జీహెచ్‌ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారని ఉద్యోగ నేతల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2న జరిగే గ్రేటర్ ఎన్నికల విధులకు సంబంధించి టీచర్లు, ఉద్యోగుల్లో వికలాంగులు, మెటర్నటీ లీవ్‌లో ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే మినహాయింపు ఇస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పీఆర్‌టీయూ-టీఎస్, పీఆర్‌టీయూ-తెలంగాణ సం ఘాల నేతలు వేర్వేరుగా పేర్కొన్నారు. సోమవారం ఆయా సంఘాల నేతలు పులి సరోత్తంరెడ్డి, నర హరి లక్ష్మారెడ్డి, జి.హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య జనార్దన్‌రెడ్డిని కలసి వినతిపత్రాలు అందజేశారు.
వికలాంగులు, మెటర్నటీ లీవ్‌లో ఉన్న వారిని ఎన్నికల విధులకు రావాలని ఆదేశాలిచ్చారని, వారికి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాలని జనార్దన్‌రెడ్డిని కోరారు.
ఆధారాలతో వస్తే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు
Published Tue, Jan 12 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement