తుకొచ్చేస్తుంది. కానీ, ఆ వయసులోనే అసలు కష్టం మొదలవుతుందన్న వాస్తవం అందరూ తెలుసుకోవాలి. బాధ్యతలు తీరిపోయాయి కదా అని వేళకింత తిని పడుకుంటే అనారోగ్యాలు. అలాగని ఇల్లు, బాధ్యతలు అంటే తట్టుకునే వయసు కాదు. వేళకు భోజనం, తగినంత వ్యాయామం, ఆందోళనలకు, ఆవేశాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాల్సిన వయసిది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి మనిషీ అరవై ఏళ్లు దాటాక సెకండ్ ఇన్నింగ్స్‌లో అడుగు పెట్టినట్టు. మరి ఈ వయసులో మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?
1. ఇన్నాళ్లు ఆఫీసు చుట్టూ తిరిగారు కాబట్టి, ఇప్పటి నుంచి బంధువుల, స్నేహితుల ఆహ్వానాలను మన్నించి కార్యక్రమాలకు వెళుతున్నారు.
ఎ. అవును బి. కాదు
2. బీపీ, షుగరు వంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఏడాదికోసారి వైద్యుల్ని సంప్రదించి అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎ. అవును బి. కాదు
3. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే పిల్లలు దగ్గరుండి చూసుకునే పరిస్థితి లేనపుడు అనవసరంగా బెంగ పడిపోకుండా మీ గురించి మీరే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం చేయించుకుంటారు.
ఎ. అవును బి. కాదు
4. అబ్బాయి పెళ్లి తర్వాత కూడా కోడలికి బాధ్యతలు అప్పగించకుండా అన్ని పనులూ, అభిప్రాయాలు మీరే చూసుకుంటూ అనవసరంగా ఆందోళనపడుతుంటారు.
ఎ. కాదు బి. అవును
5. వయసు మీద పడుతుందన్న ఆలోచనను పక్కన పెట్టి బాధ్యతలు తగ్గిన ఈ వయసులో ఎంత హుషారుగా గడపచ్చో ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో మీ తోటి మహిళలతో మీ భావాల్ని పంచుకుని మీరు చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకెళతారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’లు ఎక్కువగా వస్తే అరవై ఏళ్ల వయసులో కూడా మానసికంగా, శారీరకంగా హాయిగా ఉన్నట్టు. లేదంటే వృద్ధాప్యాన్ని శాపంగా భావించి మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకుంటున్నట్టు.