ప్యాక్...పర్‌ఫెక్ట్...
స్టార్ ట్రైనర్
జనరల్‌గా అనుకున్న గోల్ రీచ్ అయ్యాక చాలా మంది కొంత లైట్‌గా తీసుకుంటారు. సిక్స్‌ప్యాక్ చేసే టైమ్‌లో సునీల్ బాగా కష్టపడ్డారు. అలాగని ఆ తర్వాత ఫిజిక్‌ని నిర్లక్ష్యం చేయలేదు. ఆయన తన హైట్‌కి తగ్గ వెయిట్ మెయిన్‌టెయిన్ చేస్తూ, షేప్‌లో ఏ మాత్రం తేడా రాకుండా కేర్ తీసుకుంటున్నారు.
బిజీగా ఉన్నా... జిమ్‌కి నో డుమ్మా...
ఇప్పటికీ సునీల్ రోజుకు గంట పాటు జిమ్‌లో తప్పనిసరిగా వర్కవుట్స్ చేస్తారు. ఎంత బిజి షెడ్యూల్ ఉన్నా వర్కవుట్ మానరాయన. ఆయన చేసే సినిమాలను అనుసరించి కూడా తరచుగా వర్కవుట్ స్టైల్స్ మారు్తుంటారు. ఉదాహరణకి ఇటీవల విడుదలైన జక్కన్న సినిమా కోసం ఆయనకు మజిల్ మాస్ ఎక్కువ ఉండాలి. అందుకు అనుగుణమైన వర్కవుట్స్ చేశారు. దీనితో పాటు సహజంగానే డైట్‌లో కూడా మార్పు చేర్పులు ఉంటాయి.
ఇప్పటికీ ఏదైనా సినిమా కోసం సిక్స్‌ప్యాక్ అవసరమైతే... కొన్ని నెలల పాటు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎలాంటి ప్రోగ్రాం చేసినా డైట్ అనేది తప్పనిసరిగా చాలా ప్రధానమైన అంశం. ప్రతి మూడు గంటలకూ ఒకసారి ఫుడ్ తీసుకోవడం అనేది సునీల్ అలవాటు. కఠినమైన వర్కవుట్స్ వల్ల పెరిగే టెంపరేచర్‌ని సాధారణ స్థితిలో నిలిపేందుకు గాను రోజుకు కనీసం మూడు మూడున్నర లీటర్ల నీళ్లు తీసుకుంటారు. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్ర మిస్సవరు. అదే విధంగా ఒక మజిల్‌కు వ్యాయామం చేసినప్పుడు దానికి 48గంటలు రెస్ట్ ఉండాలి. అప్పుడే గాయాల బారిన పడడం గాని, తీవ్రమైన నొప్పులు వంటివి, జాయింట్‌పెయిన్స్ వంటి సమస్యలు ఉండవు. అలాగే మజిల్ గ్రోత్ కూడా బాగుంటుందని ఇచ్చే సూచనలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు. తీసుకునే డైట్‌లో ఏదీ శృతి మించనీయరు.
రోజుకు 50 నుంచి 100 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంతే తీసుకుంటారు. అలాగే ఉదయం పూట కార్బో హైడ్రేట్స్ ఉండే ఆహారం బాగా తీసుకున్నా సాయంత్రం మాత్రం 4.30 గంటల తర్వాత అలాంటి వాటికి గుడ్‌బై. అప్పుడే ఫ్యాట్ ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అవకుండా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ మేళవింపుగా, లంచ్ ఏమో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్‌తో కలిపి ఉంటుంది. సాయంత్రం స్నాక్స్‌గా బాదం లేదా డ్రైఫ్రూట్స్, గ్రీన్ లేదా వైట్ టీ ఉంటాయి. రాత్రి పూట8 గంటల్లోపు సాఫ్ట్ ఫుడ్‌ని డిన్నర్‌గా తీసుకుంటారు.