Physik
-
సిక్స్‌ప్యాక్ టు ఫ్యామిలీప్యాక్ టు సిక్స్‌ప్యాక్...
‘జిమ్’దగీ కుస్తీ పట్టు పట్టే మల్లయోధుడి కధ దంగల్. సినిమా ఎంత హిట్టయిందో అంతకు మించి అమీర్‌ఖాన్ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ టాక్ ఆఫ్ ది ఫిట్నెస్ ఇండస్ట్రీ అయింది. స్లిమ్ ఫిజిక్ నుంచి సిక్స్‌ప్యాక్ దాకా చూసిన వెండితెరకు బొద్దావతారంను పరిచయం చేశాడు అమీర్. గజని, పి.కె నాటి తన సిక్స్‌ప్యాక్‌ను కుస్తీ పట్టలేక ఆయాసపడే బొజ్జావతారంగా మార్చి, తిరిగి తన వెనుకటి ఫిజిక్‌కి మళ్లాడు. ఈ అనూహ్యమైన ట్రాన్స్ఫార్మేషన్ వెనుక ఉన్న స్టార్ ట్రైనర్ రాకేష్ ‘సాక్షి’తో ‘దంగల్’ అనుభవాలను పంచుకున్నారిలా... ఆయన మాటల్లోనే... పి.కె తర్వాత...అప్పటికే మంచి షేప్‌తో ఉన్న అమీర్‌ఖాన్‌ను దంగల్ కోసం రిటైర్ అయిన రెజ్లర్‌గా బొద్దుగా మార్చాలి. ఫ్యాట్ పెంచడం మాత్రమే కాదు తిరిగి దాన్ని అంతే జాగ్రత్తగా తొలగిపోయేలా చేయాలి. ఈ పాత్ర కోసం మేం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. దీని కోసం హిట్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశాం. కేలరీ ఆధారిత డైట్, వెయిట్ పెంచే వర్కవుట్స్ ఎంచుకున్నాం. రోజుకు రెండున్నర గంటలకు ఒకసారి అమీర్ ఆహారం తీసుకునేవారు. అలా 97 కిలోలకు పెరగడానికి నాలుగైదు నెలలు పట్టింది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మాత్రం 6నెలలు పైనే పట్టింది. మొత్తం మీద ఇదొక ఏడాది ప్రోగ్రామ్ అనొచ్చు. ఈ తరహా ట్రాన్స్ఫార్మేషన్ కోసం అమీర్ వందశాతం చిత్తశుద్ధితో కష్టపడ్డారు. ముంబయికి చెందిన డాక్టర్ నిఖిల్ దురేందర్ డైట్ విషయంలో అమీర్‌ఖాన్‌కి డైట్ గైడెన్స్ ఇచ్చారు. ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అమీర్... లావు పెరిగే క్రమంలో తనకు నచ్చినవన్నీ తినగలిగారు. (నవ్వుతూ). ఆరోగ్యకరం 3 నుంచి 5 కిలోలు... పెరిగిన బరువు తగ్గించడానికి మళ్లీ ప్రత్యేకమైన జాగ్రత్తలతో వర్కవుట్స్, డైట్ ఫాలో అయ్యారు అమీర్. బరువు పెరిగే క్రమంలో కూడా కార్డియో వర్కవుట్స్ బాగా చేయడం వల్ల... ఆయన మజిల్స్ పూర్వపు మజిల్స్ తీరులో ఏమీ మార్పు రాలేదు. అయితే వాటి మీద పేరుకున్న ఫ్యాట్ మాత్రం తొలగించేందుకు స్ట్రిక్ట్ డైట్, వర్కవుట్స్ హెల్ప్ అయ్యాయి. ఎవరైనా సరే నెలకు కనీసం 3 నుంచి 5కిలోల వరకూ బరువు తగ్గితే అది పూర్తిగా ఆరోగ్యకరం. అప్పుడు చర్మం వదులయ్యే సమస్య రాదు. పైగా అమీర్‌కి మొదటి నుంచి మంచి మజిల్ మాస్ ఉంది. కాబట్టి... బరువు పెరగడం తరగడం ద్వారా వచ్చే సమస్యలేవీ అతనికి రాలేదు. హాలీవుడ్ నటులు స్థాయిలో ఇలాంటి ప్రయోగాలు అమీర్‌కే సాధ్యం. రాబోయే యష్‌రాజ్ సినిమాలో మీరు మరింత అద్భుతమైన లుక్‌లో అమీర్‌ఖాన్‌ను చూడబోతున్నారు. ఆ మార్పు చేర్పులకు ఏడాది పట్టింది ‘సాక్షి’తో అమీర్‌ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ -
డిమాండ్ చేస్తే తప్పుతుందా?
రొటీన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఫిజిక్ కోసం ప్రత్యేకంగా వర్కవుట్లు చేయాల్సిన పని లేదు. కొత్త రకం పాత్రలైతే చేయక తప్పదు. ఇప్పుడు అఖిల్ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ యువహీరో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చాలా ఫిట్‌గా కనిపించనున్నారు. దానికోసం కసరత్తులు మొదలుపెట్టారు. ‘‘ఇప్పటివరకూ చేసిన వర్కవుట్స్ వేరు. ఇప్పుడు చేస్తున్నవి వేరు. నా ఫిజికల్ ట్రైనర్ కొత్త వర్కవుట్ షెడ్యూల్ ఇచ్చారు. డైట్ కూడా కొత్తగా ప్లాన్ చేశారు. విక్రమ్ సినిమా ఫిజికల్‌గా చాలా డిమాండ్ చేస్తోంది’’ అని అఖిల్ అన్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పుతుందా? -
‘ధృవ’తార... దృఢావతార...
‘చిరుత’నయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్... ధృవ సినిమాలో టాప్‌క్లాస్ ఫిజిక్‌తో... తర్వాత ఈ విషయంలో తండ్రికే గురువయ్యాడు. ఆ సినిమాలో చెక్కిన శిల్పంలా అనిపించిన ఈ ధృవతారను చెక్కిన శిల్పి కూడా మామూలు ట్రైనర్ కాదు. అతని పేరు రాకేష్. ముంబయిలో పేరొందిన ఫిట్నెస్ శిక్షకుడు. కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నుంచి దంగల్ ఫైటర్ అమీర్‌ఖాన్ దాకా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫిజిక్‌లను తీర్చిదిద్దాడు. చరణ్ కోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కి వచ్చి మరీ శిక్షణ అందించిన రాకేష్ ‘సాక్షి’తో మాట్లాడారు. సల్మాన్ నేను చాలా కాలంగా మంచి మిత్రులం. ఆయన ఎప్పటి నుంచో నా దగ్గరే వ్యాయామ శిక్షణ పొందుతున్నారు. సల్మాన్ నాకు రామ్ చరణ్‌ను పరిచయం చేశారు. అప్పటికే రామ్ చరణ్‌ది మంచి ఫిజిక్. అయితే తన తర్వాతి సినిమాలోని పాత్రకు గాను పూర్తి బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కావాలని ఆయన కోరుకున్నారు. అందుకు మూడు నెలల పైన సమయం మాకు పట్టింది. ప్రత్యేకమైన స్టైల్ డిజైన్ చేశా : రామ్ చరణ్ మంచి ఫిజిక్కు... అతను చాలా మంచి డ్యాన్సర్ కావడం కూడా ఒక కారణమని నేననుకుంటాను. సరే... చరణ్ కోసం రెగ్యులర్‌గా కాకుండా ఎమ్‌టియుటి (మెనస్ టైమ్ అండర్ టెన్షన్) స్టైల్ అనే ఒక ప్రత్యేకమైన వర్కవుట్ డిజైన్ చేశాను. ఇదే అమీర్‌ఖాన్‌కి కూడా డిజైన్ చేశాను. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలిస్తాను. అదే విధంగా చరణ్‌ను కూడా విశ్లేషించి ఆయన వర్కవుట్‌ని ప్లాన్ చేశాం. చరణ్ చాలా పట్టుదల గల వ్యక్తి కావడంతో నా పని మరింత తేలికైంది. బ్యాలెన్స్డ్ డైట్ : చరణ్ లక్ష్యానికి అనుగుణంగా సింపుల్ కార్బ్ డైట్ ఫాలో అయ్యాడు. దాదాపు 1900 నుంచి 2000 కేలరీల వరకూ ఆహారం ద్వారా అందేలా జాగ్రత్త పడ్డాం. దీనిలో ప్రోటీన్‌ను, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నింటినీ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాం. రెండు పూటలా...వర్కవుట్ : ఉదయం, సాయంత్రం రెండు పూటలా వర్కవుట్ టైమింగ్స్ సెట్ చేసుకున్నాం. ఉదయం కనీసం 45 నిమిషాల కార్డియోతో చరణ్ వర్కవుట్ ప్రారంభమయ్యేది. ఆ తర్వాత ఎమ్‌టియుటి పద్ధతిలో వర్కవుట్. అదే విధంగా సాయంత్రం గంట పాటు వర్కవుట్ తర్వాత 30 నిమిషాల పాటు కార్డియో ఉండేది. నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ కార్డియో వర్కవుట్ చాలా అవసరం. కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకూ కార్డియో వ్యాయామాలు చేయాల్సిందే. అది శారీరక సామర్ధ్యాన్ని సానబెడుతుంది. క్రెడిట్ అంతా చరణ్‌దే : చరణ్ ప్రతి రోజూ ఉదయం 2గంటలు, సాయంత్రం 2గంటలు వర్కవుట్ చేసేవాడు. ఉదయం 5గంటల నుంచి కార్డియో, యాబ్స్... చేసేవారు. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యాక 2 మజిల్ గ్రూప్స్‌కి చేసేవారు. ఏ వర్కవుట్ అయినా రిపిటీషన్స్ కౌంట్ ఉండేది కాదు ఎంత చేయగలిగితే అంత అన్నట్టుండేది. ఆయన వ్యాయామం జులైలో ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలల్లోనే సిక్స్‌ప్యాక్‌తో పాటు మంచి ఫిజిక్‌ని సాధించారు. –డామ్నిక్, ట్రైనర్ (స్థానికంగా చరణ్‌కి శిక్షణ ఇచ్చారు) -
ప్యాక్...పర్ఫెక్ట్...
స్టార్ ట్రైనర్ జనరల్‌గా అనుకున్న గోల్ రీచ్ అయ్యాక చాలా మంది కొంత లైట్‌గా తీసుకుంటారు. సిక్స్‌ప్యాక్ చేసే టైమ్‌లో సునీల్ బాగా కష్టపడ్డారు. అలాగని ఆ తర్వాత ఫిజిక్‌ని నిర్లక్ష్యం చేయలేదు. ఆయన తన హైట్‌కి తగ్గ వెయిట్ మెయిన్‌టెయిన్ చేస్తూ, షేప్‌లో ఏ మాత్రం తేడా రాకుండా కేర్ తీసుకుంటున్నారు. బిజీగా ఉన్నా... జిమ్‌కి నో డుమ్మా... ఇప్పటికీ సునీల్ రోజుకు గంట పాటు జిమ్‌లో తప్పనిసరిగా వర్కవుట్స్ చేస్తారు. ఎంత బిజి షెడ్యూల్ ఉన్నా వర్కవుట్ మానరాయన. ఆయన చేసే సినిమాలను అనుసరించి కూడా తరచుగా వర్కవుట్ స్టైల్స్ మారు్తుంటారు. ఉదాహరణకి ఇటీవల విడుదలైన జక్కన్న సినిమా కోసం ఆయనకు మజిల్ మాస్ ఎక్కువ ఉండాలి. అందుకు అనుగుణమైన వర్కవుట్స్ చేశారు. దీనితో పాటు సహజంగానే డైట్లో కూడా మార్పు చేర్పులు ఉంటాయి. ఇప్పటికీ ఏదైనా సినిమా కోసం సిక్స్‌ప్యాక్ అవసరమైతే... కొన్ని నెలల పాటు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎలాంటి ప్రోగ్రాం చేసినా డైట్ అనేది తప్పనిసరిగా చాలా ప్రధానమైన అంశం. ప్రతి మూడు గంటలకూ ఒకసారి ఫుడ్ తీసుకోవడం అనేది సునీల్ అలవాటు. కఠినమైన వర్కవుట్స్ వల్ల పెరిగే టెంపరేచర్ని సాధారణ స్థితిలో నిలిపేందుకు గాను రోజుకు కనీసం మూడు మూడున్నర లీటర్ల నీళ్లు తీసుకుంటారు. రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్ర మిస్సవరు. అదే విధంగా ఒక మజిల్‌కు వ్యాయామం చేసినప్పుడు దానికి 48గంటలు రెస్ట్ ఉండాలి. అప్పుడే గాయాల బారిన పడడం గాని, తీవ్రమైన నొప్పులు వంటివి, జాయింట్‌పెయిన్స్ వంటి సమస్యలు ఉండవు. అలాగే మజిల్ గ్రోత్ కూడా బాగుంటుందని ఇచ్చే సూచనలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు. తీసుకునే డైట్లో ఏదీ శృతి మించనీయరు. రోజుకు 50 నుంచి 100 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంతే తీసుకుంటారు. అలాగే ఉదయం పూట కార్బో హైడ్రేట్స్ ఉండే ఆహారం బాగా తీసుకున్నా సాయంత్రం మాత్రం 4.30 గంటల తర్వాత అలాంటి వాటికి గుడ్‌బై. అప్పుడే ఫ్యాట్ ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అవకుండా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ మేళవింపుగా, లంచ్ ఏమో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్‌తో కలిపి ఉంటుంది. సాయంత్రం స్నాక్స్‌గా బాదం లేదా డ్రైఫ్రూట్స్, గ్రీన్ లేదా వైట్ టీ ఉంటాయి. రాత్రి పూట8 గంటల్లోపు సాఫ్ట్ ఫుడ్‌ని డిన్నర్గా తీసుకుంటారు. -
లవ్‌కి బయోడేటాతో పనేంటి?
ఎవరినైనా ప్రేమించాలంటే ఎదుటి వాళ్ల మనసు మంచిదా? కాదా? వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లాంటివి వెరిఫై చేస్తారు. ఓ కుర్రాడు తన గాళ్‌ఫ్రెండ్ కుమారిని కూడా ఇలాగే అడిగితే...‘‘లవ్ చేయడానికి నా ఫిజిక్ చాలదా? నా బయోడేటా మొత్తం కావాలా?’’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. మరి ఈ కుమారిని లవ్ చేయాలా? వద్దా? అని డైలామాలో పడతాడు ఈ ప్రేమికుడు. చివరకు ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ లవ్‌స్టోరీకి సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. రాజ్‌తరుణ్ అభినయం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్. -
అలా చేస్తే... బాహువులుబలి
సిటీయూత్లో బాహుబలి సినిమా ఇప్పుడు కొత్త ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్ తరహా ఫిజిక్ కోసం యువకులు జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. మెడ నుంచి వీపు దిగువ వరకూ ‘వి’ షేప్‌తో అదరగొట్టిన ప్రభాస్ తరహా లుక్ కోసం వీరు ట్రైనర్లను సంప్రదిస్తున్నారు. ‘ఒకటే షేప్ కోసం ప్రయాస పడడం కాదు. ఓవరాల్‌గా ఫిజిక్‌ను తీర్చిదిద్దుకోవాలి. అలా కాకపోతే ఫిజిక్ సమతుల్యం కోల్పోతుంది’అంటున్నారు ‘సోల్’ జిమ్‌కు చెందిన ట్రైనర్ వెంకట్. ఆయన చేస్తున్న సూచనలేమిటంటే... వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాల పేరు లెటిజమ్ మజిల్. మొత్తం దేహంలోనే అతి పెద్ద మజిల్ ఇది. అప్పర్ బ్యాక్ బాడీ షేప్ మొత్తం నిర్దేశించే మజిల్గా దీన్ని చెప్పవచ్చు. ఈ భాగం సరైన రీతిలో పికప్ అయితేనే వి-షేప్ లుక్ వస్తుంది. అలాగే నడుం నుంచి లాట్స్ ప్రారంభం వరకూ ఉండే మజిల్‌ను లోయర్ బ్యాక్ అంటారు. ఈ ప్రాంతంలోని మజిల్‌ను తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ భాగానికి కఠినమైన వ్యాయామాలతో ప్రభాస్ లాంటి క్రిస్మస్ ట్రీ షేప్ పొందవచ్చు. చాలా మంది అప్పర్ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, లోయర్ బాడీని నిర్లక్ష్యం చేస్తారు. అయితే పై భాగానికి మితిమీరి వర్కవుట్ ఇస్తున్నప్పుడు లోయర్ పార్ట్‌కి సమాంతరంగా ఇవ్వాలి. లేని పక్షంలో ఆ పార్ట్ సహజంగా ఉండాల్సిన ఫిట్నెస్ను సైతం కోల్పోతుంది. పైగా లోయర్ పార్ట్‌కి చేస్తేనే మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. లెగ్స్ స్ట్రెంగ్త్ లేకపోతే వెన్ను, మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందుకే రెగ్యులర్‌గా స్క్వాట్స్, లంజెస్, క్వార్డ్రయిసప్స్, కాఫ్ వంటివి చేయాలి. ‘వి’షేప్ సాధనలో భాగంగా చినప్స్ చాలా ముఖ్యం. ట్రిపిజల్స్, ట్రైసప్, లాట్స్, బ్యాక్ ప్రెస్, బెంచ్‌ప్రెస్... ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో చేయాలి. లేకపోతే చెక్కినట్టుండే రూపం సాధ్యం కాదు. పొట్ట ప్రాంతంలో కండరాల బలోపేతానికి అబ్డామినల్ వర్కవుట్స్, క్రంచెస్ బాగా చేయాలి. ఈ తరహా షేప్ కోసం కఠినమైన వ్యాయామాలు చేయాలి కాబట్టి, ముందుగా డాక్టర్ సలహా తీసుకుని ట్రైనర్ పర్యవేక్షణలో చేయాలి. -
గ్లామర్ ఫీల్డ్కి రాను.. నా లక్ష్యం వేరు..
5.10 అంగుళాలకు పైగా ఎత్తు, తీరైన ఫిజిక్. ముఖవర్ఛస్సు.. వెండి తెరపై వెలిగిపోయే అర్హతలున్న ఓ అచ్చ తెలుగమ్మాయి.. ‘ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్’లో పాల్గొంది. గ్లామర్ రంగం ఆమెకు రెడ్‌కార్పెట్ పరిచేసింది. అయితే, అందరికీ షాక్ ఇస్తూ ఆమె సున్నితంగా నో చెప్పేసింది. ఎందుకలా..? అని ప్రశ్నిస్తే ‘నా లక్ష్యం వేరు’.. అంటోంది అనుపమ సామంతపూడి. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ‘హాయ్... వుయ్ ఆర్ ఫ్రం సాక్షి డైలీ’ అంటూ పరిచయం చేసుకోబోతే... ‘చక్కగా తెలుగులో మాట్లాడుకుందాం. నేను తెలుగమ్మాయినే’ అంటూ నవ్వుతూ మాట కలిపారు అనుపమ. ఆరడుగుల బుల్లెట్‌కి సరిజోడీలా ఉన్న అమ్మాయి నోట తెలుగు పలుకులు విని షాక్ తింటూ జరిపిన ముచ్చట్ల సమాహారం ఆమె మాటల్లోనే.. మిస్ విజయవాడ టు.. మిసెస్ ఇంటర్నేషనల్.. ‘మాది విజయవాడ, పాఠశాల చదువు అక్కడి ఎట్కిన్సన్ స్కూల్లో, కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చేశాను. ఏ రంగంలోనైనా నన్ను నేను నిరూపించుకోవడం అంటే నాకిష్టం. చిన్నప్పటి నుంచి బ్యూటీ పేజెంట్ల మీద ఆసక్తి. కాలేజ్ డేస్‌లో ‘మిస్ విజయవాడ 2006’ టైటిల్ గెలిచాను. మిస్ ఇండియాకి వెళ్లాలనుకున్నా. కానీ చదువవగానే అనుకోకుండా పెళ్లైపోయింది. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. లాస్ ఏంజెల్స్‌లో కాస్మొటాలజీ కోర్సు చేస్తున్నప్పుడు కాలేజ్ లెవల్ బ్యూటీ టైటిల్ గెలిచాను. రెండేళ్ల క్రితం మా ఫ్యామిలీ హైదరాబాద్‌కి వచ్చేశాం. పెళ్ళైంది... లైఫ్ రొటీన్లో పడిపోయింది. ఇక అందాల పోటీల గురించి మర్చిపోయాను. కానీ ఒక ఫ్రెండ్ పదే పదే ఒత్తిడి చేయడం, ప్రోత్సహించడంతో వెళ్లాను. అంతా ఆడిషన్స్ నుంచే టైటిల్ విన్నర్ అవుతానన్నారు. పూనెలో జరిగిన ఫైనల్స్‌లో ‘మిసెస్ ఇండియా ప్లానెట్’ గెలిచాను. ఏమైనా.. ఆ పోటీలో పాల్గొనడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్’. వ్యాపారవేత్తగా రాణించాలి.. ‘సినిమా, మోడలింగ్‌లో ప్రవేశించాలని నేను బ్యూటీ పేజెంట్స్‌లో పాల్గొనలేదు. వ్యాపారవేత్తగా రాణించాలనేది నా లక్ష్యం. అందుకే పలు బ్రాండ్స్‌కి మోడల్‌గా ఆఫర్లు వచ్చినా, గ్లామర్ రంగం నుంచి సైతం అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. బ్యూటీ పేజెంట్‌లో పాల్గొనడం అనేది నాలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. నేను కలలుగంటున్న రంగంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు అది ఉపకరిస్తుంది. ప్రస్తుతం గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఫ్యాషన్ కాన్సెప్ట్స్ బ్రాండ్ రన్ చేస్తున్నాం. బ్యూటీ ఫీల్డ్ అంటే అమ్మాయిలు. చాలా ఫాస్ట్‌గా ఉంటారని, పొట్టి దుస్తులకు కేరాఫ్‌లా ఉంటారని అంటూంటారు. అయితే నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను. ట్రెడిషనల్‌గా, డీసెంట్‌గా ఉండే అమ్మాయిలు కూడా ఈ రంగంలో రాణించగలరని నిరూపించాలనుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో సోషల్ సర్వీస్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను’.