వేసవిలో 50 ప్రత్యేక రైళ్లు | 50 special trains in summer, says SCR | Sakshi
Sakshi News home page

వేసవిలో 50 ప్రత్యేక రైళ్లు

Published Fri, Mar 25 2016 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

వేసవిలో 50 ప్రత్యేక రైళ్లు

వేసవిలో 50 ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేసవిలో పలు ప్రాంతాలకు 50 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ వెల్లడించారు. తిరుపతి- నాగర్‌సోల్, విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-ధర్మవరం ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు ప్రతి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తిరుపతి-నాగర్‌సోల్, ఏప్రిల్ 2 నుంచి మే 28వరకు ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్-తిరుపతి, ఏప్రిల్ 7 నుంచి మే 26 వరకు ప్రతి గురువారం రాత్రి 11 గంటలకు విజయవాడ- విశాఖ, ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ-విజయవాడ, ఏప్రిల్ 8 నుంచి మే 27 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు విశాఖ-ధర్మవరం, ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ధర్మవరం- విశాఖకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement