కాటేదాన్: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై నాగాచారి తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చింతల్‌మెంట్ ప్రాంతానికి చెందిన సయ్యద్‌బాబు(20). ఆదివారం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు లక్ష్మీగూడ వాంబేకాలనీలోని కొత్త చెరువుకు వచ్చాడు.
చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు బాబు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. గట్టుపై బాబు చెప్పులను గ్రహించిన స్నేహితులు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాబు మృతదేహాన్ని వెలికితీసేందుకు రాత్రి 7 గంటల వరకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన సరదా...
Published Sun, Mar 13 2016 9:23 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement
Advertisement