Ailments
-
మీ వంట ఆరోగ్యమేనా..?
సెల్ఫ్చెక్ మారిన జీవనశైలి, అందులోనూ ముఖ్యంగా ఆహారపు అలవాట్లు రకరకాల ఆనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో వంటగదిని, వండే విధానాన్ని సంస్కరించుకుంటే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. చక్కటి ఆహారపు అలవాట్లున్న ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. 1. కుటుంబ సభ్యుల వయసు, బరువు దృష్ట్యా వాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలో గమనించి ఆ రకంగా వండుతారు. ఎ. అవును బి. కాదు 2. ఇంటికి కావలసిన సరుకులు కొనుగోలు చేసేటప్పుడు పిల్లలు ఇష్టపడే రుచికరమైన వాటితోపాటు పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే కాయలు, గింజలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎ. అవును బి. కాదు 3. టైమ్ సరిపోవడం లేదని బయట ఆహారం మీద ఆధారపడితే దేహంలో ఫ్యాట్ నిల్వ చేరుతుందని వాటికి దూరంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 4. శుభ్రత, ఆరోగ్యం దృష్ట్యా ముక్కలు తరిగి ప్యాక్ చేసిన కూరగాయలను కొనడానికి ఇష్టపడరు. ఎ. అవును బి. కాదు 5. కూరగాయలను తరిగిన తర్వాత కడిగితే పోషకాలు నీటిలో కలిసిపోతాయని, ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాతే ముక్కలుగా తరుగుతారు. ఎ. అవును బి. కాదు 6. పోషకాహార నిపుణుల సూచనలను వీలయినంత వరకు ఆచరించడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనన్ని కేలరీలను అందించే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా అవసరమని తెలుసు. అందుకే ఇంటిల్లిపాదినీ వ్యాయామం చేయమని ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు 8. మూత లేకుండా ఉడికిస్తే ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి కాబట్టి, పోషకాలను నష్టపోని విధంగా వండడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. రోజుకు ఒకసారి మొలకలు, పండ్లు వంటి అర్కపక్వాలను (మంట మీద వండని ఆహారం) తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. జీర్ణవ్యవస్థ శుభ్రం అవడానికి వీలుగా వారానికోరోజు ఆహారాన్ని పరిమితంగా తింటారు లేదా పస్తు ఉంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాలలో ‘ఎ’లు ఏడు అంతకంటే ఎక్కువ వస్తే ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన ఉన్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువ వస్తే ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం లేదా రుచిగా భోజనం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థం. -
కడుపులో గ్యాస్... మిరియాల పొడితో చెక్!
హెల్త్ టిప్స్ గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెలు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గులకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పులను ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. -
సెకండ్ ఇన్నింగ్స్లో ఏం చేస్తున్నారు?
సెల్ఫ్ చెక్ అరవై ఏళ్లనగానే అందరికీ విశ్రాంతి గుర్తుకొచ్చేస్తుంది. కానీ, ఆ వయసులోనే అసలు కష్టం మొదలవుతుందన్న వాస్తవం అందరూ తెలుసుకోవాలి. బాధ్యతలు తీరిపోయాయి కదా అని వేళకింత తిని పడుకుంటే అనారోగ్యాలు. అలాగని ఇల్లు, బాధ్యతలు అంటే తట్టుకునే వయసు కాదు. వేళకు భోజనం, తగినంత వ్యాయామం, ఆందోళనలకు, ఆవేశాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాల్సిన వయసిది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి మనిషీ అరవై ఏళ్లు దాటాక సెకండ్ ఇన్నింగ్స్లో అడుగు పెట్టినట్టు. మరి ఈ వయసులో మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? 1. ఇన్నాళ్లు ఆఫీసు చుట్టూ తిరిగారు కాబట్టి, ఇప్పటి నుంచి బంధువుల, స్నేహితుల ఆహ్వానాలను మన్నించి కార్యక్రమాలకు వెళుతున్నారు. ఎ. అవును బి. కాదు 2. బీపీ, షుగరు వంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఏడాదికోసారి వైద్యుల్ని సంప్రదించి అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు 3. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే పిల్లలు దగ్గరుండి చూసుకునే పరిస్థితి లేనపుడు అనవసరంగా బెంగ పడిపోకుండా మీ గురించి మీరే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం చేయించుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. అబ్బాయి పెళ్లి తర్వాత కూడా కోడలికి బాధ్యతలు అప్పగించకుండా అన్ని పనులూ, అభిప్రాయాలు మీరే చూసుకుంటూ అనవసరంగా ఆందోళనపడుతుంటారు. ఎ. కాదు బి. అవును 5. వయసు మీద పడుతుందన్న ఆలోచనను పక్కన పెట్టి బాధ్యతలు తగ్గిన ఈ వయసులో ఎంత హుషారుగా గడపచ్చో ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో మీ తోటి మహిళలతో మీ భావాల్ని పంచుకుని మీరు చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకెళతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’లు ఎక్కువగా వస్తే అరవై ఏళ్ల వయసులో కూడా మానసికంగా, శారీరకంగా హాయిగా ఉన్నట్టు. లేదంటే వృద్ధాప్యాన్ని శాపంగా భావించి మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకుంటున్నట్టు.