హాయ్ హాయ్.. కులాసా | Deepika Padukone-Sonam Kapoor's Cold War Finally Ends! | Sakshi
Sakshi News home page

హాయ్ హాయ్.. కులాసా

Published Tue, Sep 9 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

హాయ్ హాయ్.. కులాసా

హాయ్ హాయ్.. కులాసా

చాన్నాళ్ల నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ మళ్లీ ఒక్కటయ్యారు. సోనమ్ కపూర్ కజిన్ అర్జున్ కపూర్, దీపిక జంటగా నటించిన ఫైండింగ్ ఫానీ చిత్రం స్పెషల్ షోలో వీరిద్దరూ తారసపడ్డారు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్లాష్‌బ్యాక్ గొడవలన్నీ మరచిపోయి ఆప్యాయుంగా పలకరించుకున్నారు.
 
 బై బై.. గణేశా
 వెటరన్ నటి శిల్పాశెట్టి చిందేసింది. గణేశుడి నిమజ్జనోత్సవంలో ఆటపాటలతో సందడి చేసింది. భర్త రాజ్‌కుంద్రా, సోదరి షమితాశెట్టితో కలసి.. ‘గణపతి బప్పా మోరియూ’ అంటూ ఊరేగింపులో పాల్గొంది. అదిరిపోయే స్టెప్పులతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికింది.
 
 నో నో.. హమేషా
 హీరోపంటి హిట్‌తో కిక్ మీదున్న జాకీష్రాఫ్ కొడుకు టైగర్‌ష్రాఫ్ ఆచితూచి ఆడుగేస్తానంటున్నాడు. జాకీష్రాఫ్‌కు బ్రేక్ ఇచ్చిన రామ్‌లఖన్ మూవీ రీమేక్‌లో ఆఫర్ వచ్చినా నో అన్నాడు. తన తండ్రి నటించిన ఏ మూవీ రీమేక్‌లోనూ యాక్ట్ చేయనని తేల్చి చెప్పాడు. 1989లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రామ్‌లఖన్ మూవీని డెరైక్టర్ రోహిత్‌షెట్టి రీమేక్ చేసే పనుల్లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement