సిక్స్‌ప్యాక్ టు ఫ్యామిలీప్యాక్ టు సిక్స్‌ప్యాక్...
‘జిమ్’దగీ
కుస్తీ పట్టు పట్టే మల్లయోధుడి కధ దంగల్. సినిమా ఎంత హిట్టయిందో అంతకు మించి అమీర్‌ఖాన్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ టాక్ ఆఫ్ ది ఫిట్‌నెస్ ఇండస్ట్రీ అయింది. స్లిమ్ ఫిజిక్ నుంచి సిక్స్‌ప్యాక్ దాకా చూసిన వెండితెరకు బొద్దావతారంను పరిచయం చేశాడు అమీర్. గజని, పి.కె నాటి తన సిక్స్‌ప్యాక్‌ను కుస్తీ పట్టలేక ఆయాసపడే బొజ్జావతారంగా మార్చి, తిరిగి తన వెనుకటి ఫిజిక్‌కి మళ్లాడు. ఈ అనూహ్యమైన ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న స్టార్ ట్రైనర్ రాకేష్ ‘సాక్షి’తో ‘దంగల్’ అనుభవాలను పంచుకున్నారిలా...
ఆయన మాటల్లోనే...
పి.కె తర్వాత...అప్పటికే మంచి షేప్‌తో ఉన్న అమీర్‌ఖాన్‌ను దంగల్ కోసం రిటైర్ అయిన రెజ్లర్‌గా బొద్దుగా మార్చాలి. ఫ్యాట్ పెంచడం మాత్రమే కాదు తిరిగి దాన్ని అంతే జాగ్రత్తగా తొలగిపోయేలా చేయాలి. ఈ పాత్ర కోసం మేం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. దీని కోసం హిట్ అనే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశాం. కేలరీ ఆధారిత డైట్, వెయిట్ పెంచే వర్కవుట్స్ ఎంచుకున్నాం. రోజుకు రెండున్నర గంటలకు ఒకసారి అమీర్ ఆహారం తీసుకునేవారు. అలా 97 కిలోలకు పెరగడానికి నాలుగైదు నెలలు పట్టింది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మాత్రం 6నెలలు పైనే పట్టింది. మొత్తం మీద ఇదొక ఏడాది ప్రోగ్రామ్ అనొచ్చు. ఈ తరహా ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం అమీర్ వందశాతం చిత్తశుద్ధితో కష్టపడ్డారు. ముంబయికి చెందిన డాక్టర్ నిఖిల్ దురేందర్ డైట్ విషయంలో అమీర్‌ఖాన్‌కి డైట్ గైడెన్స్ ఇచ్చారు. ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అమీర్... లావు పెరిగే క్రమంలో తనకు నచ్చినవన్నీ తినగలిగారు. (నవ్వుతూ).
ఆరోగ్యకరం 3 నుంచి 5 కిలోలు...
పెరిగిన బరువు తగ్గించడానికి మళ్లీ ప్రత్యేకమైన జాగ్రత్తలతో వర్కవుట్స్, డైట్ ఫాలో అయ్యారు అమీర్. బరువు పెరిగే క్రమంలో కూడా కార్డియో వర్కవుట్స్ బాగా చేయడం వల్ల... ఆయన మజిల్స్ పూర్వపు మజిల్స్ తీరులో ఏమీ మార్పు రాలేదు. అయితే వాటి మీద పేరుకున్న ఫ్యాట్ మాత్రం తొలగించేందుకు స్ట్రిక్ట్ డైట్, వర్కవుట్స్ హెల్ప్ అయ్యాయి. ఎవరైనా సరే నెలకు కనీసం 3 నుంచి 5కిలోల వరకూ బరువు తగ్గితే అది పూర్తిగా ఆరోగ్యకరం. అప్పుడు చర్మం వదులయ్యే సమస్య రాదు. పైగా అమీర్‌కి మొదటి నుంచి మంచి మజిల్ మాస్ ఉంది. కాబట్టి... బరువు పెరగడం తరగడం ద్వారా వచ్చే సమస్యలేవీ అతనికి రాలేదు. హాలీవుడ్ నటులు స్థాయిలో ఇలాంటి ప్రయోగాలు అమీర్‌కే సాధ్యం. రాబోయే యష్‌రాజ్ సినిమాలో మీరు మరింత అద్భుతమైన లుక్‌లో అమీర్‌ఖాన్‌ను చూడబోతున్నారు.
ఆ మార్పు చేర్పులకు ఏడాది పట్టింది ‘సాక్షి’తో అమీర్‌ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్